Thar desert
-
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న థార్, మహీంద్రా ఎక్స్‌యూవీ 700
దేశంలోని ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా 2022 ఫిబ్రవరిలో మొత్తం 54,455 వాహనాలను విక్రయించినట్లు సంస్థ నేడు(మార్చి 1) తెలిపింది. యుటిలిటీ వేహికల్స్ సెగ్మెంట్'లో మహీంద్రా 27,551 వాహనాలను విక్రయించింది. అలాగే, ప్యాసింజర్ వేహికల్స్ సెగ్మెంట్'లో 27,663 వాహనాలను విక్రయించింది. ముంబైకి చెందిన ఈ ఆటో మేజర్ గత నెల 2,814 వాహనాలను ఎగుమతి చేసింది. గత నెలలో థార్, ఎక్స్‌యూవీ 700 సిరీస్ వంటి వాహనాలకు భారీ డిమాండ్ ఏర్పడినట్లు సంస్థ పేర్కొంది. కేవలం ఎస్యూవీ సెగ్మెంట్ వాహనాల విక్రయాలు 79 శాతం వృద్ధిని నమోదు చేశాయి. కమర్షియల్ వేహికల్స్ సెగ్మెంట్'లో మహీంద్రా ఫిబ్రవరి 2022లో 119% వృద్ధిని నమోదు చేసింది. భారీ వాణిజ్య వాహనాల అన్ని లైట్ కమర్షియల్ వాహనాలు కూడా మంచి వృద్దిని కనబరిచాయి. ఎమ్ అండ్ ఎమ్ లిమిటెడ్ ఆటోమోటివ్ డివిజన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీజయ్ నక్రా మాట్లాడుతూ.. "మొత్తం మీద 54,455 వాహనాల అమ్మకాలతో ఫిబ్రవరి 2022లో 89 శాతం వృద్ధిని సాధించాం. అన్ని విభాగాలు ఎస్‌యూవీలతో సహా ఇతర వాహనాలు మంచి వృద్దిని కనబరిచాయి. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి తగ్గడంతో డిమాండ్ పేరిగిందని మేము భావిస్తున్నాము. సెమీ కండక్టర్ కొరత ఉన్న కూడా ఆ విధంగా దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నాము" అని అన్నారు. (చదవండి: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి అదిరిపోయే శుభవార్త.. సింగిల్ ఛార్జ్ @ 300కిమీ!) -
1,72,000 క్రితం నాటి నది ఆనవాళ్లు గుర్తింపు
జైపూర్: లక్షా డెభ్బై రెండు వేల(1,72,000) సంవత్సరాల క్రితం రాజస్తాన్‌లోని బికనీర్ సమీపంలో ఉన్న సెంట్రల్ థార్ ఎడారి గుండా ప్రవహించి కాల ప్రవాహంలో కనుమరుగైన “నది”ఆనవాళ్లను పరిశోధకులు తాజాగా ఆధారాలతో సహా కనుగొన్నారు. ఈ ప్రాంతంలో మానవులు నివసించేందుకు.. నాగరికత అభివృద్ధి చెందేందుకు ఈ నది ఒక జీవనరేఖగా ఉండొచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. జర్మనీలోని ది మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ సైన్స్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ, తమిళనాడులోని అన్నా విశ్వవిద్యాలయం, ఐఐఎస్ఈఆర్ కోల్‌కతా పరిశోధకులు సంయుక్తంగా ఈ అధ్యయనం చేశారు. పరిశోధన వివరాలు క్వాటర్నరీ సైన్స్ రివ్యూస్ జర్నల్‌లో ప్రచురించబడ్డాయి. సెంట్రల్ థార్ ఎడారిలోని నల్ క్వారీలో అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో జరిపిన పరిశోధనలు నది కార్యకలాపాల దశను సూచించాయి. ఇక ఈ అధ్యాయన ప్రకారం రాతియుగం నాటి మానవులు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న దానికంటే భిన్నమైన థార్ ఎడారి ప్రకృతిలో నివసించినట్లు తెలుస్తోంది. కనుమరుగైన నది సమీప ఆధునిక నదికి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుగా పరిశోధనలో తేలింది. (చదవండి: వర్షం.. పర్వతాలను సైతం కదిలిస్తుందట!) ‘లుమినిసెన్స్ డేటింగ్’ ద్వారా ఇక కనుమరుగైన నదీ సమాచారం గురించి నల్ గ్రామానికి సమీపంలోని క్వారీ నుండి వెల్లడైన ఇసుక, కంకరల లోతైన నిక్షేపాన్ని ఈ బృందం అధ్యయనం చేసింది. అదేవిధంగా పరిశోధకులు వివిధ నిక్షేపాలను అధ్యయనం చేయడం ద్వారా వివిధ దశల నది కార్యకలాపాలను డాక్యుమెంట్ చేయగలిగారు. నది ఇసుకలోని క్వార్ట్జ్ గ్రేయిన్స్ ఎప్పుడు ఖననం అయ్యాయో తెలుసుకునేందుకు పరిశోధకులు ‘లుమినిసెన్స్ డేటింగ్’ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. దీన్ని ఉపయోగించి ఫ్లూవియల్ నిక్షేపాల దిగువన చాలా చురుకైన నది వ్యవస్థకు సంబంధించిన ఆధారాలను గుర్తించినట్లు అచ్యుతన్ చెప్పారు. సుమారు 172 వేల సంవత్సరాల క్రితం నల్ వద్ద బలమైన నది కార్యకలాపాలు జరిగాయని ఫలితాలు సూచించాయన్నారు. సెంట్రల్ థార్ ఎడారి గుండా ప్రవహించే నది పాలియోలిథిక్ జనాభాకు లైఫ్ లైన్‌గా ఉందని.. వలసలకు ముఖ్యమైన కారిడార్‌గా ఉండేదని వారు తెలిపారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల అధ్యయనం కూడా థార్ ఎడారి గుండా ప్రవహించిన నది మార్గాల నెట్‌వర్క్‌ను చూపించినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనాలు గతంలో నదులు, ప్రవాహాలు ఎక్కడ ప్రవహించాయో సూచించగలవే కానీ అవి ఎప్పటివి అన్న విషయం మాత్రం చెప్పలేవని అన్నా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ హేమా అచ్యుతన్ అన్నారు. (చదవండి: గులాబీ రంగులోకి మంచు.. కారణం!) థార్ ఎడారికి గొప్ప చరిత్ర ఉందని పరిశోధకులు తెలిపారు. రాతియుగ జనాభా ఈ అర్ధ-శుష్క ప్రకృతిలో మనుగడ సాగించడమే కాకుండా ఎలా అభివృద్ధి చెందిందో చూపించే అనేక రకాల సాక్ష్యాలను తాము వెలికితీస్తున్నట్లు ది మాక్స్ ప్లాంక్ ఇనిస్టిట్యూట్ ఫర్ సైన్స్ ఆఫ్ హ్యూమన్ శాస్ర్తవేత్త జింబోబ్ బ్లింక్‌హార్న్ తెలిపారు. చరిత్ర పూర్వంలోని కీలక కాలంలో నదీ వ్యవస్థలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు మనకు చాలా తక్కువ వివరాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. ఆఫ్రికా నుంచి భారతదేశానికి హోమో సేపియన్ల ప్రారంభ విస్తరణలతో ఈ నది ముడిపడి ఉన్నట్లుగా తెలిపారు. -
ఈ ఎడారిలో నీటికి కొదవ లేదు!
జైసల్మీర్: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరువు విలయతాండవం చేస్తోంటే.. రాజస్థాన్ లోని థార్ ఎడారిలో మాత్రం 2 నుంచి 3 అడుగుల లోతు గుంటను తవ్వితే నీరు బయటకు వస్తోంది. జైసల్మీర్ కు సమీపంలోని షాఘర్ బల్జ్ ప్రాంతంలో ఈ పరిస్థితే కనిపిస్తోంది. ఆ ప్రాంతంలో ఉన్న ఒయాసిసలో ఎక్కడ తవ్విన 2 నుంచి 3 అడుగుల్లోపే నీరు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నీరు అంతరించిపోయిన సరస్వతి నదివేనని అంటున్నారు. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉండే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) జవాన్లకు ఈ నీరు కొన్ని సంవత్సరాలుగా దాహార్తి తీరుస్తోందని చెప్తున్నారు. ఏ సీజన్ లోనైనా ఇక్కడ నీరు లభిస్తోందనీ, ఉదయం ఒకసారి గుంటను తవ్వి నీరు తొడుకుంటే సాయంతానికి తిరిగి నీరు ఊరుతోందని తెలిపారు. ఎంతో శుభ్రతతో లభ్యమయ్యే ఈ నీరు మినరల్ వాటర్ కంటే బావుంటాయని చెప్పారు. నీరు లభించే ప్రాంతమంతా వృక్షసంపదతో కళకళలాడుతుంటుందని తెలిపారు. ఒయాసిస్ కింద ఏదో జీవనది ప్రయాణిస్తుండటం మూలానే ఇలా జరుగుతోందని అంటున్నారు. బోర్డర్ లో ఉండే ఖారా, నల్కా, ఝలారియా, రోహ్ తోష్, వీర్ హిల్, కిర్వాలీ, సొంగమ్ లకు పైపులైన్ల ద్వారా ఇక్కడి నుంచి నీటి సరఫరా జరుగుతుందని బీఎస్ఎఫ్ అధికారి దిల్ బాగ్ సింగ్ తెలిపారు. సీనియర్ గ్రౌండ్ వాటర్ సైంటిస్ట్ డా.నారాయణ్ దాస్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో భూమి కింద నీటి వనరులు అధికంగా ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా ఇక్కడ నీటి వినియోగం చాలా తక్కువగా ఉండటం కూడా ఇక్కడి వాసులకు కలిసి వస్తోందని అన్నారు. -
అత్యధిక జన సాంద్రత ఉన్న ఎడారి.. థార్!
హైదరాబాద్: ప్రపంచంలో వాతావరణ వైవిధ్యం ఉన్న ప్రాంతాల్లో ఎడారులు ప్రత్యేకమైనవి. ఒక పక్క అత్యధిక ఉష్ణోగ్రతలు, మరో పక్క ఎముకలు కొరికే చలితో ఎడారి ప్రాంతాలు విభిన్నంగా ఉంటాయి. ఇక వర్షాల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఏడాదిలో ఎప్పుడో ఒకసారి మాత్రమే ఈ ప్రాంతాల్లో వర్షం చూడగలం. అయినప్పటికీ ఇక్కడ కూడా అత్యధిక సంఖ్యలో ప్రజలు నివసిస్తున్నారు. మన దేశంలో అత్యధిక భాగంలో విస్తరించి ఉన్న ‘థార్ ఎడారి’లో ఉండే పరిస్థితుల గురించి ఈ రోజు తెలుసుకుందాం..! ఎక్కడ ఉంది? థార్ ఎడారి భారత్, పాక్ సరిహద్దుల్లో ఉంది. దీన్నే ‘గ్రేట్ ఇండియన్ డెసెర్ట్’ అని పిలుస్తారు. ఇది రాజస్థాన్, హరియాణా, పంజాబ్, పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. పాకిస్తాన్ ఉన్న భూ భాగాన్ని ‘ఖలిస్తాన్ ఎడారి’ అని పిలుస్తారు. ఇది భారత్‌లో మొదటి, ప్రపంచంలో ఏడో అతి పెద్ద ఎడారి. పుట్టుక: దీని పుట్టుక మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఈ ఎడారి 4-10 వేల ఏళ్ల పూర్వం నాటిది మాత్రమే అని చెబుతారు. క్రీ.పూ 2000-1500 సంవత్సరాలలో ఇక్కడ ప్రవహించే షుగ్గర్ నది ఇంకిపోవడం వల్లే ఈ ఎడారి ఏర్పడిందని కొంత మంది భావిస్తున్నారు. అత్యధిక శాతం మంది పరిశోధకులు ప్రస్తుతం ఎడారిగా ఉన్న ఈ ప్రాంతం ఒకప్పుడు మొహంజదారో కేంద్రంగా ఉంటూ, సింధులోయ నాగరికత ప్రజలకు ప్రధాన నీటివనరుగా ఉండేదని.. ఆకస్మికంగా భౌగోళిక సమతుల్యం లోపించి పెనుమార్పులు చోటుచేసుకుని ఇలా ఎడారిగా మార్పు చెందిందని వాదిస్తున్నారు. అయితే ‘సరస్వతి’ నది ఇంకిపోయిన ప్రాంతమే థార్ ఎడారి అనే వాదనను మాత్రం పరిశోధకులు అంగీకరించడం లేదు. సహజ వృక్షాలు: ఇక్కడి పొడి వాతావరణంలో జీవించగల్గిన ముళ్ల చెట్లు అధికంగా ఉన్నాయి. వీటిలో కీకర్, వేవంజా, ఖేర్, దిరిశన, వేప, సంగ్రి, జాల్కి, రొహిడా, ఫరాశ్ వంటి ఎడారి మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి. థార్ ఎడారిలో సందూర్, దుర్వ, బంచ్ గ్రాస్, ఘమూర్, కాస్, బఫెల్ గ్రాస్, దర్భ, ఘోకోరూ, జినస్, గవాక్షీ.. వంటి ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. ఉప్పునీటి సరస్సులు: థార్ ఎడారిలో అనేక ఉప్పునీటి సరస్సులు ఉన్నాయి. సంభర్, పచ్చద్రా, తాల్ చాపర్, ఫాలౌడి, లంకన్సర్ వద్ద ఉన్న ఉప్పునీటి సరస్సుల నుంచి సోడియం క్లోరైడ్(ఉప్పు)ను ఉత్పత్తి చేస్తున్నారు. నీటి వనరులు: సాధారణంగా ఎడారి ప్రాంతాల్లో నీరు లభ్యం కావడం చాలా అరుదు. కనుక ఎడారి ప్రాంత ప్రజల జీవితాల్లో నీరు ప్రధాన భూమిక పోషిస్తుంది. సహజ నీటి వనరులు (ఒయాసిసులు), మానవ నిర్మిత ‘జోహాడ్’ అనే చిన్న తరహా నీటి గుంటలు మానవులకు, జంతువులకు ఈ ప్రాంతంలో తాగునీటిని అందిస్తున్నాయి. నీటి వనరులు లభ్యమయ్యే ప్రాంతాన్ని బట్టి ఎడారి వాసులు వలస జీవనం సాగిస్తారు. విస్తీర్ణం: ‘వరల్డ్ వైడ్ ఫండ్’ సంస్థ నిర్వచనం ప్రకారం దీని విస్తీర్ణం 2,38,700 చ.కిమీ. భారతదేశంలో ఉన్న భూభాగంలో ఈ ఎడారి 61 శాతం రాజస్థాన్, 20 శాతం గుజరాత్, 9 శాతం హరియాణ, పంజాబ్‌లలో విస్తరించి ఉంది. జీవవైవిధ్యం: థార్ ఎడారిలో ప్రపంచంలోని మిగిలిన ఎడారుల్లో కంటే ఎక్కువ జీవులు నివసిస్తున్నాయి. ఈ ప్రాంతంలో 23 రకాల పాకే జీవులు, 25 జాతుల సర్పాలు ఉన్నాయి. వీటిలో పలు జాతులు ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. ప్రాంతీయ, వలస పక్షులు కలిపి సుమారు 141 పక్షి జాతులు ఉన్నాయి. ప్రజలు: థార్ ఎడారిలో ప్రధానంగా హిందువులు, ముస్లింలు, సిక్కులు నివసిస్తున్నారు. పాకిస్తాన్ భూ భాగంలో సింధీలు, కొల్హీలు జీవిస్తున్నారు. రాజస్థాన్‌లో 40 శాతం ప్రజలు ఎడారిలోనే నివసిస్తున్నారు. ఇక్కడి ప్రజలు జీవనాధారం కోసం వ్యవసాయం, జంతువుల పెంపకం మీద ఆధారపడుతుంటారు. ఎడారి ప్రజల ఆర్థిక స్థితి చాలా త క్కువగా ఉంటుంది. థార్ ఎడారి ప్రపంచంలోనే అత్యధిక జన సాంద్రత కలిగిన ఎడారి ప్రదేశం. ఇక్కడ చదరపు కిలోమీటరుకు 83 మంది నివసిస్తున్నారు. ఇతర ఎడారుల్లో ఈ సంఖ్య 7 మంది మాత్రమే. పర్యటనలు: జైసల్మీర్ వద్ద ఒంటెల సవారీ ప్రజాదరణ పొందడంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. విదేశీ, స్వదేశీ పర్యాటకులు ఒంటెల మీద ఎడారిలో సవారీ చేసేందుకు అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ పర్యటనలో తక్కువ ధరలో అరేబియన్ శైలి విందులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు ఉంటాయి. ఈ కార్యక్రమాలు జైసల్మీర్, దాని చుట్టుపక్కన ఉన్న గ్రామాలలో ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నాయి. పర్యాటక నిర్వాహకులకు, ఒంటెల యజమానులకు ఇవి చక్కని ఆదాయాన్ని అందిస్తున్నాయి. (స్కూల్ ఎడిషన్ ప్రత్యేకం). -
ఎడారి జిల్లాలో రెండే సీట్లు
రాజస్థాన్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: వేల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన థార్ ఎడారి... దూరంగా విసిరేసినట్లు ఉండే గ్రామాలు... ఆయా గ్రామాల్లో కేవలం వందల సంఖ్యలోనే ఓటర్లు. ఇదీ రాజస్థాన్‌లో గోల్డెన్ సిటీగా పేరుగాంచిన జైసల్మేర్ జిల్లా పరిస్థితి. జిల్లా విస్తీర్ణం 38,401 చదరపు కిలోమీటర్లు ఉన్నప్పటికీ అందులో ఎక్కువ భాగం ఎడారి ప్రాంతమే. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 6.72 లక్షలు. అందుకే ఈ జిల్లాలో జైసల్మేర్, పోఖ్రాన్ శాసనసభా నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. జైసల్మేర్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చోటూసింగ్‌తోపాటు కాంగ్రెస్ నుంచి రూపారాం పోటీ పడుతుండగా; పోఖ్రాన్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సాలేహ్ మహమ్మద్, బీజేపీ నుంచి షేతా సింగ్ పోటీలో ఉన్నారు. రాజస్థాన్‌లో బీజేపీ గెలుపు: సర్వే న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టనున్నట్లు ఏబీపీ న్యూస్-దైనిక్ భాస్కర్-నీల్సేన్ సర్వే వెల్లడించింది. మొత్తం 200 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 105 స్థానాల్లో గెలుపొందే అవకాశాలున్నట్లు తె లిపింది. కాంగ్రెస్‌కు 77 సీట్లు లభించవచ్చని పేర్కొంది.