
సాక్షి, కామారెడ్డి : ట్రాక్టర్ దొంగతనానికి యత్నించినట్లుగా భావించి గ్రామస్తులు ఒకరిని చితక బాదగా అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తెల్లవారుజాము ప్రాంతంలో గ్రామంలోని ఓ ఇంటిముందు ఉంచిన ట్రాక్టర్ పైకి ఓ వ్యక్తి ఎక్కి కూర్చున్నాడు.
ఎవరు లేకపోవడంతో ట్రాక్టర్‌ను స్టార్ట్ చేయబోయాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని పట్టుకుని చితకబాదారు చేశారు. అపస్మారకస్థితికి చేరుకోవడంతో 108లో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లేసరికి అతడు మృతి చెందాడు. మృతుడు రాజంపేట మండలం సోమారం గ్రామానికి చెందిన రాకేష్ (20) గా గుర్తించారు. దేవునిపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. కేసు దర్యాప్తులో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment