దేశీయ స్టాక్‌మార్కెట్లు శనివారం పనిచేస్తున్నాయి. ఈక్విటీ, డెరివేటివ్స్ సెగ్మెంట్లలో మార్చి 2న ఎక్స్ఛేంజీలు ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహిస్తున్నాయి. దాంతో ఈరోజు మార్కెట్ పనిచేస్తాయి.
ఈ సెషన్ అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే డేటాబేస్, ఇతర పరిజ్ఞానాన్ని ఉపయోగించి ట్రేడర్లకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు స్టాక్ ఎక్స్ఛేంజీలు ఈ ప్రత్యేక చర్యలకు పూనుకున్నాయి.
దేశీయ స్టాక్‌మార్కెట్లు శనివారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 సమయానికి సెన్సెక్స్ 165.57 పాయింట్లు లేదా 0.22% పెరిగి 73,910.92కి చేరుకోగా, నిఫ్టీ 47.80 పాయింట్లు లేదా 0.21% లాభంతో 22,386.60 వద్ద ట్రేడవుతోంది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment