బులియన్ మార్కెట్‌లో బంగారం ధర ఎప్పుడు పెరుగుతుందో? ఎప్పుడు తగ్గుతుందో? అంచనా వేయడం చాలా కష్టంగా మారింది. గత రెండు రోజులుగా స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు నేడు మళ్లీ తగ్గాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ మార్కెట్‌లో నేడు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. నేడు (మార్చి 26) నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.40,950గా ఉంది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర రూ.180 తగ్గింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం(ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.44,710 ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.190 తగ్గింది.
అదేవిదంగా హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.41,700గా ఉంది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర రూ.300 తగ్గింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం(ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,490 ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.330 తగ్గింది. బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.69,500గా ఉంది. నిన్నటితో పోలిస్తే కిలో వెండి ధర రూ.100 పెరిగింది. బంగారం ధర హెచ్చుతగ్గులపై ఎన్నో అంశాలు ప్రభావితం చూపుతాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు కారణాల వల్ల బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment