అంతరిక్షంలో ఫిల్మ్ స్టూడియో ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా?. కానీ, మీరు చదివింది నిజమే. స్పేస్ ఎంటర్ ప్రైజ్(సీఈఈ) ప్లాన్ చేసిన విధంగా అన్నీ పనులు జరిగితే డిసెంబర్ 2024లో అంతరిక్షంలో ఒక ఫిల్మ్ స్టూడియో ప్రారంభంకానుంది. అంతరిక్షంలో మూవీ ప్రొడక్షన్ స్టూడియో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు యు.కె.కు చెందిన స్పేస్ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రైజ్(సీఈఈ) ప్రకటించింది. సీఈఈ-1 పేరుతో ఈ మాడ్యూల్'ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) వాణిజ్య విభాగమైన ఆక్సియోమ్ స్టేషన్‌కు అనుసంధానం చేస్తారు.
ఆక్సియోమ్ తన స్వంత మాడ్యూల్ ఆక్సియోమ్ స్టేషన్‌ను సెప్టెంబర్ 2024లో ఐఎస్ఎస్'కు అనుసంధానించాలని యోచిస్తోంది. ఆ రెండు నెలల తర్వాత సీఈఈ-1 ఆక్సియోమ్ స్టేషన్ తో అనుసంధానం కానుంది. ఆక్సియోమ్ స్టేషన్ 2028లో ఐఎస్ఎస్ నుంచి విడిపోనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే, ఇందుకోసం ఎంత ఖర్చు అవుతుందో ఎక్కడ పేర్కొనలేదు. ఈ అంతరిక్ష మాడ్యూల్ వల్ల ఫిల్మ్ మేకర్లు, కళాకారులు భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న తక్కువ భూ కక్ష్య(లియో)లో మైక్రోగ్రావిటీలో షూటింగ్ చేసే అవకాశం ఏర్పడుతుంది.
అంతరిక్షంలో షూటింగ్
గతంలో రష్యాకి చెందిన 'ది ఛాలెంజ్' అనే సినిమా కోసం ఆ చిత్ర దర్శకుడు క్లిమ్ షిపెంకో, హీరోయిన్ యులియా పెరెసిల్డ్ అంతరిక్షానికి వెళ్లి అక్కడ షూటింగ్ చేశారు. రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్కోస్మోస్‌కు చెందిన సోయుజ్ ఎంఎస్19 వ్యోమనౌకలో మరో వ్యోమగామి ఆంటన్ ష్కాప్లెరోవ్‌తో కలిసి ఐఎస్‌ఎస్ వెళ్లారు. అంతరిక్ష కేంద్రంలో ప్రాణపాయ స్థితిలో ఉన్న ఓ వ్యోమగామిని కాపాడేందుకు భూమి నుంచి ఓ డాక్టర్ ఐఎస్‌ఎస్‌కు వెళ్లే సీన్ ను చిత్రీకరించడానికి స్పేస్ కి వెళ్లారు. సినిమాలో ఈ ఎపిసోడ్ దాదాపు 35 నుంచి 40 నిమిషాల వరకు ఉంటుందట.
Comments
Please login to add a commentAdd a comment