సాక్షి,ముంబై: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్ తమ ఉత్పత్తుల విక్రయంకోసం టాటా గ్రూపుతో డీల్ కుదుర్చుకుందా? అంటే అవుననే అంటున్నాయి తాజా నివేదికలు. సాల్ట్-టు-సాఫ్ట్‌వేర్ సమ్మేళనం, భారత దిగ్గజ కంపెనీల్లో ఒకటైన టాటా గ్రూప్ త్వరలో ఎక్స్‌క్లూజివ్ యాపిల్ స్టోర్లను ఏర్పాటు చేయనుందని ఎకనామిక్ టైమ్స్ తాజాగా నివేదించింది. 100 ఎక్స్‌క్లూజివ్ యాపిల్ స్టోర్‌ల ఏర్పాటుకు టాటా గ్రూపునకు చెందిన ఇన్ఫినిటీ రిటైల్‌తో యాపిల్ ఒప్పందం చేసుకుంది. ‘క్రోమా’ రీటైల్ పేరుతో స్టోర్లను నిర్వహిస్తున్న టాటా తాజా ఒప్పందం ప్రాధాన్యతను సంతరించుకుంది.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దాదాపు 100 వరకు చిన్న చిన్న స్టోర్లను ఏర్పాటు చేయనుంది. వీటిల్లోప్రత్యేకంగా యాపిల్ ఉత్పతులను మాత్రమే విక్రయించనుంది. సుమారు 500-600 చదరపు అడుగుల విస్తీర్ణం మేర ఉండేలా యాపిల్ స్టోర్లు లేదా అవుట్‌లెట్స్‌ను తెరిచేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే ఈ వార్తలపై అటు ఇన్ఫినిటీ రిటైల్ కానీ, యాపిల్ కంపెనీ గానీ స్పందించలేదు.
గత నెలలో ఇండియాలో యాపిల్ టాప్ వెండర్, విస్ట్రోన్ ఏకైక తయారీ కేంద్రాన్ని రూ. 5వేల కోట్లకు కొనుగోలుకు టాటా గ్రూప్ చర్చలు జరుపుతోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించిన రెండు వారాల లోపే తాజా అంచనాలు వెలుగులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment