
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నవిపేట మండల కేంద్రంలో ఆదివారం సినీ ఫక్కీలో చోరీ జరిగింది. మండలంలోని మనీ ట్రాన్స్‌ఫర్ కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించి యూఏఈ కరెన్సీ అయిన దిర్హమ్ కరెన్సీ నోట్ల జిరాక్స్ పత్రాలు ఇచ్చి రూ.89వేల ఇండియన్ కరెన్సీతో ఉడాయించాడు. ఈ విషయాన్ని షాప్ యజమాని మొదట పసిగట్టలేదు. తీరా నకిలీ జిరాక్స్ కరెన్సీని గుర్తించి తాను మోసపోయిన విషయాన్ని గ్రహించాడు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. గతంలోనూ నిజామాబాద్, కామారెడ్డిలలో ఇటువంటి చోరీలు జరిగినట్లు సమాచారం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment