
దేశీయ స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. నిఫ్టీ ఉదయం 9:20 వరకు 213 పాయింట్లు లాభపడి 21,915కు చేరింది. సెన్సెక్స్ 791 పాయింట్లు పుంజుకుని 72,453 వద్దకు చేరింది.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు గురువారం ఈక్విటీ మార్కెట్‌లో రూ.1880 కోట్లు, దేశీయ పెట్టుబడిదారులు రూ.872 కోట్ల విలువైన స్టాక్‌లు కొనుగోలు చేశారు. అమెరికా మార్కెట్‌లో యాపిల్ కంపెనీ షేర్లు 3 శాతం కుప్పకూలాయి. ఐఫోన్ సేల్స్ మందగించడంతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నట్లు తెలిసింది.
ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడి సందర్భంగా చైర్మన్ పావెల్ ఈ మార్చిలోనూ కీలక వడ్డీ రేట్ల తగ్గింపు ఉండకపోవచ్చనే సంకేతాలిచ్చారు. దాంతో గురువారం క్యాపిటల్ గూడ్స్, మెటల్, రియల్టీ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)