No Cost EMI option
-
'నో కాస్ట్' ఈఎంఐ కిరికిరి, అసలు రహస్యం ఇది!
ఫెస్టివల్ సీజన్ సందర్భంగా రీటైల్, ఈ కామర్స్ సంస్థలు ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తుంటాయి. ఈ సందర్భంగా పలు ప్రొడక్ట్‌లపై డిస్కౌంట్లు, ఎక్ఛేంజ్ ఆఫర్లతో పాటు, నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్నిఅందిస్తుంటాయి. అయితే ఈ నోకాస్ట్ ఈఎంఐ అంటే ఏమిటి? ఈ నోకాస్ట్ ఈఎంఐ వల్ల కొనుగోలు దారులకు లబ్ధి చేకూరుతుందా? దాని వెనుక ఏదైనా మతలబు దాగి ఉందా? ఏడాదిలో జరిగే ఫెస్టివల్స్ సీజన్లో సంస్థలు ప్రొడక్ట్‌ల అమ్మకాలు జరిగేలా నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని అందిస్తుంటాయి. అందుకే కొనుగోలు దారులు గృహోపకరణాలు, వెహికల్స్, గాడ్జెట్స్‌ను ఫెస్టివల్ సీజన్లో కొనుగోలు చేసేందుకే ఇష్టపడుతుంటారు. ఈ కొనుగోలు ముందు ఈ నోకాస్ట్ ఈఎంఐ గురించి తెలుసుకోవాలని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. నో కాస్ట్ ఈఎంఐ అంటే ముందుగా నో కాస్ట్ ఈఎంఐ అంటే? నోకాస్ట్ ఈఎంఐ కింద ఓ వస్తువును ఎంత ధర పెట్టి కొనుగోలు చేస్తామో.. ఆ మొత్తాన్ని నెలనెలా కొద్ది మొత్తాన్ని చెల్లించాలి. ఆ మొత్తానికే సంస్థలు ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయవు. ఇలా నెలవారీ చెల్లించే ఈఎంఐలపై ఎలాంటి వడ్డీని విధించకపోవడాన్ని నోకాస్ట్ ఈఎంఐ అంటారు. నోకాస్ట్ ఈఎంఐ కిరికిరి ఉదాహరణకు రమేష్ అనే వ్యక్తి అప్పుడే మార్కెట్లో విడుదలైన 5జీ ఫోన్‌ను నో కాస్ట్ ఈఎంఐ కింద రూ.30వేలకు కొనుగోలు చేస్తాడు. ఆమొత్తాన్ని 10 నెలల టెన్యూర్ కాలానికి ఒక్కో నెల 3వేలు చెల్లించి.. ఈఎంఐని క్లియర్ చేస్తాడు. వడ్డీ లేదని తెగ సంబర పడిపోతుంటాడు. కానీ ఈ నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్లో జరిగేది అదికాదు. రమేష్ ఫోన్ ధర వాస్తవానికి రూ.27వేలు ఉంటుంది. సంస్థలు అదనంగా మరో రూ.3వేలు జత చేసి.. ఫోన్ ధర రూ.30వేలు ఉందని, మీకు డిస్కౌంట్లో జీరోకాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని అందిస్తున్నామని ఊదర గొట్టేస్తుంటాయి. మరో రకమైన వసూలు మరో రకంగా చెప్పాలంటే అదే రమేష్ కొన్న 5జీ ఫోన్ వాస్తవ ధర రూ.30 వేలు ఉంటుంది. కానీ ఫోన్ తయారీ సంస్థలు జీరో కాస్ట్ ఈఎంఐ ప్రాసెసింగ్ ఫీజును వసూలు చేస్తుంటాయి. ఆ ప్రాసెసింగ్ ఫీజు ఏంటో తెలుసా? మీకు అందించే ఈఎంఐ కింద సంస్థలు వసూలు చేసే వడ్డీ. తస్మాత్ జాగ్రత్త కాబట్టి, కొనుగోలు దారులు నోకాస్ట్ ఈఎంఐలో ప్రొడక్ట్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటే.. తప్పని సరిగా నియమ నిబంధనల గురించి తెలుసుకోవడం మంచిదని ఆర్ధిక నిపుణులు సలహా ఇస్తున్నారు. చదవండి👉 ఈపీఎఫ్ అకౌంట్లో మీ వడ్డీ డబ్బులు కనిపించడం లేదా? -
నో కాస్ట్ ఈఎమ్ఐ వల్ల కలిగే లాభమేంటి?
ఇంకొద్ది రోజుల ఆగితే దసరా, దీపావళి సీజన్ మొదలు కాబోతుంది. ఇప్పటికే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ప్రత్యేక సేల్ పేరుతో ఆఫర్లు భారీగా ప్రకటిస్తున్నాయి. త్వరలో రాబోయే సేల్‌లో ఏమైనా కొనాలని అనుకుంటున్నారా?. అయితే, మీకు ఒక శుభవార్త డబ్బులు లేకపోయినా మీకు ఇష్టమైనవస్తువును కొనే అవకాశాన్ని ఈ-కామర్స్ సంస్థలు కల్పిస్తున్నాయి. నో-కాస్ట్ ఈఎంఐ పేరుతో దిగ్గజ సంస్థలు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అయితే, మనలో చాలా మందికి ఒక ప్రశ్న మదిలో మెదులుతుంది. అసలు నిజంగానే మనకు నో-కాస్ట్ ఈఎంఐ వల్ల లాభం ఉందా అని. దీని గురుంచి కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. దాదాపు అన్ని ప్రొడక్ట్స్‌ని నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా కొనే వెసులుబాటు కల్పిస్తున్నాయి. డబ్బులు లేకపోయినా ఏమి కావాలన్నా కొనే ఛాన్స్ రావడంతో కస్టమర్లు ఎగిరిగంతేస్తున్నారు. అది కూడా వడ్డీ లేకుండా నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా లభిస్తుండటంతో షాపింగ్ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. (చదవండి: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 480 కి.మీ వెళ్లొచ్చు తెలుసా?) నో కాస్ట్ ఈఎమ్ఐ అంటే ఏమిటి? సాధారణ ఈఎమ్ఐతో పోలిస్తే నో కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్ ఎంచుకుంటే? మీరు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మీరు రూ.19 వేలు విలువైన మొబైల్ కొన్నప్పుడు మీరు 5 నెలల కాలానికి ఒక రూ.1000 వడ్డీ అవుతుందనుకుందాం. ఇప్పుడు మొత్తం రూ.20,000 చెల్లించాలి. 10 నెలలకు ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే నెలకు రూ.2,000 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. అదే మీరు నో కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్ ఎంచుకుంటే? ఎంత అయితే వస్తువు ధర ఉంటుందో అంతే మొత్తాన్ని సమాన వాయిదా పద్దతుల్లో చెల్లించాల్సి ఉంటుంది. అంతకు మించి చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ఇక్కడే ఓకే చిన్న కిటుకు ఉంది. మీరు ఏదైనా వస్తువును కొంటె ఈఎమ్ఐ కింద ఎంచుకున్నప్పుడు కొంత మొత్తం డిస్కౌంట్ లభిస్తుంది. కానీ, అదే నో కాస్ట్ ఈఎమ్ఐ ఎంచుకుంటే మీకు ఎలాంటి డిస్కౌంట్ వర్తించదు. కాబట్టి, ఆ మేరకు డిస్కౌంట్ కోల్పోయినట్టే. అంటే మీరు పేమెంట్ చేస్తే వచ్చే సాధారణ ఈఎమ్ఐ లభించే డిస్కౌంట్‌ను మీరు ముందే చెల్లిస్తారు కాబట్టి వస్తువు అమ్మినవారితో పాటు బ్యాంకుకు కూడా లాభమే. నో-కాస్ట్ ఈఎంఐ ద్వారా వస్తువులు కొంటారు కాబట్టి ముందుగా ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. దీని వల్ల వినియోగదారుడికి బ్యాంకుకు ఇద్దరికీ లాభమే. అందుకే ఈ-కామర్స్ సంస్థలు నో కాస్ట్ ఈఎమ్ఐను ఎక్కువగా ఆఫర్ చేస్తాయి. -
కొత్త బైక్ కొనేవారికి టీవీఎస్ మోటార్ గుడ్‌న్యూస్!
మీరు కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. టీవీఎస్ మోటార్ ఇండియా అత్యంత ప్రజాదరణ పొందిన అపాచీ ఆర్టీఆర్ 160 4వీపై నో కాస్ట్ ఈఎమ్ఐ ఆఫర్‌ను ప్రకటించింది. మీరు అపాచీ బైక్ కొనుగోలు చేసే సమయంలో 3 నుంచి 6 నెలల కాలానికి ఈఎమ్ఐ ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఈ ఆఫర్ జూలై 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. టీవీఎస్ మోటార్ ఇండియా అందించిన ఈ ఆఫర్ ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్ కార్డు హోల్డర్లకు మాత్రమే వర్తిస్తుంది. అందువల్ల, ఈ ఆఫర్ పూర్తి వివరాల కోసం మీకు దగ్గరల్లో ఉన్న టీవీఎస్ షో రూమ్ లను సంప్రదించండి. టీవీఎస్ మోటార్స్ తెలిపిన వివరాల ప్రకారం, మీరు కేవలం రూ.5 వేలు డౌన్ పేమెంట్‌తో అపాచీ ఆర్టీఆర్ 160 4వీ బైక్‌ను మీ దగ్గరలోని టీవీఎస్ షో రూమ్, అధికారిక వెబ్ సైట్ కొనుగోలు చేయవచ్చు. అలాగే, ఎన్ టోర్క్, అపాచే ఆర్టీఆర్ 200 4వీ, స్కూటీ పెప్ ప్లస్, జెస్ట్ కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వి 159.7 సీసీ సింగిల్ సిలిండర్, ఫోర్ వాల్వ్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలిగి ఉంది. ఇది గరిష్టంగా 9,250 ఆర్పీఎమ్ వద్ద 17.39 బిహెచ్ పీ పవర్ అవుట్ పుట్, 7,250 ఆర్ పిఎమ్ వద్ద 14.73 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. ఈ బైక్ ఎల్ఈడీ హెడ్ లైట్, ట్విన్ డీఆర్ ఎల్ అప్ ఫ్రంట్, ఎల్ ఈడి టెయిల్ ల్యాంప్, ఎబీఎస్, ఫుల్ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్, గ్లైడ్ త్రూ టెక్నాలజీ(జిటిటీ)తో వస్తుంది. ఈ స్పోర్ట్స్ కమ్యూటర్ మోటార్ సైకిల్ నైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, రేసింగ్ రెడ్ కలర్ రంగులలో లభ్యం అవుతుంది. చదవండి: డీఆర్డీఓ డీ-4 డ్రోన్ టెక్నాలజీతో డ్రోన్ల దాడికి చెక్ -
క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే ఇది చదవండి
సత్వర నిధులకు అందుబాటులో ఉన్న పలు మార్గాల్లో క్రెడిట్ కార్డ్‌లూ ఒకటి. వినియోగించే విధానం తెలిస్తే క్రెడిట్ కార్డులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బిల్లు తేదీ, చెల్లించేందుకు ఉన్న వడ్డీ రహిత గడువు, ఈఎంఐ ఆప్షన్, వడ్డీ రేట్లు, ఆలస్య రుసుములు.. ఇలా ప్రతీ ఒక్కటీ తెలిస్తే నెలవారీ బడ్జెట్ మీద అదనపు భారం పడకుండా క్రెడిట్ కార్డ్‌ను వినియోగించుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ బకాయిలను వినియోగదారులు తమ సామర్థ్యానికి అనుగుణంగా చెల్లింపులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. బకాయిలను నిర్ణీత గడువులోగా చెల్లిస్తే క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఎలాంటి వడ్డీని వసూలు చేయవు. గడువు తేదీ తర్వాత చెల్లిస్తే మాత్రం అధిక వడ్డీ రేట్లు, అదనపు ఫీజులు వసూలు చేస్తాయి. కనుక కుదిరితే క్రెడిట్ కార్డ్ బిల్లులను సమయానికి చెల్లించటమే ఉత్తమం. పెద్ద మొత్తంలోని బకాయిలను చెల్లించలేని స్థితిలో ఉంటే.. ఈఎంఐ విధానాలను ఎంచుకోవచ్చు. క్రెడిట్ కార్డును మెరుగ్గా నిర్వహించే మార్గాలను చూద్దాం.. ఈఎంఐ ఆప్షన్.. నిర్ణీత గడువు తేదీలోపు చెల్లించని క్రెడిట్ కార్డ్ బకాయిల మీద క్రెడిట్ కార్డ్ వినియోగాన్ని బట్టి 23 నుంచి 49 శాతం వరకు వడ్డీ కింద కంపెనీలు చార్జ్ చేస్తుంటాయి. దీంతో పాటు తిరిగి చెల్లింపుల్లో విఫలమైతే ఆలస్య రుసుము కింద రూ.1,300 వరకు కంపెనీలు వసూలు చేస్తుంటాయి. అంతేకాదు, ఈ తర్వాత క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై వడ్డీ రహిత కాల వ్యవధిని రద్దు చేసే ప్రమాదం కూడా లేకపోలేదు. గడువులోగా క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించకపోతే మీ రుణ చరిత్రపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇలాంటి ఇబ్బందులను నివారించేందుకు.. బిల్లులను సకాలంలో చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే, కొంత భాగాన్ని ఈఎంఐగా మార్చుకోవడం ఒక మార్గం. క్రెడిట్ కార్డ్ తిరిగి చెల్లింపుల కాల వ్యవధి (ఈఎంఐ) సాధారణంగా 3 నుంచి 60 నెలల వరకు ఉంటుంది. దీనిపై వార్షిక వడ్డీ రేటు 11–24 శాతంగా ఉంటుంది. అది కూడా క్రెడిట్ కార్డ్ వినియోగం, జారీ చేసిన కంపెనీని బట్టి మారుతుంటుంది. నో కాస్ట్ ఈఎంఐతో లాభమే.. ‘నో కాస్ట్ ఈఎంఐ’.. ‘రూపాయి చెల్లించి నచ్చిన ఉత్పత్తిని ఇంటికి తీసుకెళ్లండి.. ఆ తర్వాత ఎటువంటి వడ్డీ లేకుండా ఈఎంఐ చెల్లించండి’ అనే ప్రకటనలు చూసే ఉంటారు. మర్చంట్ ఈఎంఐ ఆప్షన్లో ఒక రకమే నో కాస్ట్ ఈఎంఐ స్కీమ్. ఇందులో ఈఎంఐ మీద వడ్డీని వర్తకులు లేదా తయారీదారులు భరిస్తారు. దీంతో ఉత్పత్తి లేదా సేవల ధరను ఈఎంఐల రూపంలో అనుమతించిన కాల వ్యవధి మేరకు కొనుగోలుదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ మీద వడ్డీ భారం పడకపోయినా.. ఆ వడ్డీపై 18% జీఎస్టీని క్రెడిట్ కార్డ్ వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. ఈఎంఐ ఆఫర్లు.. రిటైల్ స్టోర్లు, ఈ–కామర్స్ పోర్టళ్లు క్రెడిట్ కార్డ్‌ల కొనుగోళ్లపై ఈఎంఐలను ఆఫర్ చేస్తాయి. తయారీదారులు/వ్యాపారుల మధ్య ఒప్పందాలకు అనుగుణంగా.. ఈఎంఐ వడ్డీ రేట్లు, కాల వ్యవధులు నిర్ణయించడం జరుగుతుంది. ఆఫర్లలో భాగంగా ఆయా సంస్థలు ప్రకటించే ఈఎంఐ వడ్డీ రేట్లు.. క్రెడిట్ కార్డ్ బకాయిలను ఈఎంఐగా మార్చుకునే వడ్డీ రేట్లతో పోలిస్తే తక్కువగానే ఉండ డం ఆకర్షణీయం. అందుకే భారీ కొనుగోళ్లకు ముందుగా.. రిటైల్ స్టోర్లు, ఈ–కామర్స్ కంపెనీల ఈఎంఐ ఆఫర్లను తనిఖీ చేయాలి. పైగా ఈ ఆఫర్లకు ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం ఉండదు. క్రెడిట్ కార్డులపై రుణాలు.. మంచి సిబిల్ స్కోర్, చెల్లింపుల చరిత్ర ఉన్న వారు క్రెడిట్ కార్డులపై రుణాలనూ తీసుకోవచ్చు. కాకపోతే తీసుకున్న రుణం మేరకు క్రెడిట్ కార్డ్ లిమిట్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేస్తారు. తిరిగి చెల్లించిన తర్వాత మళ్లీ ఆ పరిమితిని అందుబాటులోకి తెస్తారు. రుణాల రీపేమెంట్ కాల వ్యవధి 6 నుంచి 60 నెలలుగా ఉంటుంది. వడ్డీ రేట్లు వినియోగదారుల క్రెడిట్ ప్రొఫైల్‌పై ఆధారపడి ఉంటాయి. కాకపోతే క్రెడిట్ కార్డులపై రుణాల జారీ వేగంగా ఉంటుంది. వీటి వడ్డీ రేట్లు పర్సనల్ లోన్స్ కంటే ఎక్కువ ఉండవని పైసాబజార్.కామ్ డైరెక్టర్ సాహిల్ అరోరా తెలిపారు. -
ఆన్ లైన్ కస్టమర్లకు ఫ్లిప్ కార్ట్ శుభవార్త
ఆన్ లైన్ లో ఎక్కువ మొత్తంలో వస్తువులు కొనడం మీకు అలవాటా? అయితే మీలాంటి వారికోసమే ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ ఓ శుభవార్త అందిస్తోంది. సమాన నెలసరి వాయిదా పద్ధతి(ఈఎంఐ)లో వస్తువులను కొనుగోలు చేసేవారికి అదనంగా చెల్లింపులు పడకుండా ఓ కొత్త ఆప్షన్ ను తీసుకొచ్చింది. "నో కాస్ట్ ఈఎంఐ' అనే పేరుతో ఫ్లిప్ కార్ట్ వినియోగదారులకు ఒక బంపర్ ఆఫర్ ప్రవేశపెట్టింది. భారీ కొనుగోళ్లు జరిపే వారికి ఆన్ లైన్ షాపింగ్ ను సులభతరం చేయడానికి ఈ ఆప్షన్ ను ప్రవేశపెట్టినట్టు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ కొత్త ఆప్షన్ ప్రకారం డౌన్ పేమెంట్, ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీరేట్లులాంటి చెల్లింపులు ఇక ముందు వుండవని ప్రకటించింది. జీరో ప్రాసెసింగ్ ఫీజు, జీరో డౌన్ పేమెంట్, కస్టమర్లకు జీరో ఇంటరెస్ట్ వంటివి 'నో కాస్ట్ ఈఎంఐ' కింద వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొంది. ఆన్ లైన్ షాపింగ్ ప్రియులకు ఇది శుభవార్త అనీ, వారికి షాపింగ్ ను సులభతరం చేయడంలో ఇదే తొలి అడుగు అని ఫ్లిప్ కార్ట్ డిజిటల్ అండ్ కస్టమర్ ఫైనాన్సియల్ సర్వీసుల అధినేత మయాంక్ జైన్ తెలిపారు. వినియోగదారులు కోరుకున్న ఉత్పత్తులను ఎలాంటి అవరోధాలు లేకుండా కొనుగోలు చేయడమే లక్ష్యంగా 'నో కాస్ట్ ఈఎంఏ' ఆప్షన్ ను ప్రవేశపెట్టినట్టు ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది.