దేశీయ స్టాక్‌మార్కెట్లు గురువారం గురువారం సానుకూలంగా ముగిశాయి. బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్ 140.75 పాయింట్లు లేదా 0.17 శాతం పెరిగి 81,607.55 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మునుపటి ముగింపుతో పోలిస్తే 16.50 పాయింట్లు లేదా 0.07 శాతం పెరిగి 24,998.45 వద్ద ముగిసింది.
నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 27 నష్టాలలో ముగిశాయి. సిప్లా, టెక్ మహీంద్రా, ట్రెంట్, సన్ ఫార్మా , ఇన్ఫోసిస్‌లు 3.37 శాతం వరకు నష్టాలను చవిచూశాయి. మరోవైపు బ్యాంకింగ్ షేర్లు లాభాలతో మెరిశాయి. కోటక్ మహింద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్, మారుతీ సుజుకీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ టాప్ గెయినర్స్‌గా ఉన్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment