ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు: 2025లో ఇదే గరిష్టం | Today Gold and Silver Price (January 3rd 2025) | Sakshi
Sakshi News home page

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు: 2025లో ఇదే గరిష్టం

Published Fri, Jan 3 2025 10:30 AM | Last Updated on Fri, Jan 3 2025 10:41 AM

Today Gold and Silver Price (January 3rd 2025)

కొత్త ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా గోల్డ్ రేటు (Gold Price) గరిష్టంగా రూ.870 పెరిగింది. జనవరి 1 నుంచి ఈ రోజు (January 3) వరకు 10 గ్రాముల పసిడి ధర గరిష్టంగా రూ.1,640 పెరిగింది. దీంతో తులం బంగారం రేటు రూ. 80వేలకు చేరువయింది. ఈ కథనంలో నేటి బంగారం ధరలు ఏ ప్రాంతంలో ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.

దేశ రాజధాని నగరం ఢిల్లీలో 22 క్యారెట్ల 10గ్రా గోల్డ్ రేటు రూ.79,350 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.72,750 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.870,  రూ.800 పెరిగినట్లు స్పష్టమవుతోంది.

చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 72,600 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 79,200 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే ఈ రోజు ధరలు వరుసగా రూ. 800, రూ. 870 పెరిగినట్లు తెలుస్తోంది.

ఇక హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో గోల్డ్ రేటు వరుసగా రూ.800 (22 క్యారెట్స్ 10గ్రా), రూ.870 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 72,600కు చేరుకోగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 79,200 వద్ద నిలిచింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.

వెండి ధరలు
2025 ప్రారంభం నుంచి నిశ్చలంగా ఉన్న వెండి ధరలు ఈ రోజు ఏకంగా రూ. 2000 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ. 1,00,000కు చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 92,500 వద్ద ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement