![Today 22 july 2023 Gold and silver prices check here - Sakshi](/styles/webp/s3/article_images/2023/07/22/gold%20price.jpg.webp?itok=JDAZUmqe)
Today Gold and Silver prices: బంగారం ధరలు కాస్త శాంతించి కొనుగోలుదారులకు ఊరటినిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు దిగివచ్చాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.300 తగ్గి తులం రూ.55,400గా ఉంది. 24 క్యారెట్ల బంగారంపై 10 గ్రాముల పసిడి రూ.310 తగ్గి రూ.60,440 పలుకుతోంది.
ఇదీ చదవండి: లండన్‌లో లగ్జరీ భవనాన్ని దక్కించుకున్న భారత బిలియనీర్
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,550 ఉండగా, 24 క్యారెట్ల పుత్తడి రూ.60,590గా ఉంది. అలాగే వాణిజ్యరాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.55,400 ఉండ, 24 క్యారెట్ల పసిడి పది గ్రాముల ధర రూ.60,400 వద్ద ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రా. 22 క్యారెట్ల పసిడి ధర 250 రూపాయలు క్షీణించి రూ.55,400 ఉంది.
ఇక 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు 280రూపాయలు పడి రూ.60,440 స్థాయికి చేరింది. మరో వైపు వెండి ధర భారీగా తగ్గింది. హైదరాబాద్‌లో కేజీ ధర ఏకంగా 1500 రూపాయలు తగ్గి రూ.80500 వద్దకు చేరింది. (చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు భారీ షాక్! కేంద్రం సీరియస్)
ఇదీ చదవండి: నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment