ఇంకొద్ది రోజుల ఆగితే దసరా, దీపావళి సీజన్ మొదలు కాబోతుంది. ఇప్పటికే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ప్రత్యేక సేల్ పేరుతో ఆఫర్లు భారీగా ప్రకటిస్తున్నాయి. త్వరలో రాబోయే సేల్‌లో ఏమైనా కొనాలని అనుకుంటున్నారా?. అయితే, మీకు ఒక శుభవార్త డబ్బులు లేకపోయినా మీకు ఇష్టమైనవస్తువును కొనే అవకాశాన్ని ఈ-కామర్స్ సంస్థలు కల్పిస్తున్నాయి. నో-కాస్ట్ ఈఎంఐ పేరుతో దిగ్గజ సంస్థలు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే, మనలో చాలా మందికి ఒక ప్రశ్న మదిలో మెదులుతుంది. అసలు నిజంగానే మనకు నో-కాస్ట్ ఈఎంఐ వల్ల లాభం ఉందా అని. దీని గురుంచి కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం.
దాదాపు అన్ని ప్రొడక్ట్స్‌ని నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా కొనే వెసులుబాటు కల్పిస్తున్నాయి. డబ్బులు లేకపోయినా ఏమి కావాలన్నా కొనే ఛాన్స్ రావడంతో కస్టమర్లు ఎగిరిగంతేస్తున్నారు. అది కూడా వడ్డీ లేకుండా నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా లభిస్తుండటంతో షాపింగ్ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. (చదవండి: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 480 కి.మీ వెళ్లొచ్చు తెలుసా?)
నో కాస్ట్ ఈఎమ్ఐ అంటే ఏమిటి?
సాధారణ ఈఎమ్ఐతో పోలిస్తే నో కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్ ఎంచుకుంటే? మీరు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీరు రూ.19 వేలు విలువైన మొబైల్ కొన్నప్పుడు మీరు 5 నెలల కాలానికి ఒక రూ.1000 వడ్డీ అవుతుందనుకుందాం. ఇప్పుడు మొత్తం రూ.20,000 చెల్లించాలి. 10 నెలలకు ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే నెలకు రూ.2,000 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. అదే మీరు నో కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్ ఎంచుకుంటే? ఎంత అయితే వస్తువు ధర ఉంటుందో అంతే మొత్తాన్ని సమాన వాయిదా పద్దతుల్లో చెల్లించాల్సి ఉంటుంది. అంతకు మించి చెల్లించాల్సిన అవసరం లేదు.
అయితే, ఇక్కడే ఓకే చిన్న కిటుకు ఉంది. మీరు ఏదైనా వస్తువును కొంటె ఈఎమ్ఐ కింద ఎంచుకున్నప్పుడు కొంత మొత్తం డిస్కౌంట్ లభిస్తుంది. కానీ, అదే నో కాస్ట్ ఈఎమ్ఐ ఎంచుకుంటే మీకు ఎలాంటి డిస్కౌంట్ వర్తించదు. కాబట్టి, ఆ మేరకు డిస్కౌంట్ కోల్పోయినట్టే. అంటే మీరు పేమెంట్ చేస్తే వచ్చే సాధారణ ఈఎమ్ఐ లభించే డిస్కౌంట్‌ను మీరు ముందే చెల్లిస్తారు కాబట్టి వస్తువు అమ్మినవారితో పాటు బ్యాంకుకు కూడా లాభమే. నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా వస్తువులు కొంటారు కాబట్టి ముందుగా ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల వినియోగదారుడికి బ్యాంకుకు ఇద్దరికీ లాభమే. అందుకే ఈ-కామర్స్ సంస్థలు నో కాస్ట్ ఈఎమ్ఐను ఎక్కువగా ఆఫర్ చేస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment