దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:16 సమయానికి నిఫ్టీ 50 పాయింట్లు నష్టపోయి 22,045కు చేరింది. సెన్సెక్స్ 172 పాయింట్లు దిగజారి 72,658 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 104.3 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 86 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.21 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు ఎస్ అండ్ పీ 0.14 శాతం నష్టాలతో, నాస్‌డాక్ 0.16 లాభాలతో ముగిశాయి.
సోమవారం హోలీ పండగ సందర్భంగా ఈక్విటీ మార్కెట్లు పనిచేయలేదు. గుడ్‌ఫ్రైడే కావడంతో వచ్చే శుక్రవారమూ (ఈనెల 29న) మార్కెట్లకు సెలవే కనుక ఈ వారంలో మూడు రోజులే ట్రేడింగ్ జరగనుంది. నెలవారీ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు గురువారమే తీరనుంది. అమెరికా జీడీపీ గణాంకాల ప్రభావమూ కనిపించొచ్చు. నిఫ్టీ 22,200 స్థాయి పైన బలంగా ముగిస్తేనే బులిష్ ధోరణి కనిపించొచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment