భారత్ సెమీకండెక్టర్ చిప్‌సెట్ల కొరతను ఎదుర్కొంటోంది. ప్రతివాహనం, ఎలక్ట్రానిక్ వస్తువు తయారుచేయాలంటే సెమీకండక్టర్ చిప్‌సెట్ ప్రముఖపాత్ర వహిస్తోంది. వాటి కొరత తీరేలా త్వరలో రెండు పూర్తి స్థాయి చిప్ తయారీ ప్లాంట్లు ఇండియాలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
ఈ రెండింటికి తోడు మరికొన్ని సెమీకండక్టర్ అసెంబ్లింగ్, ప్యాకేంజింగ్ ప్లాంట్లు కూడా ఇండియాకు రానున్నాయని చెప్పారు. ఇజ్రాయిల్ కంపెనీ టవర్ సెమీకండక్టర్స్ దేశంలో 8 బిలియన్ డాలర్లు (రూ.66,400 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు నిర్ధారించారు.
టాటా గ్రూప్ కూడా అసోంలో చిప్ తయారీ చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి మాట్లాడుతూ ‘రెండు పూర్తి స్థాయి చిప్‌ల తయారీ ప్లాంట్లు త్వరలో ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా మల్టీ బిలియన్ డాలర్ల పెట్టుబడులు దేశానికి రానున్నాయి. ఈ ప్లాంట్లలో 65, 40, 28 నానోమీటర్ చిప్‌లు తయారవుతాయి. వీటికి తోడు మరికొన్ని చిప్ ప్యాకేజింగ్, అసెంబ్లింగ్‌కు సంబంధించి కొన్ని పెట్టుబడులను పరిశీలిస్తున్నాం’ అని మంత్రి తెలిపారు.
భారీ రాయితీలతో..
సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్ పెట్టేందుకు ప్రభుత్వం నాలుగు ప్రపోజల్స్‌ను అందుకున్నట్లు తెలిసింది. మరో 13 చిప్ అసెంబ్లింగ్, టెస్టింగ్, మానిటరింగ్, ప్యాకేజింగ్ (ఏటీఎంపీ) యూనిట్లకు సంబంధించి ప్రపోజల్స్ వచ్చినట్లు సమాచారం. ఈ ప్రపోజల్స్ గుజరాత్‌లో యూఎస్ కంపెనీ మైక్రాన్ పెట్టుబడులకు అదనం. కాగా, సెమీకండక్టర్ సెక్టార్‌లో పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం రూ.76 వేలకోట్ల విలువైన రాయితీలను ఇవ్వాలని నిర్ణయించుకుంది.
ఇదీ చదవండి: 2024లో హైదరాబాద్‌లో రాబోయే ఇళ్లు ఎన్నంటే..
ఇందులో భాగంగా ఏదైనా కంపెనీ ఇండియాలో చిప్‌ల తయారీ ప్లాంట్ పెడితే ప్రాజెక్ట్‌లో 50 శాతం ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. మైక్రాన్, టాటా ఎలక్ట్రానిక్స్, కేన్స్ కార్పొరేషన్ ఇండియాలో చిప్‌ల తయారీ ప్లాంట్ పెడతామని ప్రకటించాక చాలా కంపెనీలు ఈ సెక్టార్‌లోకి ప్రవేశిస్తామని ప్రకటించాయి. హెచ్‌సీఎల్ గ్రూప్, మురుగప్ప గ్రూప్ ఇందులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment