రెండు ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులకు దక్షిణ కొరియా ఆర్థిక నియంత్రణ సంస్థ షాకిచ్చింది. ప్రస్తుతం కొనసాగుతున్న విచారణలో భాగంగా ఆ రెండు గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులపై భారీ జరిమానా విధించే ప్రణాళికను ఆదివారం ప్రకటించింది.
ఈ రెండు బ్యాంకులు అక్రమమైన నేక్‌డ్ షార్ట్ సెల్లింగ్ (సరైన రుణాలు తీసుకోకుండానే షేర్లను విక్రయించడం) లావాదేవీలకు పాల్పడ్డాయని దక్షిణ కొరియా ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిషన్ (FSC) పేర్కొంది. అయితే ఈ బ్యాంకులు ఏవి అనేది ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిషన్ వెల్లడించలేదు. తమ దేశ స్టాక్ మార్కెట్ నుంచి అక్రమ షార్ట్ సెల్లింగ్ కార్యకలాపాలను నిర్మూలించడానికి ప్రపంచ పెట్టుబడి సంస్థల పరిశీలనను ఫైనాన్షియల్ సర్వీసెస్ కమిషన్ విస్తృతం చేస్తోంది.
అక్రమ షార్ట్ సెల్లింగ్ పపద్ధతులను అరికట్టడానికి దక్షిణ కొరియా గతేడాది నవంబర్ నుంచి 2024 జూన్ చివరి వరకు షార్ట్-సెల్లింగ్‌పై పూర్తి నిషేధాన్ని విధించింది. ఇందులో భాగంగా అక్రమ షార్ట్ సెల్లింగ్ లావాదేవీలకు పాల్పడిన రెండు అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంకులు, ఒక స్థానిక బ్రోకరేజ్ సంస్థకు 26.5 బిలియన్ వోన్‌లు ( సుమారు రూ. 167 కోట్లు) జరిమానా విధించనున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment