యూజర్లకు వాట్సాప్ గుడ్ న్యూస్. వాట్సాప్‌లో మనీ ట్రాన్స్ ఫర్ చేసిన యూజర్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం వాట్సాప్ ఓ ఫీచర్‌పై వర్క్ చేస్తుండగా.. ఆ ఫీచర్లు లీకయ్యాయి.
వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం.. ఇటీవల తెచ్చిన వాట్సాప్ పేమెంట్ ఆప్షన్‌ను యూజర్లు వినియోగించేలా వాట్సాప్ కొత్త అప్ డేట్‌లను అందుబాటులోకి తెస్తోంది. వాట్సాప్ త్రూ మనీ ట్రాన్స్‌ఫర్ చేసిన యూజర్లుకు క్యాష్ బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది.ఫోన్ పే, పేటీఎం తరహాలో యూపీఐ ద్వారా వాట్సాప్ నుంచి మనీ ట్రాన్స్‌ఫర్ చేసిన వినియోగదారులకు 'క్యాష్‌బ్యాక్' అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొని రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్ చేసే పనిలో వాట్సాప్ ప్రతినిధులు ఉండగా.. ఆ ఫీచర్లు లీక్ అయ్యాయి.
227 రకాల బ్యాంక్ అకౌంట్లకు..
వాట్సాప్ ఇటీవల వాట్సప్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) భాగస్వామయ్యంలో వాట్సాప్ పేమెంట్ ఆప్షన్‌ను ఇండియన్ యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఆ ఆప్షన్ ను వినియోగించి యూజర్లు వాట్సాప్ ద్వారా 227 రకాల బ్యాంకు అకౌంట్లకు మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చని వాట్సాప్‌పేమెంట్ డైరక్టర్ మనేష్ మహాత్మే వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment