దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు బుధవారం తీవ్ర ఒడిదొడుకుల మధ్య జీవితకాల గరిష్ఠాలను చేరింది. మార్కెట్ ముగింపు సమయానికి నిఫ్టీ 126 పాయింట్లు ఎగబాకి 22,482 వద్దకు చేరింది. సెన్సెక్స్ 408 పాయింట్లు పుంజుకుని 74,085 వద్ద ముగిసింది.
మంగళవారం విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐ) నికరంగా రూ.574.28 కోట్ల విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ) రూ.1,834.61 కోట్ల స్టాక్స్‌ను కొన్నారు.
సెన్సెక్స్ 30 సూచీలో కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, సన్ ఫార్మా, ఎం అండ్ ఎం, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ఎన్‌టీపీసీ, మారుతి సుజుకి, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్ స్టాక్ పేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment