న్యూఢిల్లీ: దేశీయంగా కార్యకలాపాలను విస్తరించనున్నట్లు సన్ లైఫ్ గ్లోబల్ సొల్యూషన్స్(ఎస్‌ఎల్‌జీఎస్) తాజాగా పేర్కొంది. ఇందుకు అనుగుణంగా రానున్న రెండేళ్లలో 700 మందిని ఉద్యోగాలలోకి తీసుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది. కంపెనీ ఇన్నోవేషన్ హబ్ ద్వారా నాలెడ్జ్ సరీ్వసులు, బిజినెస్ సరీ్వసులు అందిస్తోంది. ప్రధానంగా కెనడియన్ దిగ్గజం సన్ లైఫ్ ఫైనాన్షియల్ ఇంక్‌కు సేవలు సమకూరుస్తోంది.
ఇండియా, ఫిలిప్పీన్స్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీ ప్రస్తుతం 5,000 మంది సిబ్బందిని కలిగి ఉంది. దేశీయంగా 3,000 మందితో రెండు కేంద్రాల నుంచి, 2,000 మంది ఉద్యోగులతో కెనడా నుంచి సన్ లైఫ్‌ఫైనాన్షియల్‌కు తోడ్పాటునిస్తోంది. ఈ రెండు దేశాలలోనూ కలిపి 2025కల్లా మొత్తం 1,000 మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో ఉన్నట్లు ఎస్‌ఎల్‌జీఎస్ ఎండీ తరుణ్ సరీన్ తెలియజేశారు. 2022కల్లా సన్ లైఫ్ ఫైనాన్షియల్ నిర్వహణలోని ఆస్తులు 1.33 ట్రిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment