కరోనా మహమ్మారి తర్వాత తిరిగి వేగంగా పుంజుకుంది ఏదైనా ఉంది అంటే? అది స్టాక్ మార్కెట్ అని చెప్పుకోవాలి. రోజు రోజుకి రాకెట్ వేగంతో షేర్ మార్కెట్ వేగంతో దూసుకెళ్తుంది. ఈ మధ్య యువత మార్కెట్ మీద ఆసక్తి కనబరచడం, కొత్త పెట్టుబడిదారులు ప్రవేశించడంతో మార్కెట్ జీవనకాల గరిష్టాలకు చేరుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే స్టాక్ మార్కెట్ ఒక గనిలో మారింది. దీనిలో పెట్టుబడి పెట్టిన వారి జాతకాలు ఏడాదిలో మారిపోతున్నాయి. వారి బందువులు గుర్తించలేని స్థితిలో సంపాదిస్తున్నారు. మరికొందరికీ మార్కెట్ పై ఎటువంటి జ్ఞానం లేకపోవడంతో చేతులు కాల్చుకుంటున్నారు.
అయితే, ఇటీవల ఒక కంపెనీ షేర్ ధర బీభత్సంగా పెరిగింది. ఎంతలా అంటే ఏడాదిలో 30 రేట్లు పెరిగింది. ఆ కంపెనీ పేరు ఎక్స్ ప్రో ఇండియా. ఈ ఎక్స్ ప్రో ఇండియా కంపెనీ స్టాక్ ధర గత ఏడాది అక్టోబర్ 19న రూ.21.90 నుంచి నేడు రూ.699.45కు పెరిగింది. గత 12 నెలల్లో 2,933.41 శాతం పెరిగింది. ఇదే కాలంలో సెన్సెక్స్ 53.73 శాతం పెరిగింది. గత ఏడాది అక్టోబర్ 19న ఎక్స్ ప్రో ఇండియా స్టాక్ లో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఈ రోజు రూ.30 లక్షలు లాభం వచ్చేది. అయితే మీరు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ లలో పెట్టుబడి పెట్టడం తప్పు కాదు. కానీ, దానిపై ఎటువంటి విషయ పరిజ్ఞానం లేకుండా పెట్టుబడి పెట్టడం ముమ్మాటికి మన తప్పే. అలాంటి వారు మాత్రమే ఎక్కువ సంఖ్యలో నష్ట పోతున్నారు.(చదవండి: మార్నింగ్ వాక్‌కి వెళ్లింది... కోటీశ్వరరాలైంది!!)
Comments
Please login to add a commentAdd a comment