లాభాలు ఒక రోజుకే పరిమితం
క్రిస్మస్ సందర్భంగా నేడు సెలవు
ముంబై: స్టాక్ సూచీల లాభాలు ఒక రోజుకే పరిమితమయ్యాయి. సెన్సెక్స్ 67 పాయింట్లు నష్టపోయి 78,473 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 26 పాయింట్లు పతనమై 23,728 వద్ద నిలిచింది. విదేశీ పెట్టుబడులు నిరంతరాయంగా తరలిపోతున్న తరుణంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 78,398–78,877 శ్రేణిలో... నిఫ్టీ 23,868–23,685 రేంజ్‌లో ట్రేడయ్యాయి.
ఫైనాన్సియల్స్, ఐటీ, మెటల్, విద్యుత్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. కన్జూమర్ డి్రస్కిషనరీ, ఇంధన, ఫార్మా, టెలికం, ఆటో, ఆయిల్‌అండ్‌గ్యాస్, సరీ్వసెస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా బుధవారం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు సెలవు ప్రకటించాయి. బులియన్, ఫారెక్స్, కమోడిటీ మార్కెట్లు కూడా పనిచేయవు.
ఐపీఓలకు భారీ స్పందన
సెనోరెస్ ఫార్మా ఐపీఓకు చివరిరోజు నాటికి 93.69 రెట్ల స్పందన లభించింది. ఆఫర్‌లో భాగంగా 85.34 లక్షల ఈక్విటీలను జారీ చేయగా 79.95 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. రిటైల్ విభాగం 90.46 రెట్లు సబ్‌స్రై్కబ్ అయింది. వెంటివ్ హాస్పిటాలిటీ ఐపీఓ 9.82 రెట్ల స్పందన దక్కింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 1.44 కోట్ల షేర్లను జారీ చేయగా 14.17 కోట్ల ఈక్విటీలకు దరఖాస్తులు వచ్చాయి. రిటైల్ విభాగానికి 5.94 రెట్ల స్పందన లభించింది. ఇక కరారో ఇండియాకు 1.12 రెట్ల స్పందన నమోదైంది. ఆఫర్‌లో 1.30 కోట్ల ఈక్విటీలను జారీ చేయగా 1.46 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. క్యూఐబీ విభాగం 2.21 రెట్లు, రిటైల్ విభాగం 71% సబ్‌స్క్రైబ్ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment