దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ ముగింపు సమయానికి నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 22,356 వద్దకు చేరింది. సెన్సెక్స్ 195 పాయింట్లు దిగజారి 73,677 వద్ద ముగిసింది.
పరిమిత శ్రేణి ట్రేడింగ్‌లో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. స్టాక్ సూచీలు రికార్డుల ర్యాలీ నిలుపుకునేందుకు ప్రయత్నించాయి. కానీ చివరకు ఉదయం ప్రారంభించిన చోటే దాదాపు సూచీలు ముగిశాయి. అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ 2024 ఏడాదికి గానూ భారత జీడీపీ వృద్ధి రేటును 6.1% నుంచి 6.8 శాతానికి పెంచింది.
సోమవారం విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.564.06 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ)లు రూ.3,542.87 కోట్ల స్టాక్స్‌ను కొన్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment