దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 72 పాయింట్లు లాభపడి 22,084 వద్దకు చేరింది. సెన్సెక్స్ 190 పాయింట్లు దిగజారి 72,831 వద్దకు చేరింది.
సెన్సెక్స్ 30 సూచీలో మారుతి సుజుకి, సన్ ఫార్మా, టైటాన్, ఐటీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, టాటా స్టీల్, భారతి ఎయిర్టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీ షేర్లు లాభాల్లోకి చేరుకున్నాయి.
ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీ షేర్లు నష్టాల్లోకి వెళ్లిపోయాయి.
విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐ) గురువారం నికరంగా రూ.1,826.97 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (డీఐఐ) రూ.3,208.87 కోట్ల స్టాక్స్‌ను కొనుగోలు చేశారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment