మన టైమ్ బాగలేకపోతే దరిద్రం మన ఇంటి డోర్ దగ్గరే పలకరిస్తుంది. ఇప్పుడు ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా పరిస్థితి అలాగే ఉంది. వారం రోజుల నుంచి టెస్లా షేర్ ధర భారీగా పడిపోయిన సంగతి తేలిసిందే. టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ బీటా కారును టెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్(ఎఫ్‌ఎస్‌డి) బీటా టెస్లా మోడల్ వై కారు లాస్ ఏంజిల్స్ నగరంలో క్రాష్ అయింది. ఈ ఎలక్ట్రిక్ కారు అదృష్టవ శాస్తు ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. కానీ, ఎలక్ట్రిక్ కారు భారీగా దెబ్బతింది.
ఈ క్రాష్ గురుంచి నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ కు నివేదించారు. ఇది టెస్లా ఆటోపైలెట్ సిస్టమ్ కారును ఎన్నోసార్లు పరీక్షించారు. అలాగే, అనేక సార్లు ఓవర్ ల్యాపింగ్ పరిశోధనలను జరిపినట్లు ది వెర్జ్ నివేదించింది. అది అలా ఉంటే, కారు యజమాని తెలిపిన నివేదిక ప్రకారం "వాహనం ఎఫ్‌ఎస్‌డి బీటా మోడ్లో ఉంది. కారు ఎడమ వైపు మలుపు తీసుకునేటప్పుడు అదుపుతప్పి సందులోకి దూసుకెళ్లింది. ఆ లేన్ పక్కన ఉన్న సందులో మరొక డ్రైవర్ ఈ కారును ఢీ కొట్టాడు". అప్పటికే ఆ కారులో డ్రైవర్ నియంత్రించే పని చేసిన అదుపులోకి రాలేదు అని పేర్కొన్నారు. అయితే, ఈ విషయంపై కంపెనీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.
(చదవండి: ఎలన్ మస్క్ దెబ్బకు.. వారంలో రూ.13 లక్షల కోట్లు ఆవిరి)
Comments
Please login to add a commentAdd a comment