
న్యూఢిల్లీ: అల్గోరిథమిక్ ట్రేడింగ్‌ను ఆఫర్ చేసే అనియంత్రిత ప్లాట్‌ఫామ్‌లతో లావాదేవీలు జరిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హెచ్చరించింది. కీలకమైన వ్యక్తిగత వివరాల్లాంటివి వాటికి ఇవ్వొద్దని సూచించింది. ‘ఇలాంటి ప్లాట్‌ఫామ్‌లు నియంత్రణ పరిధిలో లేవు.
కాబట్టి వాటిపై ఫిర్యాదుల పరిష్కారానికి ఎటువంటి వ్యవస్థ లేదు. అందుకే ఆయా ప్లాట్‌ఫామ్‌లతో లావాదేవీల విషయంలో ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి‘ అని ఒక ప్రకటనలో సెబీ పేర్కొంది. ట్రేడింగ్ లావాదేవీలను ఆటోమేటిక్‌గా నిర్వహించే ఆల్గో సర్వీసులతో అధిక లాభాలు ఆర్జించవచ్చంటూ ఇటీవలి కాలంలో జోరుగా ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో సెబీ హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment