సాక్షి, ముంబై: హిండెన్‌బర్గ్ సంచలన రిపోర్ట్‌తో ఇబ్బందుల్లో పడిన అదానీ గ్రూపునకు మరో ఎదురు దెబ్బ తగలనుంది. దశాబ్దాలుగా అకౌంటింగ్ మోసాలకు, షేర్ల ధరల విషయంలో అవకతవకల తీవ్ర ఆరోపణలపై సెబీ రంగంలోకి దిగింది. అదానీ డీల్స్‌ను సెబీ నిశితంగా స్టడీ చేస్తోందట.
ఈ అంశంపై భారత మార్కెట్ రెగ్యులేటర్ సెబీ దృష్టి సారించనుంది. గత సంవత్సరంలో అదానీ గ్రూప్ డీల్స్‌ను పరిశీలిస్తోంది. అంతేకాదు కరీబియన్ దేశాలు మొదలు, యునైటెడ్ అరబ్‌ఎమిరేట్స్ వరకు వివిధ దేశాల్లో అదానీ కుటుంబ సారథ్యంలోని షెల్ కంపెనీలు అవినీతి పాల్పడ్డాయన్న ఆరోపణలతో అదానీ విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులపై సొంత ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించ నుందట. దీనికి సంబంధించి అమెరికా షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోందని రాయిటర్స్ నివేదించింది. లిస్టెడ్ స్పేస్‌లో అదానీ గ్రూప్ చేస్తున్న అన్ని లావాదేవీలను సెబీ ఎక్కువగా పరిశీలిస్తోందంటూ విశ్వసనీయ సోర్సెస్‌ను ఉటంకిస్తూ రాయిట్సర్ తెలిపింది.
మరోవైపు అదానీ గ్రూప్‌లో ఎక్కువ పెట్టుబడులుపెట్టిన ఎల్‌ఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ తీవ్రంగా ప్రభావితయ్యే అవకాశం ఉందని, ప్రజాధనం, ఖాతాదారుల ఆస్తుల సంరక్షణ నిమిత్తం ఆర్‌బీఐ, సెబీ దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ డిమాండ్ చేశారు. అయితే ఆందోళన అవసరం లేదని ఎస్బీఐ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment