Rakesh Jhunjhunwala Get Richer By Rs 861 Crore In Just 1 Day, Details Inside In Telugu - Sakshi
Sakshi News home page

ఒక్కరోజులో రూ.861 కోట్లు సంపాధించిన ఇండియన్‌ వారెన్‌ బఫెట్‌..!

Published Fri, Mar 18 2022 9:20 PM | Last Updated on Sat, Mar 19 2022 4:27 PM

These 2 stocks help Rakesh Jhunjhunwala get Richer By Rs 861 Crore in Just 1 day - Sakshi

ఒక్కరోజులో ఎవరైన ఎంత సంపాదిస్తాం.. మహా అయితే 1000, 10వేలు రూపాయలు ఇంకా గట్టిగా మాట్లాడితే రూ.10 లక్షలు. కానీ, ఇండియన్ వారెన్‌ బఫెట్‌ రాకేశ్ ఝున్​ఝున్​వాలా మాత్రం ఏకంగా రూ.861 కోట్లు సంపాదించి, తన సత్తా ఏంటో మరోమారు మార్కెట్‌కు చూపారు. ఏస్ ఇన్వెస్టర్ పెట్టుబడుల్లోని అతి పెద్ద స్టాక్ బెట్‌ టైటాన్ కంపెనీ, స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ మార్చి 17 ట్రేడింగ్‌లో ధగధగా మెరిసాయి. టైటాన్ షేర్లు మార్చి 17న రూ.2,587.30 నుంచి రూ.2,706కు పెరిగాయి, అంటే, ప్రతి షేరు విలువ రూ.118.70 పెరిగింది. అదేవిధంగా స్టార్ హెల్త్ షేరు ధర రూ.608.80 నుంచి రూ.641కు పెరిగింది, అంటే ఈ షేర్ ధర కూడా రూ.32.20 పెరిగింది.

అక్టోబర్-డిసెంబర్ 2021 త్రైమాసీకంలో టైటాన్ కంపెనీ షేర్ హోల్డింగ్ నమూనా ప్రకారం.. రాకేశ్ ఝున్‌ఝున్‌వాలాకు, ఆయన భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలాకు కంపెనీలో వాటా ఉంది. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 3,57,10,395 షేర్లు లేదా 4.02 శాతం వాటా కలిగి ఉంటే, రేఖా ఝున్‌ఝున్‌వాలా సంస్థలో 95,40,575 షేర్లు లేదా 1.07 శాతం వాటాను కలిగి ఉన్నారు. అంటే రాకేష్ ఝున్‌ఝున్‌వాలా, రేఖా ఝున్‌ఝున్‌వాలా కలిసి కంపెనీలో 4,52,50,970 షేర్లు లేదా 5.09 శాతం వాటాను కలిగి ఉన్నారు. తాజా ఎక్స్ఛేంజ్ కమ్యూనికేషన్ ప్రకారం.. బిగ్ బుల్ స్టార్ హెల్త్ 10,07,53,935 షేర్లను కలిగి ఉన్నారు. ఇది కంపెనీ మొత్తం వాటాలో 17.50 శాతం.

ఝున్‌ఝున్‌వాలా 4,52,50,970 టైటాన్ షేర్లను కలిగి ఉన్నందున, అతని నికర విలువలో నికర పెరుగుదల సుమారు రూ.537 కోట్లు. అదేవిధంగా, అతను 10,07,53,935 స్టార్ హెల్త్ షేర్లను కలిగి ఉన్నారు. గురువారం ప్రతి షేరు రూ.32.20 పెరిగింది, అంటే స్టార్ హెల్త్ షేర్ పెరగడం వల్ల అతని నికర సంపద సుమారు రూ.324 కోట్లు. అందువల్ల, టైటాన్ షేర్ ధర + స్టార్ హెల్త్ షేర్ ధర పెరగడం వల్ల ఝున్‌ఝున్‌వాలా నికర విలువ మొత్తం పెరుగుదల సుమారు రూ.861 కోట్లు.

(చదవండి: ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీని ఎన్ని సార్లు మార్చవచ్చో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement