టయోటా వాహనాలను కొనుగోలుచేసే కస్టమర్లకు కంపెనీ భారీ షాకిచ్చింది. భారత్‌లోని అన్ని రకాల మోడల్ వాహనాల ధరలను పెంచుతూ టయోటా నిర్ణయం తీసుకుంది. వాహనాల ధరల పెంపు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. దీంతో టయోటాలోని బెస్ట్ సెల్లర్స్ ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ, ఇన్నోవా క్రిస్టాల ధరలు భారీగా పెరగనున్నాయి.
కారణం ఇదే..!
ఇప్పటికే పలు ఆటోమొబైల్ కంపెనీలు వచ్చే ఏడాది నుంచి వాహనధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వారితో పాటుగా టయోటా కూడా చేరింది. ముడి పదార్థాలతో సహా ఇన్‌పుట్ ఖర్ఛులు స్థిరంగా పెరగడం కారణంగా ధరల పెంపు అనివార్యమైందని టయోటా ఒక ప్రకటనలో వెల్లడించింది. తమ కస్టమర్లపై ఖర్చుల పెరుగుదల ప్రభావం వీలైనంత తక్కువగా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు కంపెనీ పేర్కొంది.
చిప్ కొరత..పడిపోయిన అమ్మకాలు..!
ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీల తయారీ ఇన్‌పుట్‌లు ధరలు భారీగా పెరగడం, సెమీకండక్టర్ చిప్ కొరత కారణంగా అనేక కంపెనీలకు పెద్ద సవాళ్లు ఎదురయ్యాయి.దేశవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టడంతో వాహనాలకు డిమాండ్ పెరిగింది. అయితే ఉత్పాదకలో, సరఫరా సమస్యలు 2022లో కూడా వెంటాడే అవకాశం ఉన్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) అభిప్రాయపడింది.
గడిచిన నెలలో పలు కంపెనీల కార్ల అమ్మకాలు అత్యంత దారుణంగా ఉందని పేర్కొంది. చిప్ కొరత ఆయా కంపెనీలకు ఉత్పత్తిలో ప్రభావితం చేశాయి. ప్యాసింజర్ వాహనాల రిజిస్ట్రేషన్లు 3,24,542 యూనిట్లుగా ఉండగా.., గత ఏడాది నవంబర్ నెలలో 4,39,564 యూనిట్ల నుంచి 26 శాతం మేర తగ్గాయి.
చదవండి: టయోటా దూకుడు.. లైనప్‌లో 30 ఎలక్ట్రిక్ మోడళ్లు
Comments
Please login to add a commentAdd a comment