Today Gold Rate In Telugu: స్వల్పంగా పెరిగిన బంగారం ధర - Sakshi
Sakshi News home page

స్వల్పంగా పెరిగిన బంగారం ధర

Published Wed, Jun 23 2021 10:28 AM | Last Updated on Wed, Jun 23 2021 10:47 AM

Today Gold Price In Multi Commodity Exchange  - Sakshi

వడ్డీరేట్లు ఇప్పుడే పెంచబోమంటూ యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రకటించిన కాసేపటికే ఫ్యూచర్స్‌ బంగారం ధర పెరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌(ఎంసీఎక్స్‌)లో ఆగష్టు ఫ్యూచర్స్‌లో 10 గ్రాముల బంగారం ధర ప్రారంభంలో 47011 నుంచి  47,091కి చేరుకుంది.  వెండికి  సంబంధించి జులై ఫ్యూచర్స్‌లో కిలో వెండి ధర 67,515 నుంచి 67,819కి చేరుకుంది. 

పెరిగిన కొనుగోళ్లు
ఇటీవల బంగారం ధరలు తగ్గడంతో దేశీయంగా కొనుగోళ్లు పెరిగాయి. మిగిలిన దేశాలతో పోల్చితే బంగారం మార్కెట్‌ ఇండియాలో మెరుగ్గానే ఉంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 47,312గా నమోదు అవగా కిలో వెండి 68,198గా ఉంది. 

చదవండి జెట్‌.. సెట్‌.. టేకాఫ్‌! దివాలా విమాన కంపెనీకి మళ్లీ రెక్కలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement