జనగామ: కరోనా మహమ్మారి సృష్టించిన విల యం స్వయంగా అనుభవించిన వారు ఎప్పటికీ మరచి పోలేరు. వందలాది మందిని పొట్టన పెట్టుకున్న కోవిడ్–19 వైరస్.. ఇంటి గడప దాటాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించేలా చేసింది. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం 2020 మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించగా.. మరుసటి రోజు 23వ తేదీ నుంచి కంటిన్యూ లాక్‌డౌన్ అమలు చేసింది. లాక్‌డౌన్ విధించి నేటి(గురువారం)కి మూడేళ్లు పూర్తవుతుంది. జిల్లాలో 4,47, 823 మంది జనాభా ఉంది. 2,48,795 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 15,022 మందికి పాజిటివ్ వచ్చింది. వీరిలో అధికార, అనధికారికంగా సుమారు 300 మందికి పైగా మృతి చెందారు. ఇప్పటి వరకు కరోనా నివారణ వ్యాక్సిన్ మొదటి డోస్ 4,68,283, రెండో డోస్ 4,78,817, బూస్టర్ డోస్ 2,48,826 మందికి ఇచ్చారు. మొదటి టీకా 2021 జనవరి 12వ తేదీన ఉద్యోగులకు వేశారు.
ప్రాణాలను పణంగా పెట్టి..
కరోనా లాక్‌డౌన్.. ఆ తర్వాత వైద్య, శానిటేషన్, పోలీసు, పత్రికా రంగం, రెవెన్యూ శాఖలు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు, పలు వర్గాల వారు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందించారు. కరోనా సమయంలో ఉపాధి కోల్పోయి, కుటుంబ పోషణ భారంగా మారిన పేదకుటుంబాలను ఆదుకునేందుకు అనేక మంది దాతలు ముందుకు వచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. పలు రాష్ట్రాల నుంచి కాలినడకన జిల్లా కేంద్రానికి వచ్చే వలస కార్మికులకు కడుపునిండా భోజనం అందించి చేతి ఖర్చుల కు సైతం డబ్బులు ఇచ్చారు. ఆయా శాఖల ఉద్యోగులకు కోవిడ్‌తో ప్రాణం మీదకు వచ్చినా.. సహచరులు మాత్రం మొక్కవోని ధైర్యంతో సేవలందించా రు. నాటి సంఘటనలు గుర్తుకు చేసుకుంటున్న వేళ.. మళ్లీ ఫ్లూ భయం వెంటాడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment