దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 22,401కు చేరింది. సెన్సెక్స్ 70 పాయింట్లు పుంజుకుని 73,889 వద్ద ట్రేడవుతోంది.
డాలర్ ఇండెక్స్ 103.83 పాయింట్లకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర పెరిగి 83.46 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.19శాతానికి చేరాయి.
బలమైన స్థూల ఆర్థిక మూలాల కారణంగా మన ఈక్విటీ మార్కెట్లు రాణించొచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఉన్న పొజిషన్లను కొనసాగించొచ్చని.. కొత్తగా కొనుగోళ్లకు మాత్రం మార్కెట్ల దిద్దుబాటు కోసం ఎదురు చూడాలని సూచిస్తున్నారు.
తాజా గరిష్ఠాలకు చేరిన నిఫ్టీ, సమీప భవిష్యత్తులో 22,500 పాయింట్లకు చేరే అవకాశం లేకపోలేదని సాంకేతిక నిపుణులు పేర్కొన్నారు. చమురు ఉత్పత్తి కోతలను జూన్ ఆఖరు వరకు ఐచ్ఛికంగా పొడిగించాలని ఒపెక్+ దేశాల సమావేశం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు ఆదివారం తెలిపాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment