Trading Platform
-
తప్పుడు ప్లాట్‌ఫామ్స్‌తో జాగ్రత్త
తప్పుదారి పట్టించే ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్‌పట్ల జాగ్రత్త వహించమంటూ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా ఇన్వెస్టర్లను హెచ్చరించింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) మార్గంలో దేశీ ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ అవకాశాలను కల్పించనున్నట్లు పేర్కొనే ప్లాట్‌ఫామ్స్‌పట్ల అప్రమత్తతను ప్రదర్శించవలసిందిగా సూచించింది. మోసగాళ్లు స్టాక్ మార్కెట్ పేరుతో ఆన్లైన్ ట్రేడింగ్ కోర్సులు, సెమినార్లు, మెంటార్íÙప్ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా ఇన్వెస్టర్లను బురిడీ కొట్టిస్తున్నట్లు వివరించింది. ఇందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ తదితర లైవ్ బ్రాడ్క్యాస్ట్లను వినియోగించుకుంటున్నట్లు పేర్కొంది. సెబీ వద్ద రిజిస్టరైన ఎఫ్‌పీఐలు లేదా ఉద్యోగులులా మభ్యపెడుతూ అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకునేలా వ్యక్తిగత ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు వెల్లడించింది. సంస్థాగత ఖాతాల లబ్దిని అందుకోమని ప్రోత్సహిస్తూ షేర్ల కొనుగోలు, ఐపీవోలకు దరఖాస్తు తదితరాలను ఆఫర్ చేస్తున్నట్లు తెలియజేసింది. ఇందుకు ఎలాంటి ట్రేడింగ్ లేదా డీమ్యాట్ ఖాతా అవసరంలేదంటూ తప్పుదారి పట్టిస్తున్నట్లు వివరించింది. ఈ పథకాలకు తప్పుడు పేర్లతో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్లను సైతం వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. -
సీడీఎస్ఎల్ రికార్డు, 7 కోట్లు దాటేసిన డిమ్యాట్ ఖాతాలు
న్యూఢిల్లీ: డిపాజిటరీ సేవలను అందించే సీడీఎస్ఎల్ మరో కొత్త మైలురాయిని అధిగమించింది. సంస్థ నిర్వహణలో డీమ్యాట్ ఖాతాలు 7 కోట్ల మార్క్‌ను దాటాయి. సీడీఎస్ఎల్ 1999లో కార్యకలాపాలు ప్రారంభించింది. డీమ్యాట్ ఖాతాల ద్వారా ఇన్వెస్టర్ల సెక్యూరిటీల లావాదేవీలకు ఈ సంస్థ సేవలు అందిస్తుంటుంది. తాము ఏడు కోట్ల ఖాతాల మైలురాయిని అధిగమించడం తమకు మాత్రమే కాకుండా, మొత్తం భారత సెక్యూరిటీల మార్కెట్ ఎకోసిస్టమ్‌కు ప్రోత్సాహాన్నిస్తున్నట్టు సీడీఎస్ఎల్ ఎండీ, సీఈవో నెహల్ వోరా అన్నారు. యాక్టివ్ డీమ్యాట్ ఖాతాల సంఖ్య పరంగా సీడీఎస్ఎల్ దేశంలోనే అతిపెద్ద డిపాజిటరీ సేవల సంస్థగా ఉంది. మరో సంస్థ ఎన్ఎస్డీఎల్ కూడా ఇదే విధమైన సేవలు అందిస్తుంటుంది. -
ఆల్గో ప్లాట్‌ఫామ్స్‌తో జాగ్రత్త
న్యూఢిల్లీ: అల్గోరిథమిక్ ట్రేడింగ్‌ను ఆఫర్ చేసే అనియంత్రిత ప్లాట్‌ఫామ్‌లతో లావాదేవీలు జరిపే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హెచ్చరించింది. కీలకమైన వ్యక్తిగత వివరాల్లాంటివి వాటికి ఇవ్వొద్దని సూచించింది. ‘ఇలాంటి ప్లాట్‌ఫామ్‌లు నియంత్రణ పరిధిలో లేవు. కాబట్టి వాటిపై ఫిర్యాదుల పరిష్కారానికి ఎటువంటి వ్యవస్థ లేదు. అందుకే ఆయా ప్లాట్‌ఫామ్‌లతో లావాదేవీల విషయంలో ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి‘ అని ఒక ప్రకటనలో సెబీ పేర్కొంది. ట్రేడింగ్ లావాదేవీలను ఆటోమేటిక్‌గా నిర్వహించే ఆల్గో సర్వీసులతో అధిక లాభాలు ఆర్జించవచ్చంటూ ఇటీవలి కాలంలో జోరుగా ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో సెబీ హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది. -
స్టాక్స్‌లో ట్రేడింగ్ చేస్తారా..! అయితే మీకో గుడ్‌న్యూస్..!
స్టాక్స్ మార్కెట్స్‌లో ట్రేడింగ్ చేసే వారికోసం ప్రముఖ ఫైనాన్షియల్ సంస్థ ధని స్టాక్స్ లిమిటెడ్ సరికొత్త ట్రేడింగ్ ప్లాట్‌ఫాం ధని స్టాక్స్‌ను లాంచ్ చేసింది. ఈక్విటీ, ఎఫ్&ఓ, ఇంట్రా-డే, డెలివరీతో సహా అన్ని విభాగాలలో ట్రేడర్స్‌కు జీరో బ్రోకరేజీతో సేవలను అందించనుంది. ధని యాప్..! ఒక క్లిక్‌తో లాగిన్.. ట్రేడర్స్‌ను దృష్టిలో ఉంచుకొని ధని స్టాక్స్ లిమిడెట్ కంపెనీ ధనీ యాప్‌లో ట్రేడింగ్ ప్లాట్‌ఫాంను జత చేసింది. ఒక క్లిక్‌తో ట్రేడర్స్ లాగిన్ అయ్యే విధంగా యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను 'లెస్ ఈజ్ మోర్' అనే థీమ్‌తో రూపొందించారు. ఈ యాప్‌తో ట్రేడర్స్‌కు స్టాక్స్ విషయంలో అయోమయాన్ని తగ్గిస్తూ, ట్రేడింగ్ అనుభవాన్ని మరింత సరళంగా చేయనుంది. కొత్తగా ట్రేడింగ్ చేసే వారికోసం అకౌంట్ ఓపెనింగ్, వార్షిక మెయింటెనెన్స్‌పై ఎలాంటి ఛార్జీలను విధించడం లేదు. దాంతో పాటుగా ఎండ్ టు ఎండ్ ఆన్లైన్ ప్రాసెస్‌ను ట్రేడర్స్‌కు ధని అందించనుంది. సరికొత్త UI/X డిజైన్‌తో ట్రేడింగ్ సంక్లిష్టతను వన్-క్లిక్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్, రియల్ టైమ్ కోట్స్, ఇన్-డెప్త్ స్టాక్ అనాలిసిస్, అనుకూలీకరించదగిన వాచ్‌లిస్ట్‌లు, ఐపీవో పెట్టుబడుల వంటి అంశాలను మరింత సులభతరం చేస్తుంది. దీంతో ట్రేడర్స్‌కు ట్రేడింగ్ సరళీకృతం అవుతోందని ధని స్టాక్స్ సీఈవో దివ్యేష్ షా అభిప్రాయపడ్డారు. చదవండి: ఈ బడ్జెట్లు స్వతంత్ర భారతంలో వెరీ స్పెషల్.. -
కంపెనీల మధ్య పోటాపోటీ..! నిన్న అమితాబ్ బచ్చన్..నేడు రణ్‌వీర్‌సింగ్..!
ప్రపంచవ్యాప్తంగా సంప్రాదాయ కరెన్సీ స్థానాల్లో పలు డిజిటల్ కరెన్సీలు(క్రిప్టోకరెన్సీలు) గణనీయమైన అభివృద్ధిని సాధిస్తున్నాయి. ప్రపంచదేశాల్లోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోని ప్రజలు క్రిప్టోకరెన్సీలను భారీగా ఆదరిస్తున్నారు. క్రిప్టోకరెన్సీకు స్వీకరణలో భారత్ రెండో స్థానంలో నిలవడం గమనర్హం. క్రిప్టోకరెన్సీపై భారతీయులు ఎక్కువ ఆదరణను చూపడంతో పలు ఫిన్‌టెక్ కంపెనీలు క్రిప్టోకరెన్సీపై అవగాహన కల్పించేందుకు గాను కాయిన్‌స్విచ్, వజీర్ఎక్స్, కాయిన్ డీసీఎక్స్ వంటి కంపెనీలు సమయాత్తమయ్యాయి. చదవండి: అమెజాన్ ప్రైమ్ యూజర్లకు గుడ్‌న్యూస్...! నిన్న అమితాబ్ బచ్చన్..నేడు రణ్‌వీర్‌సింగ్..! భారత్‌లో క్రిప్టోకరెన్సీపై ఆదరణను మరింత క్యాష్ చేసుకునేందుకు పలు కంపెనీలు సిద్దమైనాయి. కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ను కాయిన్ డీసీఎక్స్ అంబాసిడర్‌గా నియమించుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో భారత క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం కంపెనీ కాయిన్‌స్విచ్ కుబేర్ రణ్‌వీర్‌సింగ్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. కొద్ది రోజుల క్రితమే కాయిన్‌స్విచ్ కుబేర్ యూనికార్న్ క్లబ్లో జాయిన్ అయ్యింది. కంపెనీ వాల్యూయేషన్ సుమారు 1.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది. క్రిప్టోకరెన్సీ విషయంలో కాయిన్ స్విచ్ రణ్‌వీర్‌సింగ్‌తో మూడు యాడ్స్‌ను రూపోందించనున్నట్లు తెలుస్తోంది. కాయిన్‌స్విచ్ కుబేర్ ‘కుచ్ తో బద్లేగా..’ క్యాంపెయిన్‌తో టైర్-2, టైర్-3 నగరాల్లో క్రిప్టోకరెన్సీపై అవగాహన కల్పించాలని కంపెనీ భావిస్తోంది. అంతేకాకుండా క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్మెంట్ చేసేలా ప్రోత్సహించనుంది. చదవండి: అదిరిందయ్యా ముఖేశ్ అంబానీ.. ! జెప్‌బెజోస్, ఎలన్ మస్క్‌తో పాటు.. -
తెలుగులోనూ జిరోధా ట్రేడింగ్ ప్లాట్‌ఫాం
త్వరలో కంటెంట్ కూడా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిస్కౌంట్ బ్రోకరేజి సంస్థ జిరోధా తాజాగా తెలుగు భాషలోనూ ట్రేడింగ్ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తెచ్చింది. ప్రాంతీయ భాషా క్లయింట్లకు ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను పరిచయం చేసే ప్రణాళికల్లో భాగంగా దీన్ని ప్రవేశపెట్టినట్లు సంస్థ వీపీ (ఈక్విటీ అండ్ రీసెర్చ్ విభాగం) కార్తీక్ రంగప్ప తెలిపారు. తెలుగు, తమిళం తదితర తొమ్మిది భాషల్లో తమ ‘కైట్’ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం అందుబాటులో ఉంటుందని, త్వరలో మరికొన్ని భాషల్లోనూ తేనున్నామని బుధవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ప్రస్తుతం తమకు 1 లక్ష పైగా క్లయింట్లు ఉండగా ఇందులో సుమారు 20 శాతం మంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారని వివరించారు. ఇంత ప్రాధాన్యమున్న నేపథ్యంలోనే హైదరాబాద్, విజయవాడల్లో రెండు శాఖలతో పాటు వైజాగ్, వరంగల్ తదితర ప్రాంతాల్లో 11 పార్ట్నర్ సపోర్ట్ కార్యాలయాలు ఏర్పాటు చేసినట్లు కార్తీక్ చెప్పారు. త్వరలోనే జిరోధా వర్సిటీ పేరిట అందిస్తున్న కంటెంట్‌ను కూడా ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, క్లయింట్లను ఇన్వెస్ట్మెంట్ వైపు మళ్లించే క్రమంలో ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై బ్రోకరేజీ ప్రస్తావనే లేకుండా చేశామని కార్తీక్ వివరించారు. గత ఆర్థిక సంవత్సరం దాదాపు రూ.80 కోట్ల ఆదాయం నమోదు చేశామన్న కార్తీక్.. వచ్చే రెండేళ్లలో క్లయింట్ల సంఖ్యను పది లక్షలకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. -
‘జిరోధా’ ఇక నుంచి తెలుగులో కూడా..
హైదరాబాద్: డిస్కౌంట్ బ్రోకరేజి సంస్థ జిరోధా తాజాగా తెలుగు భాషలోనూ ట్రేడింగ్ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తెచ్చింది. ప్రాంతీయ భాషా క్లయింట్లకు ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను పరిచయం చేసే ప్రణాళికల్లో భాగంగా దీన్ని ప్రవేశపెట్టినట్లు సంస్థ వీపీ (ఈక్విటీ అండ్ రీసెర్చ్ విభాగం) కార్తీక్ రంగప్ప తెలిపారు. తెలుగు, తమిళం తదితర తొమ్మిది భాషల్లో తమ ‘కైట్’ ట్రేడింగ్ ప్లాట్‌ఫాం అందుబాటులో ఉంటుందని, త్వరలో మరికొన్ని భాషల్లోనూ తేనున్నామని బుధవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో చెప్పారు. ప్రస్తుతం తమకు లక్ష పైగా క్లయింట్లు ఉండగా ఇందులో సుమారు 20 శాతం మంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచే ఉన్నారని వివరించారు. ఇంత ప్రాధాన్యమున్న నేపథ్యంలోనే హైదరాబాద్, విజయవాడల్లో రెండు శాఖలతో పాటు వైజాగ్, వరంగల్ తదితర ప్రాంతాల్లో 11 పార్ట్నర్ సపోర్ట్ కార్యాలయాలు ఏర్పాటు చేసినట్లు కార్తీక్ చెప్పారు. త్వరలోనే జిరోధా వర్సిటీ పేరిట అందిస్తున్న కంటెంట్‌ను కూడా ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, క్లయింట్లను ఇన్వెస్ట్మెంట్ వైపు మళ్లించే క్రమంలో ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై బ్రోకరేజీ ప్రస్తావనే లేకుండా చేశామని కార్తీక్ వివరించారు. గత ఆర్థిక సంవత్సరం దాదాపు రూ.80 కోట్ల ఆదాయం నమోదు చేశామన్న కార్తీక్.. వచ్చే రెండేళ్లలో క్లయింట్ల సంఖ్యను పది లక్షలకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. -
డీమ్యాట్ ఖాతా తెరుస్తున్నారా?
నగదు లావాదేవీల కోసం బ్యాంకు ఖాతాల తరహాలోనే షేర్ల క్రయవిక్రయాల కోసం ఉపయోగపడేదే డీమ్యాట్ అకౌంటు. డీమెటీరియలైజ్డ్ అకౌంటుకు సంక్షిప్త రూపమే డీమ్యాట్ ఖాతా. ఐసీఐసీఐ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్, కొటక్ సెక్యూరిటీస్ మొదలైన బ్రోకరేజి సంస్థలు డీమ్యాట్ అకౌంట్లు ఇస్తున్నాయి. మార్కెట్లలో పెట్టుబడులకు కీలకమైన డీమ్యాట్ అకౌంట్లు, వాటి తీరుతెన్నుల గురించి వివరించేదే ఈ కథనం. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయదల్చుకునే వారికి ప్రధానంగా బ్యాంకు అకౌంటు, ట్రేడింగ్ అకౌంటు, డీమ్యాట్ అకౌంటు అవసరమవుతాయి. షేర్లు కొనడం, అమ్మడం నగదుతో ముడిపడి ఉంటుంది కాబట్టి బ్యాంకు ఖాతా కావాలి. ఆన్లైన్లో షేర్ల క్రయవిక్రయాల కోసం ట్రేడింగ్ ఖాతా ఉపయోగపడుతుంది. ఇక మీరు కొన్న షేర్లను ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపర్చేందుకు డీమ్యాట్ ఖాతా అవసరమవుతుంది. సాధారణంగా బ్యాంకింగ్, బ్రోకింగ్ సేవలు అందించే సంస్థలు.. ఈ మూడింటిని 3-ఇన్-1 అకౌంట్లుగా కూడా అందిస్తున్నాయి. తద్వారా ఈ మూడింటిని ఒకదానితో మరొకదాన్ని అనుసంధానించుకోవచ్చు. ఇలా కాకుండా కొన్ని కేవలం డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు ఇస్తున్నాయి. ఇలాంటప్పుడు విడిగా బ్యాంకు అకౌంటు తీసుకుని, దాన్ని వీటికి అనుసంధానించుకోవాల్సి ఉంటుంది. ఇక, డీమ్యాట్ ఖాతాలకు సంబంధించి కచ్చితంగా చూసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే.. చార్జీలు, ఫీజులు: షేరు కొన్నా, అమ్మినా ప్రతిసారీ బ్రోకరేజి చార్జీలు కట్టాల్సి ఉంటుంది. ఇది ఫిక్స్డ్ అమౌంటుగా గానీ లేదా లావాదేవీ విలువలో ఇంత శాతమని గానీ ఉంటుంది. ఉదాహరణకు బ్రోకింగ్ ఫీజు 0.5 శాతం అనుకుంటే, మీరు రూ. 100 విలువ చేసే స్టాక్స్ కొన్న ప్రతిసారీ 50 పైసలు కట్టాల్సి ఉంటుంది. షేర్లు కాకుండా డెరివేటివ్స్, మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటికి వేరే తరహా చార్జీలు ఉంటాయి. ఇక బ్రోకరేజి సంస్థలు, సర్వీసులను బట్టి వార్షికంగా రూ. 500 నుంచి రూ. 2,000 దాకా ఫీజులు ఉంటాయి. ఇవే కాకుండా డీమ్యాట్ చార్జీలని (షేర్లు పేపర్ సర్టిఫికెట్ రూపంలో ఉంటే వాటిని డీమ్యాట్ రూపంలోకి మార్చేందుకు), అడ్వైజరీ ఫీజులు, ఆప్షన్ అండ్ ఫ్యూచర్ ట్రేడింగ్ ఫీజులని సర్వీసుల వినియోగాన్ని బట్టి ఉంటాయి. టెక్నాలజీ, ట్రేడింగ్ ప్లాట్‌ఫాం: డీమ్యాట్ ఖాతాను తీసుకోవడంలో తక్కువ బ్రోకరేజి చార్జీలు మాత్రమే చూసుకుంటే సరిపోదు. సిసలైన ఇన్వెస్టర్లు ట్రేడింగ్ ప్లాట్‌ఫాం టెక్నాలజీ కూడా అత్యాధునికంగా ఉండేలా చూసుకోవాలి. ఇవే కాకుండా ట్రేడింగ్ ప్లాట్‌ఫాంకి ఉండాల్సిన లక్షణాలివి.. ►క్షణక్షణానికి మారిపోయే షేర్ల రేట్లను రియల్ టైమ్‌లో చూపించాలి ►ఫేవరెట్ స్టాక్స్, ఈవెంట్స్ మొదలైన వాటితో సొంత వాచ్ లిస్ట్ ఏర్పర్చుకునే సదుపాయం ఉండాలి. ►ఫైనాన్షియల్ డేటా, హిస్టరీ, కీలక ఈవెంట్స్, ఆయా కంపెనీల విశ్లేషణ మొదలైనవి అందుబాటులో ఉండాలి. ►నిర్దిష్ట కాలంలో జరిపిన లావాదేవీల హిస్టరీ, పోర్ట్‌ఫోలియో విలువ, లాభనష్టాలు, మార్జిన్ మనీ (అవసరమైతే) మొదలైన వివరాలు తెలిసేలా ట్రేడింగ్ ప్లాట్‌ఫాం ఉండాలి. గుర్తుంచుకోండి... సులభతరంగా లావాదేవీలు నిర్వహించుకునే సౌలభ్యంతో పాటు చౌకగా సర్వీసులు అందించే బ్రోకింగ్ సంస్థను ఎంచుకోవాలి. ఇందుకోసం వివిధ బ్రోకింగ్ సంస్థల వెబ్సైట్లలో డీమ్యాట్ ఖాతాల ప్రోటోటైప్ మోడల్స్ ఉంటాయి. ఖాతా స్వరూపం, ఇతర వివరాలు, లావాదేవీలు జరిగే విధానం మొదలైనవన్నీ వీటిలో ఉంటుంది. ఇప్పటికే ఉన్న ఖాతానో లేదా శాలరీ అకౌంటో కాకుండా కేవలం ట్రేడింగ్ కోసమే ప్రత్యేక బ్యాంక్ అకౌంటు ప్రారంభిస్తే మంచిది. దీనివల్ల మీ లాభనష్టాలు సులభంగా లెక్కకట్టుకోవచ్చు. ఇక, నిమిష నిమిషానికి మారిపోయే స్టాక్‌మార్కెట్ పరిణామాలు చూసి కంగారుపడిపోకుండా ఆలోచించి, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మీ దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసేందుకు ఉపయోగపడేవిగా ఉండే కొన్ని కంపెనీలనే ఎంచుకోండి. వాటిని పూర్తిగా అధ్యయనం చేయండి. ఇన్వెస్ట్ చేశాక ఓర్పుగా ఉండండి. అప్పుడే ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడం సాధ్యపడుతుంది.