న్యూఢిల్లీ: సంవర్థన మదర్సన్ ఇంటర్నేషనల్‌లో ప్రమోటర్ సంస్థ, జపాన్‌కు చెందిన సుమిటోమో వైరింగ్ సిస్టమ్స్ 3.4 శాతం వాటాను విక్రయించింది. బహిరంగ మార్కెట్లో జరిగిన ఈ విక్రయ వాటాల విలువ రూ.1,612 కోట్లు. మొత్తం 23 కోట్ల షేర్లను, ఒక్కో షేరుకు సగటున రూ.70.10కి సుమిటోమో వైరింగ్ సిస్టమ్స్ విక్రయించింది.
కోప్తాల్ మారిషస్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్, సొసైట్ జనరల్ వాటాలను కొనుగోలు చేశాయి. వడ్డీ రేట్లు పెరుగుతున్న తరుణంలో రుణ భారం తగ్గించుకోవాలన్న ప్రణాళికలో భాగంగా ఈ వాటాలను సుమిటోమో విక్రయించినట్టు సంవర్థన మదర్సన్ తెలిపింది. సుమిటోమో వైరింగ్ సిస్టమ్స్, దాని అనుబంధ సంస్థ హెచ్‌కే వైరింగ్ సిస్టమ్స్‌కు సంవర్థన మదర్సన్‌లో మొత్తం 17.72 శాతం వాటాలున్నాయి. తాజాగా 3.4 శాతం వాటాలు విక్రయించిన తర్వాత, ఇంకా 14.32 శాతం వాటా కలిగి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment