
గత కొన్ని రోజులుగా బంగారం నేలచూపులు చూస్తోంది. సుమారు వారం రోజుల నుంచి రోజు రోజుకి పసిడి ధరలు పతనమవుతూ ఉన్నాయి. ఈ రోజు (అక్టోబర్ 02) కూడా 10 గ్రాముల బంగారం ధర మునుపటి కంటే రూ. 160 వరకు తగ్గింది. ఈ కథనంలో ఈ రోజు గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయో క్షుణ్ణంగా తెలుసుకుందాం.
👉 విజయవాడలో ఈ రోజు బంగారం ధర రూ. 5320 (ఒక గ్రామ్ 22 క్యారెట్స్), రూ. 5804 (ఒక గ్రామ్ 24 క్యారెట్స్)గా ఉంది. ఈ లెక్కన 10 గ్రాముల పసిడి ధర రూ. 53200 & రూ. 58040. అంటే నిన్నటికంటే కూడా ఈ రోజు బంగారం ధర రూ. 150 నుంచి రూ. 160 వరకు తగ్గినట్లు తెలుస్తోంది. ఇదే ధరలు హైదరాబాద్, వైజాగ్, గుంటూరు, ప్రొద్దుటూరులో కూడా ఉన్నాయి.
👉 ఇక వెండి విషయానికి వస్తే, 10 గ్రామ్స్ సిల్వర్ ధర రూ. 755, కావున కేజీ వెండి ధర రూ. 75500. ఈ ధరలు కూడా నిన్నటితో పోలిస్తే రూ. 500 తగ్గినట్లు తెలుస్తోంది. ఇదే ధరలు మిగిలిన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి.
👉 చెన్నైలో ఒక గ్రామ్ 22 క్యారెట్ల & 24 క్యారెట్ల బంగారం ధర రూ. 5336 & రూ. 5843. దీని ప్రకారం 10 గ్రాముల బంగారం రూ. 53360 (22క్యారెట్స్) రూ. 58430 (24 క్యారెట్స్)గా ఉంది.
👉 వెండి ధర చెన్నైలో రూ. 75.50. అంటే 1 కేజీ వెండి ధర ఇక్కడ రూ. 75500. నిన్నటి కంటే ఈ రోజు వెండి ధర కేజీ మీద 500 తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది.
👉 ఢిల్లీలో ఒక గ్రామ్ 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 5335 కాగా 24 క్యారెట్ బంగారం రూ. 5819గా ఉంది. 10 గ్రాముల పసిడి ఇక్కడ రూ. 53350 (22 క్యారెట్) రూ. 58190 (24 క్యారెట్).
👉 వెండి ధర ఢిల్లీలో రూ. 73.00 (ఒక గ్రామ్). దీని ప్రకారం ఒక కేజీ వెండి ధర రూ. 73000. నిన్న కంటే నేడు వెండి ధర కేజీపై రూ. 500 వరకు తగ్గింది. మొత్తం మీద పండుగ సీజన్లో బంగారం వెండి ధరలు తగ్గడం పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి.