Top 10 Whatsapp Features 2020 | వాట్సాప్ లో వచ్చిన బెస్ట్ ఫీచర్స్ ఇవే - Sakshi
Sakshi News home page

2020 వాట్సాప్ లో వచ్చిన బెస్ట్ ఫీచర్స్ ఇవే

Published Tue, Dec 22 2020 7:04 PM

Top 10 Features of WhatsApp Launched in 2020 - Sakshi

ప్రపంచవ్యాప్తంగా బాగా ఆదరణ పొందిన మెసేజింగ్ యాప్స్ లో వాట్సప్ మొదటి స్థానంలో ఉంటుంది. ప్రతి చిన్న అవసరానికి మనం నిత్యం ఉపయోగించేది మెసేజింగ్ యాప్ వాట్సప్‌. మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్లు, ఆడియోలు... ఇలా ఏది పంపాలన్నా మనం వాట్సాప్ పై బాగా ఆధారపడుతున్నాం. అసలు వాట్సాప్ లేని స్మార్ట్‌ఫోన్ ఉండటం చాలా అరుదు అని చెప్పుకోవచ్చు. ఇంతలా ఆదరిస్తున్న వినియోగదారుల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్స్ తీసుకువస్తుంది. ఈ సంవత్సరం వాట్సాప్ లో వచ్చిన అప్‌డేట్లు ఏ మెసేజింగ్ యాప్ లో రాలేదు. వాట్సాప్ పే, డార్క్ మోడ్, గ్రూప్ వీడియో కాలింగ్ వంటి ఫీచర్లతో పాటు చాలా తీసుకొచ్చింది. అందుకే ఈ ఏడాది 2020లో వాట్సాప్ తీసుకొచ్చిన పది అత్యుత్తమ ఫీచర్లను ఒకసారి పరిశీలిద్దాం.(చదవండి: ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ లో బెస్ట్ బడ్జెట్ మొబైల్స్ ఇవే!)

1. వాట్సాప్ పేమెంట్స్ 
వాట్సాప్ తన చెల్లింపు సేవలను 'వాట్సాప్ పే' సర్వీసులను గత నెలలో తీసుకొచ్చింది. వాట్సాప్ పే సేవల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ), యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యుపిఐ)తో వాట్సాప్ ఒప్పందం కుదుర్చుకుంది. వాట్సాప్ పేమెంట్స్ కోసం 160కి పైగా బ్యాంకులతో ఒప్పందం చేసుకుంది. దింతో ఇప్పుడు వాట్సాప్ లో మెసేజ్ పంపినంత సులభంగా డబ్బులు చెల్లించవచ్చు.

2. డిసప్పీయరింగ్ మెస్సేజెస్
మనకు స్నేహితులు, మిత్రులు, ఉద్యోగుల నుండి నిత్యం మనకు చాల మెసేజ్ లు వస్తుంటాయి. ఇందులో కొన్ని మాత్రమే మనకు అవసరం అవుతాయి. దింతో మన ఫోన్ యొక్క స్టోరేజ్ ఫుల్ అవుతుంది. ఇందుకోసమే వాట్సాప్ డిసప్పీయరింగ్ మెస్సేజెస్ ఫీచర్ ని తీసుకొచ్చింది. వారం రోజుల్లో మెసెజీలు, మీడియా ఫైల్స్‌ను ఆటోమాటిక్‌గా డీలిట్‌ అయ్యే విదంగా ఈ ఫీచర్ ని తెచ్చింది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌, డెస్క్‌టాప్‌, కేఏఐవోఎస్‌ ఆపరేటింగ్ సిస్టమ్ లలో పనిచేస్తుంది.

   

3. రీ డిజైన్డ్ స్టోరేజ్ మేనేజ్‌మెంట్
పైన చెప్పిన విదంగానే మన స్టోరేజ్ ఫుల్ అయినప్పుడు ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ స్టోరేజ్ ని తగ్గించుకోవడంతో పాటు ఫోన్ యొక్క పనితీరును మెరుగుపరుచుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు వాట్సాప్‌లో అవసరం లేని డేటాను, మెస్సేజ్‌లను ఒకేసారి డిలీట్ చేసుకోవచ్చు. 

4. మ్యూట్ ఆల్‌వేస్‌
మనకు నిత్యం ఎవరినుండైనా మెసేజ్ లు వచ్చినప్పుడు మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ల ద్వారా మనం కొన్ని సార్లు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అందుకే వాట్సాప్ 'మ్యూట్ ఆల్‌వేస్' అనే ఫీచర్ ని తీసుకొచ్చింది. ఇంతకూ ముందు వారం, నేల, సంవత్సరం వరకు మాత్రమే మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఉండేది.   

5. కస్టమైజబుల్ వాల్‌పేపర్స్
ఈ ఫీచర్ ద్వారా మనం మనకు నచ్చిన కాంటాక్ట్స్, గ్రూప్ లకు ప్రత్యేకంగా వాల్ పేపర్ లను సెట్ చేసుకోవచ్చు.  

6. వాట్సాప్ అడ్వాన్స్‌డ్ సెర్చ్
వాట్సాప్ అడ్వాన్స్‌డ్ సెర్చ్ తో మనం ఇప్పుడు పత్రాలు, లింక్‌లతో పాటు ఫోటోలు, ఆడియో, GIFలు, వీడియోలను వెంటనే మన వాట్సాప్ లో సెర్చ్ చేసుకోవచ్చు. దింతో మనకు సమయం చాలా ఆదా అవుతుంది. 

7. యానిమేటెడ్ స్టిక్కర్లు
వాట్సాప్‌లోని స్టిక్కర్లు భావోద్వేగాలను వ్యక్తీకరించడంలో చాలా భాగా పని చేస్తాయి. ప్రజలు వాట్సాప్‌లో వేగంగా కమ్యూనికేట్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. యాప్ యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్‌ల ద్వారా చాట్ మరింత ఆహ్లాదకరంగా మారుతుంది. 

8. క్యూఆర్ కోడ్
మీరు ఎవరినైనా కొత్త వారిని కలిసినప్పుడు వారిని మీ కాంటాక్ట్ లిస్ట్ లో సులభంగా ఆడ్ చేసుకోవడం కోసం ఈ ఫీచర్ తీసుకొచ్చారు. దీని కోసం మీరు అవతలి వారి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సరిపోతుంది.
 
9. గ్రూప్ వీడియో కాల్స్
కరోనా కాలంలో వీడియో కాల్స్ వాడకం చాలా పెరిగింది. లాక్ డౌన్ వల్ల ఒకరిని ఒకరు కలవడం కష్టమైనా తరుణంలో వాట్సాప్ ఈ గ్రూప్ వీడియో కాల్ ఫీచర్ ని తీసుకొచ్చింది. గ్రూప్ వీడియో కాల్ ఫీచర్ లో భాగంగా ఒకేసారి 8మందితో మాట్లాడే అవకాశం ఉంది.

 

10. డార్క్ మోడ్
మన కంటి మీద ఒత్తిడిని తగ్గించడంతో పాటు, మన బ్యాటరీ సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి వాట్సాప్ ఈ డార్క్ మోడ్ ఫీచర్ ని తీసుకొచ్చింది. రాత్రి వేళలో ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ ఫీచర్ ని కంప్యూటర్/డెస్క్‌టాప్‌కు కూడా విస్తరించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement