హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీ మార్కెట్లు కొత్త గరిష్ట స్థాయులను తాకుతున్నా, వేల్యుయేషన్స్ మరీ అధిక స్థాయికి చేరలేదని మ్యుచువల్ ఫండ్ సంస్థ యూటీఐ ఏఎంసీ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ (సీఐవో) వెట్రి సుబ్రమణ్యం చెప్పారు. వాస్తవానికి 2021 నాటితో పోలిస్తే ఇంకా కాస్త తక్కువలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకూ నిబ్బరంగా ఉన్న అమెరికాలో పరిస్థితులేమైనా మారి, మాంద్యంలాంటిదేమైనా వస్తే మార్కెట్లపైనా ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. అయితే, ప్రస్తుతం మాత్రం అటువంటిదేమీ కనిపించడం లేదని పేర్కొన్నారు.
స్మాల్‌క్యాప్ వేల్యుయేషన్స్ భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో లార్జ్ క్యాప్స్ మెరుగ్గా ఉన్నాయని సోమవారమిక్కడ విలేకరులకు సుబ్రమణ్యం చెప్పారు. పెట్టుబడులకు సంబంధించి ఫైనాన్షియల్స్, ఆటోమొబైల్, ఫార్మా, ఐటీ తదితర రంగాలు కొంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని వివరించారు. తాజాగా యూటీఐ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజీ ఫండ్ పేరిట కొత్త ఫండ్ (ఎన్‌ఎఫ్‌వో)ను ప్రారంభిస్తున్నట్లు సుబ్రమణ్యం తెలిపారు. ఇది జూలై 21న ప్రారంభమవుతుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ ఫండ్ ద్వారా సేకరించే నిధులను వేల్యుయేషన్స్ ప్రాతిపదికన ఈక్విటీ, ఫిక్సిడ్ ఇన్‌కం సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తామని, తద్వారా అధిక రాబడులు అందించేందుకు ప్రయతి్నస్తామని సుబ్రమణ్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment