దేశంలోని ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా 2022 ఫిబ్రవరిలో మొత్తం 54,455 వాహనాలను విక్రయించినట్లు సంస్థ నేడు(మార్చి 1) తెలిపింది. యుటిలిటీ వేహికల్స్ సెగ్మెంట్'లో మహీంద్రా 27,551 వాహనాలను విక్రయించింది. అలాగే, ప్యాసింజర్ వేహికల్స్ సెగ్మెంట్'లో 27,663 వాహనాలను విక్రయించింది. ముంబైకి చెందిన ఈ ఆటో మేజర్ గత నెల 2,814 వాహనాలను ఎగుమతి చేసింది. గత నెలలో థార్, ఎక్స్‌యూవీ 700 సిరీస్ వంటి వాహనాలకు భారీ డిమాండ్ ఏర్పడినట్లు సంస్థ పేర్కొంది.
కేవలం ఎస్యూవీ సెగ్మెంట్ వాహనాల విక్రయాలు 79 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కమర్షియల్ వేహికల్స్ సెగ్మెంట్'లో మహీంద్రా ఫిబ్రవరి 2022లో 119% వృద్ధిని నమోదు చేసింది. భారీ వాణిజ్య వాహనాల అన్ని లైట్ కమర్షియల్ వాహనాలు కూడా మంచి వృద్దిని కనబరిచాయి. ఎమ్ అండ్ ఎమ్ లిమిటెడ్ ఆటోమోటివ్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీజయ్ నక్రా మాట్లాడుతూ.. "మొత్తం మీద 54,455 వాహనాల అమ్మకాలతో ఫిబ్రవరి 2022లో 89 శాతం వృద్ధిని సాధించాం. అన్ని విభాగాలు ఎస్‌యూవీలతో సహా ఇతర వాహనాలు మంచి వృద్దిని కనబరిచాయి. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి తగ్గడంతో డిమాండ్ పేరిగిందని మేము భావిస్తున్నాము. సెమీ కండక్టర్ కొరత ఉన్న కూడా ఆ విధంగా దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నాము" అని అన్నారు.
(చదవండి: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి అదిరిపోయే శుభవార్త.. సింగిల్ ఛార్జ్ @ 300కిమీ!)
Comments
Please login to add a commentAdd a comment