Money Transfer Services
-
ఫీచర్లు లీక్, వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్!
యూజర్లకు వాట్సాప్ గుడ్ న్యూస్. వాట్సాప్‌లో మనీ ట్రాన్స్ ఫర్ చేసిన యూజర్లకు క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం వాట్సాప్ ఓ ఫీచర్‌పై వర్క్ చేస్తుండగా.. ఆ ఫీచర్లు లీకయ్యాయి. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం.. ఇటీవల తెచ్చిన వాట్సాప్ పేమెంట్ ఆప్షన్‌ను యూజర్లు వినియోగించేలా వాట్సాప్ కొత్త అప్ డేట్లను అందుబాటులోకి తెస్తోంది. వాట్సాప్ త్రూ మనీ ట్రాన్స్ఫర్ చేసిన యూజర్లుకు క్యాష్ బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది.ఫోన్ పే, పేటీఎం తరహాలో యూపీఐ ద్వారా వాట్సాప్ నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసిన వినియోగదారులకు 'క్యాష్‌బ్యాక్' అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొని రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్ చేసే పనిలో వాట్సాప్ ప్రతినిధులు ఉండగా.. ఆ ఫీచర్లు లీక్ అయ్యాయి. 227 రకాల బ్యాంక్ అకౌంట్లకు.. వాట్సాప్ ఇటీవల వాట్సప్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) భాగస్వామయ్యంలో వాట్సాప్ పేమెంట్ ఆప్షన్‌ను ఇండియన్ యూజర్ల కోసం అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఆ ఆప్షన్ ను వినియోగించి యూజర్లు వాట్సాప్ ద్వారా 227 రకాల బ్యాంకు అకౌంట్లకు మనీ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చని వాట్సాప్పేమెంట్ డైరక్టర్ మనేష్ మహాత్మే వెల్లడించారు. చదవండి: వాట్సాప్‌లో మనీ ట్రాన్స్ఫర్ ఇలా చేయండి.. -
అంతుచిక్కని విదేశీ కరెన్సీ అపహరణ
శ్రీకాకుళం, ఇచ్ఛాపురం: పట్టణంలోని దినవారి బజారు సమీపంలోని సాయి ట్రావెల్స్‌లో నిర్వహిస్తున్న వెస్టర్న్ యూనియన్ నగదు బదిలీ కేంద్రం వద్ద సోమవారం రూ.3 లక్షల విలువైన విదేశీ కరెన్సీ చోరీకి గురైంది. ఈ కేసు విషయమై సరైన ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటివరకు పోలీసులు చేసిన దర్యాప్తులో చోరీకి పాల్పడినవారు టర్కీ దేశానికి చెందిన ఇద్దరు యువకులుగా అనుమానిస్తున్నారు. నగదు బదిలీ కేంద్రంలో పనిచేస్తున్న నిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సత్యనారాయణ మంగళవారం కేసు నమోదు చేశారు. అనుమాతులలో ఒకరికి సంబంధించిన ఫొటోలను సీసీ కెమెరా ద్వారా సేకరించి దర్యాప్తు కొనసాగిస్తున్నామని సీఐ ఎం.వినోద్‌బాబు తెలిపారు. -
డిసెంబర్ నాటికి వాట్సాప్ పేమెంట్ సేవలు
న్యూఢిల్లీ: మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఈ ఏడాది ఆఖరు నాటికల్లా నగదు చెల్లింపుల సేవలను దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ గ్లోబల్ హెడ్ విల్ కాథ్‌కార్ట్ వెల్లడించారు. మెసేజ్ పంపినంత సులువుగా నగదు బదిలీ ప్రక్రియను సులభతరం చేయాలన్నది తమ లక్ష్యమని ఆయన వివరించారు. ‘యూపీఐ ప్రాతిపదికన భారతీయ బ్యాంకులతో కలిసి పేమెంట్స్ వ్యవస్థను రూపొందించాం. దీన్ని సరిగ్గా అమలు చేయగలిగితే భారత్‌లో మరింత మందిని ఆర్థిక సేవల పరిధిలోకి తేవొచ్చు. అలాగే డిజిటల్ ఎకానమీలోకి భాగంగా చేయొచ్చు. ఈ ఏడాది ఆఖర్లోగా పేమెంట్ సేవలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం‘ అని గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విల్ చెప్పారు. అయితే, దీనికి నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు వచ్చాయా లేదా అన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్బుక్లో భాగమైన వాట్సాప్..చెల్లింపుల సేవల విషయంలో పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే తదితర సంస్థలతో పోటీపడాల్సి ఉంటోంది. ప్రస్తుతం వాట్సాప్ ప్రయోగాత్మకంగా కొంత మంది యూజర్లకు మాత్రమే పేమెంట్ సేవలను ప్రయోగాత్మకంగా అందిస్తోంది. భారతీయ యూజర్ల చెల్లింపుల డేటాను భారత్‌లోనే భద్రపర్చాలన్న నిబంధనను పాటించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇటీవలే సంస్థ వెల్లడించింది. జూలైలో ట్రయల్ రన్ పూర్తవుతుందని, రిజర్వ్ బ్యాంక్ అనుమతులన్నీ వచ్చాకే పూర్తి స్థాయిలో సేవలను ప్రారంభిస్తామని ఈ ఏడాది మే లో సుప్రీం కోర్టుకు తెలియజేసింది. 2017 నాటి గణాంకాల ప్రకారం వాట్సాప్‌కు భారత్‌లో 20 కోట్ల మంది పైగా యూజర్లు ఉన్నారు. -
విదేశీ కరెన్సీ జిరాక్స్ నోట్లు ఇచ్చి.. భారీ మోసం!
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నవిపేట మండల కేంద్రంలో ఆదివారం సినీ ఫక్కీలో చోరీ జరిగింది. మండలంలోని మనీ ట్రాన్స్ఫర్ కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించి యూఏఈ కరెన్సీ అయిన దిర్హమ్ కరెన్సీ నోట్ల జిరాక్స్ పత్రాలు ఇచ్చి రూ.89వేల ఇండియన్ కరెన్సీతో ఉడాయించాడు. ఈ విషయాన్ని షాప్ యజమాని మొదట పసిగట్టలేదు. తీరా నకిలీ జిరాక్స్ కరెన్సీని గుర్తించి తాను మోసపోయిన విషయాన్ని గ్రహించాడు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. గతంలోనూ నిజామాబాద్, కామారెడ్డిలలో ఇటువంటి చోరీలు జరిగినట్లు సమాచారం ఉంది. -
నగదుతో పట్టుబడితే అంతే..
శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్): ఎన్నికల కోడ్ అమలు నేప«థ్యంలో వాహనాల తనిఖీలో పట్టుబడుతున్న నగదుకు లెక్క తేలేలా కనిపించడంలేదు. ఇప్పటి వరకు జిల్లాలో రూ.68 లక్షల నగదు పట్టుబడగా.. వీటికి సరైన ఆధారాలు లేకపోవడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఐటీశాఖకు అప్పగించారు. ఒక వ్యక్తి వద్ద రూ.2లక్షలకు పైగా నగదు దొరికితే వాటికి సంబంధించిన పక్కా ఆధారాలు చూపించాలి. కానీ గత కొన్ని రోజుల వ్యవ«ధిలో వాహనాల తనీఖీల్లో అధిక మొత్తంలో నగదు పట్టుబడింది. వ్యాపారం, వివిధద అవసరాల నిమిత్తం జనం ఎక్కువ మొత్తంలో నగదును తరలిస్తున్నారు. ఒక వేళ పట్టుబడితే వాటికి సంబంధించిన సరైన లెక్కలు చూపించలేకపోతున్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఈ నెల 7 నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. డిసెంబర్ 7న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో డబ్బు తరలింపుపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. రియల్ ఎస్టేట్ డబ్బులకు ఆధారాలు ఎలా? ఇప్పటి వరకు పట్టుబడిన నగదులో రెండు చోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపార లావాదేవీలకు సంబం«ధించిన డబ్బులుగా బాధితులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ వీటి తాలూకు ఆధారాలు ఐటీ శాఖకు చూపించడం కష్టమే. ఏదైనా స్థలం, భూములకు సంబంధించి ప్రభుత్వ విలువకు, బహిరంగ మార్కెట్ విలువకు చాలా వ్యత్యాసం ఉంటుంది. పట్టుబడిన నగదుకు సంబం«ధించి ఏదైనా కొనుగోలు, అమ్మకం దస్తావేజులు చూపించినా.. అందులో పేర్కొనే ఆస్తి విలువకు, బహిరంగ మార్కెట్లో ఆస్తి విలువ తేడా వస్తుంది. దీంతో ఇలాంటి లావాదేవీలకు సంబంధించిన నగదు పట్టుబడితే ఆధారాలు చూపించలేక ఇక ఆ డబ్బులను వదలిలేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వాహనాల తనిఖీల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు తగు జాగ్రతలు తీసుకుంటున్నారు. కొందరు వ్యాపారు ఎన్నికలు ముగిసే వరకు లావాదేవీలు వాయిదా వేసుకుంటున్నారు. అప్పుడే సర్దుకున్న అభ్యర్థులు..! ఇదిలా ఉంటే.. ఎన్నికల్లో పోటీకి దిగుతున్న రాజకీయ నాయకులు ఇప్పటికే నగదును సర్దుబాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నగదుతో పట్టుబడితే అసలుకే ఎసరు వచ్చే అవకాశాలుండడంతో చాలా జాగ్రత్తగా వ్యవహారాలు నడిపిస్తున్నట్లు వినికిడి. చాలా మంది అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చుల కోసం నగదును వారి అనుచరులు, నమ్మకస్తుల వద్ద దాచినట్లు సమాచారం. పాల్మాకుల వద్ద కారులో రూ.17,26,000 నగదు లభ్యం శంషాబాద్ రూరల్(రాజేంద్రనగర్): కారులో తరలిస్తున్న రూ.17,26,000 నగదును ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. శంషాబాద్ మండలంలోని పాల్మాకుల వద్ద బెంగళూరు జాతీయ రహదారి, పీ–వన్ రోడ్డులో శుక్రవారం రాత్రి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో మహేశ్వరం మండలంలోని డబిల్‌గూడ వాసి ఎ.యాదయ్య కారులో శంషాబాద్ వైపు నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో నగదు దొరికింది. ఓ స్థలం రిజిస్ట్రేషన్ కోసం తీసుకెళ్లిన డబ్బును తిరిగి తీసుకుని వెళ్తుండగా పట్టుబడ్డారు. స్వాధీనం చేసుకున్న డబ్బును ఇన్‌కంటాక్స్ అధికారులకు అప్పగించనున్నట్లు ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు శంకర్, సుజిత్‌రెడ్డి తెలిపారు. -
ఖాతాల్లోకే రైతుబంధు..
హన్మకొండ: యాసంగి పెట్టుబడి నేరుగా రైతు ఖాతాల్లో జమకానుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. రైతులపై పెట్టుబడి భారం పడకుండా ఉండేందుకు గత ఖరీఫ్ నుంచి ప్రభుత్వం రైతు బంధు పథకం కింద ఎకరాకు రూ.4 వేల చొప్పున అందిస్తోంది. ఖరీఫ్‌లో చెక్కులను పంపిణీ చేయగా.. ఈ యాసంగిలోనూ అదే తరహాలో ఇచ్చేందుకు సన్నద్ధమైంది. అయితే.. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ విధానానికి ఎన్నికల కమిషన్ అభ్యంతరాలు తెలిపింది. గతంలో ఇచ్చిన రైతులకు మాత్రమే యాసంగిలో రైతుబంధు పథకం అమలు చేయాలని, కొత్త వారిని మినహాయించాలని ఈసీ సూచించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ క్రమంలో గత ఖరీఫ్‌లో చెక్కులు పొందిన రైతులకు యాసంగికి గాను నేరుగా వారి ఖాతాల్లో సొమ్ము జమచేయనున్నారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి 25వ తేదీ వరకు వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల ఇంటికి వెళ్లి బ్యాంకు ఖాతా నంబర్లు, ఇతర వివరాలు సేకరించనున్నారు. దీని కోసం నిర్ధిష్టమైన ప్రొఫార్మాను సిద్ధం చేశారు. రైతుల నుంచి సేకరించిన వివరాలు ఇందులో పొందుపరచనున్నారు. 74,664 మంది రైతులకు.. యాసంగికి సంబంధించి అర్బన్ జిల్లాలో 74,664 మంది రైతులకు 75,825 చెక్కుల రూపంలో రూ.69,12,56,170 ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మొత్తాన్ని నేరుగా రైతు ఖాతాల్లో వేయనున్నారు. గత ఖరీఫ్‌లో జిల్లాలో 75,085 మంది రైతులకు 75,540 చెక్కుల రూపంలో రూ.67,63,09,650 పంపిణీ చేయాల్సి ఉండగా.. ఇందులో వివిధ కారణాలతో 6,756 మంది రైతులకు 6,817 చెక్కులు పంపిణీ కాలేదు. ఎన్నారైలు, చనిపోయిన రైతులు, డబుల్ జారీ అయిన వారు, వివాదాల్లో ఉన్న వారు మిగిలిపోయారు. అడ్డంకులు తొలగిపోయినా దూరమే.. గతంలో అన్ని సక్రమంగా ఉన్న ‘ఏ’ గ్రూపు రైతులకు మాత్రమే రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందించారు. సమస్యలుండి పాస్ బుక్కులు అందుకోని రైతులను బీ గ్రూపులో చేర్చి వారికి చెక్కులు అందించలేదు. ప్రస్తుతం అన్ని అడ్డంకులు తొలగిపోయి కొత్తగా పాస్ బుక్కులు అందుకున్న రైతులు ఉన్నారు. అయితే ఈ యాసంగిలో కొత్త వారికి రైతుబంధు పథకం అమలు చేయొద్దని ఎన్నికల కమిషన్ నిబంధనలు విధించింది. దీంతో కొత్త రైతులు యాసంగి పెట్టుబడికి దూరం కానున్నారు. వివరాలు అందజేయాలి.. ఇంటికి వచ్చే వ్యవసాయ విస్తరాణాధికారులకు రైతులు పూర్తిస్థాయిలో వివరాలు అందజేయాల్సి ఉంటుంది. నిర్ణీత ప్రొఫార్మాలో ఉన్న అంశాల మేరకు వివరాలు అందించాలి. బ్యాంకు ఖాతా వివరాలు, కొత్తగా జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ ప్రతి, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతి, రైతు ఫోన్ నంబర్‌ను అధికారులకు ఇవ్వాలి. పెట్టుబడి సొమ్ము రైతుల ఖాతాల్లోకి వెళ్లగానే ఫోన్ నంబర్‌కు సమాచారం వస్తుందని వ్యవసాయ అధికారులు చెప్పారు. -
త్వరలోనే వాలెట్ల మధ్య నగదు బదిలీ!
న్యూఢిల్లీ : పేటీఎం, మొబిక్విక్, పోన్‌పే వంటి డిజిటల్ వాలెట్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత నగదుపై ఆధారపడటం చాలా వరకు తగ్గిపోయింది. మనీ ట్రాన్స్ఫర్స్ నుంచి మొబైల్ రీఛార్జుల వరకు అన్ని రకాల చెల్లింపులు డిజిటల్ వాలెట్స్ ద్వారా చకచకా జరిగిపోతున్నాయి. అయితే ఇన్ని రకాల ప్రయోజనాలను అందిస్తున్న డిజిటల్ వాలెట్లు, తమ తమ వాలెట్ల మధ్య నగదు బదిలీ చేసుకునేందుకు మాత్రం అవకాశం కల్పించలేదు. ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులను మరింతగా ప్రోత్సహించే క్రమంలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలోనే మొబైల్ వాలెట్ ఇంటెరోపెరాబిలిటీకి అనుమతి ఇస్తోంది. దీని ద్వారా వాలెట్ల మధ్య కూడా నగదు బదిలీ చేసుకోవచ్చు. అయితే దీనికోసం ఆర్బీఐ ఓ షరతు పెడుతోందని తెలుస్తోంది. ఈ సర్వీసులను అందజేయడానికి లైసెన్స్ హోల్డర్స్‌కు మూలధనం రూ.25 కోట్లు ఉండాలని షరతు విధిస్తుందని పేమెంట్ ఇండస్ట్రీకి చెందిన ఎగ్జిక్యూటివ్‌లు చెప్పారు. ఎవరికైతే నికర సంపద రూ.25 కోట్లు ఉంటుందో, ఆ ప్లేయర్లకు ఇంటెరోపెరాబిలిటీని అనుమతించనుందని, కేవలం దిగ్గజ వాలెట్ కంపెనీలు మాత్రమే ఈ అవకాశం పొందేలా ఆర్బీఐ మార్గదర్శకాలు ఉండబోతున్నాయని ఢిల్లీకి చెందిన ఓ పేమెంట్స్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. చాలా కంపెనీలు రూ.25 కోట్ల మూలధనాన్ని కలిగి లేవని చెప్పారు. అత్యధిక మొత్తంలో నికర సంపద ఉన్న కంపెనీలకు, కొత్తగా ఇంటర్-వాలెట్ పేమెంట్ సర్వీసులను తమ కస్టమర్లకు ఆఫర్ చేసేందుకు మార్గం సుగుమం అవుతుందని తెలిపారు. అయితే ఈ విషయంపై ఆర్బీఐ మాత్రం స్పందించడం లేదు. మొబైల్ వాలెట్ జారీదారికి ఉండాల్సిన కనీస సంపదను రూ.5 కోట్ల నుంచి రూ.15 కోట్లకు పెంచింది ఆర్బీఐ. ఒకవేళ మొబైల్ వాలెట్లు ఇంటెరోపెరాబిలిటీ సర్వీసులను ఆఫర్ చేస్తే, పేమెంట్ బ్యాంక్‌లకు ఇది మేజర్ సవాల్‌గా నిలువనుంది. యూపీఏ ప్లాట్‌ఫామ్ ద్వారా బ్యాంక్ అకౌంట్లకు, వాలెట్లకు మధ్య ఫండ్ ట్రాన్స్ఫర్స్ చేసేందుకు దశల వారీగా అనుమతి ఇవ్వనున్నట్టు ఆర్బీఐ తన మార్గదర్శకాల్లో చెప్పింది. ఇంటెరోపెరాబిలిటీని ఆఫర్ చేసే వాలెట్లు, తప్పనిసరిగా కేవైసీ నిబంధనలను పాటించాల్సి ఉంది. మూలధన నిబంధనపై ఆర్బీఐ తన తుది గైడ్‌లైన్స్‌లో వెల్లడించనుంది. -
ఏటా రూ.2.30 లక్షలు పంపుతున్నారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు ప్రతీ ఏటా ఇంటికి సగటున రూ. 2.30 లక్షలు పంపుతున్నారట.అంతేకాదు ఇలా విదేశాలకు వెళ్ళడం ద్వారా కుటుంబ ఆర్థిక సమస్యలు తీరడమే కాకుండా, జీవన ప్రమాణాలు కూడా పెరిగినట్లు మనీ ట్రాన్సఫర్ సేవలు అందించే వెస్ట్రన్ యూనియన్ సర్వే పేర్కొంది. ప్రపంచబ్యాంకు లెక్కల ప్రకారం రెమిటెన్స్‌ల్లో (స్వదేశానికి నగదు పంపడం) ఇండియానే మొదటి స్థానంలో నిలిచింది. 2013లో ఎన్నారైలు ఇండియాకి పంపిన మొత్తం రూ. 4.24 లక్షల కోట్లు కాగా, 2014లో రూ.4.36 లక్షల కోట్లు పంపినట్లు వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది. గత ఇరవైఏళ్లుగా ఇండియాలో మనీ ట్రాన్సఫర్ సేవలను అందిస్తున్న వెస్ట్రన్ యూనియన్ ఏటా నగదు పంపుతున్న సుమారు 3,000 మందిపై సర్వే నిర్వహించింది. గతేడాది కనీసం రూ. 50,000 తక్కువ కాకుండా పంపిన వారు, అలాగే ఏడాదిలో కనీసం మూడు సార్లు పంపిన వారిని ఈ సర్వేకి కోసం ఎంపిక చేసినట్లు వెస్ట్రన్ యూనియన్ తెలిపింది. దేశంలోని ఏడు ప్రధాన పట్టణాల్లో ముఖాముఖిన జరిపిన ఈ సర్వేలో పలు ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. ఆ వివరాలు... ఏటా ఇండియాకి పంపుతున్న సగటు నగదు విలువ రూ. 2.30 లక్షలు. ఈ నగదును కుటుంబ సభ్యులు రోజువారి అవసరాలు, వైద్య ఖర్చులు, పిల్లల చదువులు వంటి 3 ప్రధాన అవసరాల కోసం వినియోగిస్తున్నారు. విదేశాలకు వలస వెళ్లిన వారిలో 56% మంది ఉన్నత అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లగా, 40 శాతం మంది ఆర్థిక ఇబ్బందుల వల్ల వెళ్లారట. వీరిలో 87% మందికి శాశ్వత ఉద్యోగం లభించింది. ఇందులో 47% మంది వైట్ కాలర్ జాబ్స్.. 40% బ్లూకాలర్ జాబ్స్ చేస్తున్నారు. విదేశాలకు వెళ్లిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు తగ్గాయని 77 శాతం మంది పేర్కొన్నారు. 63% మంది జీవన ప్రమాణాలు మెరుగైనట్లు తెలిపారు. వచ్చిన డబ్బును 80% మంది బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తుండగా, 50% మంది బీమా పథకాలను కొనుగోలు చేస్తున్నారు.