దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 సమయానికి నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 22,355కు చేరింది. సెన్సెక్స్ 174 పాయింట్లు పుంజుకుని 73,713 వద్ద ట్రేడవుతోంది.
డాలర్ ఇండెక్స్ 104 పాయింట్లకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 0.9 శాతం తగ్గి 82.81 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4 బేసిస్ పాయింట్లు పెరిగి 4.22 శాతానికి చేరాయి.
పబ్లిక్ ఇష్యూకి బ్లాక్‌బక్
లాజిస్టిక్స్ అంకుర సంస్థ బ్లాక్‌బక్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పబ్లిక్ ఇష్యూకి వచ్చే యోచనలో ఉంది. ఐపీవో ద్వారా కంపెనీ సుమారు 300 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,500 కోట్లు) సమీకరించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ప్రస్తుత ఇన్వెస్టర్లు కొన్ని షేర్లు విక్రయించనుండగా, కొత్తగా మరికొన్ని షేర్లను కూడా సంస్థ జారీ చేయనున్నట్లు వివరించాయి. ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను సరీ్వసుల వ్యాపార విభాగాన్ని విస్తరించేందుకు బ్లాక్‌బక్ వినియోగించుకోనుంది. బ్లాక్‌బక్‌ను నిర్వహించే జింకా లాజిస్టిక్ సొల్యూషన్స్‌లో ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడులు ఉన్నాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment