దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు మంగళవారం జీవితకాల గరిష్ఠాలను చేరాయి. ఉదయం 9:22 సమయానికి నిఫ్టీ 49 పాయింట్లు లాభపడి 22,718కు చేరింది. సెన్సెక్స్ 168 పాయింట్లు పుంజుకుని 74,908 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్ 104.12 పాయింట్ల వద్దకు చేరింది. క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 90.52 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.42 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 0.04 శాతం నష్టాలతో, నాస్‌డాక్ 0.03 శాతం లాభాలతో ముగిసింది.
మార్కెట్ విలువ రికార్డ్
ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) సోమవారం తొలి సెషన్‌లో రూ.401 లక్షల కోట్లను అధిగమించింది. మార్కెట్ చరిత్రలో ఇది తొలిసారికాగా.. డాలర్లలో 4.81 ట్రిలియన్లను తాకింది. చివరికి బీఎస్‌ఈ మార్కెట్ విలువ రూ. 4,00,86,722 వద్ద స్థిరపడింది. గతేడాది జులైలో తొలిసారి బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 300 లక్షల కోట్లను తాకిన విషయం విదితమే.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment