భవిష్యత్తులో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం ఇండియాలో మళ్లీ కరోనా పెరగడమే. ఒకవేళ మరోసారి కరోనా విజృంభిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ లాక్‌డౌన్లు, కర్ఫ్యూలు, కంటైన్‌మెంట్ జోన్ల ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మహారాష్ట్రలో కొన్ని చోట్ల కంటైన్‌మెంట్ జోన్ల ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల స్టాక్ మార్కెట్లు పడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారు తమ షేర్లను అమ్మే అవకాశం ఉంటుంది. ఇలా వారి చేతిలో ఉన్న నగదును బంగారం మీద స్వల్ప కాలానికి పెట్టుబడి పెట్టె అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.
ఒకవేళ లాక్‌డౌన్ లేకపోతే రాబోయే కాలంలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరిగి ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో బంగారం ధరలు 3 రోజుల నుంచి స్థిరంగా ఉన్నాయి. నేడు నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.42,010 ఉంది. అలాగే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం(ప్యూర్ గోల్డ్) ధర ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,830గా ఉంది. విజయవాడలో కూడా ఇవే ధరలు ఉన్నాయి.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment