Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

Bangladesh Air Force jet incident in Dhaka1
Bangladesh: స్కూల్‌ భవనంపై కూలిన విమానం

ఢాకా: బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో విమానం ప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన F-7 BGI ట్రైనింగ్‌ విమానం సోమవారం మధ్యాహ్నం ఢాకా నగరంలోని మైల్స్‌స్టోన్‌ స్కూల్‌ అండ్‌ కాలేజ్‌ ప్రాంగణంలో కూలిపోయింది. మధ్యాహ్నం 1:06 గంటల సమయంలో విమానం టేకాఫ్‌ తర్వాత దియాబారి అనే ప్రాంతంలో కూలింది. ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్‌లో విద్యార్థులు ఉన్నారు. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారని అగ్నిప్రమాద శాఖ అధికారులు తెలిపారు.విమానం కూలడంతో ఘటనా స్థలంలో పొగలు ఎగసిపడుతున్నాయి. రెస్క్యూ టీములు సహాయక చర్యలు చేపట్టాయి. విమానం బంగ్లాదేశ్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందినదిగా ఆర్మీ అధికారికంగా ధృవీకరించింది. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. Bangladesh Air Force China Made FT-7BGI (training) aircraft, tail no. 701, crashes in Uttara near Milestone College. 1:06pm and crashed into the college campus soon after.Casualties : at least 6-7 min. pic.twitter.com/0vg4bvjD86— (((Bharat)))🚨™️🕉🚩🔱 🇮🇳 🇮🇱🇷🇺🇺🇸🎗 (@Topi1465795) July 21, 2025

Ambati Rambabu Vidadala Rajini on Kutami Govt Cases2
దేనికైనా రెడీ.. ఎన్ని కేసులైనా పెట్టుకోండి: అంబటి, రజిని

సాక్షి, పల్నాడు: ఏపీలో చంద్రబాబు దుష్టపాలన అంతానికి అంతా కలిసి కట్టుగా పని చేస్తామని, ఈ క్రమంలో ఎన్ని కేసులు పెట్టిన భయపడబోమని వైఎస్సార్‌సీపీ నేతలు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని అన్నారు. సోమవారం స‌త్తెన‌ప‌ల్లి గ్రామీణ‌ పీఎస్‌లో విచార‌ణ‌కు హాజరైన అనంతరం వాళ్లు మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ గత నెల 18న రెంటపాళ్లలో పర్యటించారు. ఆ టైంలో జనసమీకరణ చేపట్టారంటూ పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులిచ్చారు. ఈ కేసులో విచారణ నిమిత్తం అంబటి, రజిని ఇవాళ పీఎస్‌కు వచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ని కష్టాలు ఎదురైనా జగన్‌ వెంటే నడుస్తామని, చంద్రబాబు ప్రభుత్వంపై పోరాటం కొనసాగుతుందని ఉద్ఘాటించారు. జగన్ పార్టీ పెట్టిన దగ్గర నుండి అయన వెంటే నడుస్తున్నాం. గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో ఎన్నో మీటింగ్‌లు పెట్టారు.. ర్యాలీలు నిర్వహించారు. కానీ మేము ఇలాంటి కేసులు పెట్టలేదు. ఇప్పుడు మాపై కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలందరినీ జైలుకు పంపాలన్నది కూటమి ధ్యేయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే అక్రమ కేసులో మిథున్ రెడ్డిని అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించారు.సత్తెనపల్లి శాసన సభ్యులుగా గెలిచింది. ఒకరు పెత్తనం చేస్తుంది మరొకరు. డీఎన్‌ఆర్‌ అనే వ్యక్తి సత్తెనపల్లిలో పెత్తనం చాలా ఇస్తూ రాజ్యాంగీతర శక్తిగా వ్యవహరిస్తున్నాడు. ఏపీలో కొనసాగుతోంది మిలిటరీ పాలన. చంద్రబాబు, లోకేష్‌లకు బుద్ది చెప్పి తీరుతాం. దుష్ట పాలన అంతానికి అందరం కలిసి పని చేస్తాం అని అన్నారు. మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ.. ‘‘రెంటపాళల్లో పోలీసులు, కూటమి నాయకుల వేధింపులు తట్టుకోలేక వైయస్సార్‌సీపీ నేత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చారు. మేము జనాన్ని సమీకరించామని మాపైన కేసులు పెట్టారు. మా వాళ్లను పరామర్శించడానికి వెళ్తే.. మా మీదే కేసులు పెడుతున్నారు. జగన్ అంటేనే జనం. అలాంటి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు జనాన్ని ఎవరు తరలించాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా భరించడానికి సిద్ధంగా ఉన్నాం. కూటమి పెద్దలు ఒక కట్టు కథ అల్లడం.. దానికి స్కామ్ అని పేరు పెట్టి వైఎస్సార్‌సీపీ నేతల్ని జైలుకు పంపడం సాధారణంగా మారిపోయింది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ దారుణం. అక్రమ కేసు పెట్టి ఆయన్ని జైలుకు పంపారు. జగన్‌ మళ్లీ సీఎం అయ్యే దాకా.. ఈ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అని అన్నారామె.

Parliament monsoon session live updates3
Parliament Live Updates: సాయంత్రం 4 గంటల వరకు లోక్‌సభ వాయిదా

న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాలు సాయంత్రం నాలుగు గంటల వరకు వాయిదా పడ్డాయి. ఉభయ సభల ప్రారంభం నుంచి పహల్గాం, ఆపరేషన్‌ సింధూర్‌పై చర్చించాలని ఉభయ సభల్లో విపక్షాలు పట్టుబడ్డాయి. దీంతో లోక్‌సభ స్పీకర్‌ సభను మరోసారి వాయిదా వేశారు ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌ -పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించినట్లు ట్రంప్ చేసిన వాదనలపై కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే- బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మధ్య రాజ్యసభలో వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం ఆపరేషన్‌ సింధూర్‌పై చర్చను తప్పించుకుంటోందని ఖర్గే ఆరోపించారు. దీనికి స్పందించిన నడ్డా ఆపరేషన్ సిందూర్‌పై పూర్తి చర్చకు ప్రభుత్వం అనుమతిస్తుందన్నారు. ఈరోజు (సోమవారం) ప్రధాని మోదీ ప్రసంగంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం కాగానే ఇటు లోక్‌సభ, అటు రాజ్యసభలో గందరగోళం నెలకొంది. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ అంశంపై ప్రతిపక్షం చర్చకు పట్టుపట్టింది. ఉదయం 11 గంటలకు ఉభయసభలు సమావేశమయ్యాయి. లోక్‌సభలో విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌, బీహార్‌ ఓటర్‌ జాబితాలపై తీర్మానాలు ఇచ్చారు. ఇంటెలిజెన్స్‌ వైఫల్యాలు, టెర్రరిస్ట్‌లను ఇంత వరకూ అరెస్ట్‌ చేయకపోవడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ గందరగోళం మధ్య లోక్‌సభ స్పీకర్‌ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.లోక్‌సభ, రాజ్యసభ ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశమయ్యాయి. పహల్గామ్ ఉగ్ర దాడి, ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించిన వారికి నివాళులు అర్పించడంతో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అనంతరం స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు అనుమతించారు. అయితే, ప్రతిపక్ష సభ్యులు ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు డిమాండ్ చేస్తూ, నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరుగుతుందని ఓం బిర్లా తెలిపినా, ఎంపీలు తమ నిరసనలు కొనసాగించారు.VIDEO | Monsoon Session 2025: Speaking in Rajya Sabha, BJP Leader and Union Minister JP Nadda (@JPNadda ) said, “ We will and we want to talk about Operation Sindoor. We will share all the details on this, there should be no message conveying that we don't want to talk about the… pic.twitter.com/SeexH17ncD— Press Trust of India (@PTI_News) July 21, 2025ఆపరేషన్ సిందూర్ పై ఎంపీల గందరగోళం మధ్య రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్‌ సభను వాయిదా వేశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో పహల్గామ్ ఉగ్రవాద దాడి అంశాన్ని లేవనెత్తారు. కాల్పుల విరమణలో జోక్యంపై డొనాల్డ్ ట్రంప్ 24 సార్లు తన వాదన వినిపించారన్నారు. ప్రభుత్వం పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణకు సంబంధించిన వివరాలను అందించాలని పట్టుబట్టారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం, ఆ విమాన భద్రతపై రాజ్యసభలో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు సమాధానం ఇవ్వనున్నారు. #MonssonSession2025लोकसभा में ‘प्रश्नकाल चल रहा है | #LOkSabha takes up Question Hour#LokSabha @ombirlakota @LokSabhaSecttWatch Live :https://t.co/DyufCPmsYn pic.twitter.com/dPyCF9X3ox— SansadTV (@sansad_tv) July 21, 2025

Air India flight from Kochi skids off runway at Mumbai Airport Details4
రన్‌వేపై జారిన ఎయిరిండియా విమానం.. అంతా సేఫ్‌

కొచ్చి-ముంబై ఎయిరిండియా విమానానికి సోమవారం పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపై ల్యాండ్‌ అవుతున్న క్రమంలో విమానం అదుపు తప్పి జారిపోయింది. అయితే ఈ ఘటనలో ప్ర​యాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. భారీ వర్షం కారణంగా ఈ ఘటన జరిగిందని అధికారులు ప్రకటించారు. కొచ్చి(కేరళ) నుంచి వచ్చిన విమానం భారీ వర్షంలో విమానం ల్యాండ్‌ అయ్యింది. అయితే ఆ సమయంలో టైర్లు పేలిపోవడం వల్లే విమానం పక్కకు ఒరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో భయాందోళనకు గురైన ప్రయాణికులు హుటాహుటిన ఫ్లైట్‌ నుంచి దిగేశారు. ఈ ఘటనతో ఇంజిన్‌ కూడా డ్యామేజ్‌ అయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది.Runway scare: #Kochi-bound #AirIndia flight veers off course during landing at #Mumbai airport; passengers safeMore details🔗https://t.co/nhauXEYCrs pic.twitter.com/NewRgbZFyD— The Times Of India (@timesofindia) July 21, 2025

Pawan Kalyan Latest Speech Harihara Veeramallu Press Meet5
కొందరు హీరోల కంటే నేను చాలా తక్కువ: పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ ఎట్టకేలకు నిజాలు ఒప్పుకొన్నారు. టాలీవుడ్‌లో చాలామంది హీరోల్లో తను ఒకడినే తప్ప పెద్ద గొప్పేం కాదని చెప్పారు. ఇంకా చెప్పాలంటే కొందరు హీరోలతో పోలిస్తే తాను చాలా తక్కువని కూడా అన్నారు. ఈయన నటించిన 'హరిహర వీరమల్లు'.. దాదాపు ఐదేళ్ల పాటు షూటింగ్ జరుపుకొంది. ఫైనల్‌గా జూలై 24న అంటే ఈ వీకెండ్ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా పవన్ మీడియా ముందుకొచ్చారు. హైదరాబాద్‌లో ఈ రోజు ఉదయం ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు.(ఇదీ చదవండి: 'వీరమల్లు' నిర్మాతకు కీలక పదవి.. పవన్‌ కల్యాణ్‌ ప్రకటన)ఇందులోనే మాట్లాడిన పవన్.. 'రాజకీయంగా నాకు పేరుండొచ్చు. దేశవ్యాప్తంగా నేను తెలుసుండొచ్చు కానీ సినిమాల పరంగా చూస్తే కొందరు హీరోల కంటే నేను చాలా తక్కువనే. దానికుండే ఇబ్బందులు దానికి ఉంటాయి. మిగతా వాళ్లకు బిజినెస్ అయినంతగా నాకు బిజినెస్ అవ్వదు. వాళ్లకు వచ్చినంతగా నాకు కలెక్షన్స్ రాకపోవచ్చు. ఎందుకంటే నా దృష్టి ఎప్పుడూ నేను సినిమాలపై పెట్టలేదు' అని చెప్పుకొచ్చారు.మరో సందర్భంలో మాట్లాడుతూ.. 'నువ్వు చిరంజీవి తమ్ముడైనా, కొడుకైనా.. చివరికి నా కొడుకైనా టాలెంట్ లేకపోతే ఇక్కడ నిలబడలేం' అని ప్రస్తుతం ఇండస్ట్రీలో పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు. పవన్ చెప్పడం వరకు బాగానే ఉంది కానీ ఆయన అభిమానులకు ఇది చెవికెక్కుతుందా అనేది చూడాలి. ఎందుకంటే మా హీరో స్టార్, సూపర్‌స్టార్ అని ఇతర హీరోల అభిమానులతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు. ఇప్పటికైనా వాళ్లు అర్థం చేసుకుని మారతారా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: 'ఫిష్‌ వెంకట్‌'కు ఎందుకు సాయం చేయాలి: నట్టి కుమార్‌)

Arshdeep Ruled Out of 4th Test Nitish Reddy Out Of Series Anshul In: BCCI6
BCCI: నితీశ్‌ రెడ్డితో పాటు అతడూ అవుట్‌.. జట్టులోకి కొత్త ప్లేయర్‌

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు (IND vs ENG)కు ముందు టీమిండియాకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే రిషభ్‌ పంత్‌ (Rishbah Pant) వేలి గాయంతో కేవలం బ్యాటర్‌గా బరిలోకి దిగుతాడని తెలుస్తుండగా.. యువ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.ఎడమ మెకాలికి గాయమైన కారణంగా ఈ ఆంధ్రా కుర్రాడు.. ఇంగ్లండ్‌ నుంచి తిరిగి స్వదేశానికి రానున్నాడు. మరోవైపు.. యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ కూడా మాంచెస్టర్‌ టెస్టుకు దూరమయ్యాడు. బెకెన్‌హామ్‌లో నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తున్న సందర్భంగా అతడి ఎడమ చేతి వేలికి గాయమైంది.నాలుగో టెస్టుకు దూరంఈ క్రమంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) వైద్య బృందం పర్యవేక్షణలో అర్ష్‌దీప్‌ చికిత్స తీసుకుంటున్నాడు. అయితే, ఈ పంజాబీ బౌలర్‌ ఇప్పట్లో కోలుకునేలా లేడు. అందుకే నాలుగో టెస్టుకు అతడు దూరమయ్యాడు.ఈ నేపథ్యంలో మెన్స్‌ సెలక్షన్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అన్షుల్‌ కంబోజ్‌ను జట్టుకు ఎంపిక చేసింది. మాంచెస్టర్‌ టెస్టు సందర్భంగా అతడు జట్టుతో చేరనున్నాడు. ఇందుకు సంబంధించి బీసీసీఐ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.గాయాల బెడదకాగా శుబ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లింది. టెండుల్కర్‌- ఆండర్సన్‌ ట్రోఫీలో భాగంగా ఇప్పటికే మూడు పూర్తికాగా ఆతిథ్య ఇంగ్లండ్‌ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఎడ్జ్‌బాస్టన్‌లో చారిత్రాత్మ​ విజయం సాధించిన టీమిండియా.. మాంచెస్టర్‌లో జరిగే నాలుగో టెస్టు (జూలై 23- 27)నూ గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తోంది. అయితే, ఈ వేదికపై ఇంత వరకు ఒక్కసారి కూడా టీమిండియా టెస్టు గెలవకపోవడం.. పైగా ఇలా గాయాల బెడద వేధిస్తుండటం ఆందోళనకరంగా మారింది.ఇదిలా ఉంటే.. లీడ్స్‌లో ఆడిన పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌కు బదులు.. నితీశ్‌ కుమార్‌ రెడ్డి రెండో టెస్టు నుంచి జట్టులోకి వచ్చాడు. అయితే, అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. చివరగా లార్డ్స్‌లో మూడు వికెట్లు తీయడంతో పాటు మొత్తంగా కేవలం 43 పరుగులే చేశాడు.మరోవైపు.. టీమిండియా తరఫున టీ20, వన్డేలలో అదరగొడుతున్న అర్ష్‌దీప్‌ ఇంత వరకు టెస్టుల్లో అరంగేట్రం చేయలేదు. ఇక హర్యానాకు చెందిన అన్షుల్‌ కాంబోజ్‌ ఇటీవల ఇంగ్లండ్‌తో భారత్‌-‘ఎ’ జట్టు తరఫున అనధికారిక సిరీస్‌ ఆడాడు. నార్తాంప్టన్‌లో జరిగిన రెండో టెస్టులో నాలుగు వికెట్లు తీసిన అన్షుల్‌ రెండో ఇన్నింగ్స్‌లో తొమ్మిదో స్థానంలో వచ్చి అజేయ అర్ధ శతకం (51) సాధించాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 24 మ్యాచ్‌లు ఆడి 79 వికెట్లు తీయడంతో ఆపటు 486 పరుగులు చేశాడు.ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు భారత జట్టు (అప్‌డేటెడ్‌ ):శుబ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌ & వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ (వికెట్‌ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్‌ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్.చదవండి: BAN vs PAK: పాకిస్తాన్‌ను చిత్తు చేసిన బంగ్లాదేశ్‌

Muda Case: Supreme Court Heavily Slam Enforcement Directorate 7
రాజకీయ పోరాటాలతో మీకేం పని?.. ఈడీపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం

జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌పై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పోరాటం ఈడీ పని కాదని.. అది ముమ్మాటికీ అధికార దుర్వినియోగం కిందికి వస్తుందంటూ పేర్కొంది. కర్ణాటక ‘మూడా స్కాం’ కేసుతో పాటు.. లాయర్లకు ఈడీ సమన్లు జారీ చేసిన వ్యవహారాలను విచారించే క్రమంలో సుప్రీం కోర్టు ఈడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీ: మూడా స్కాం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్య బీఎం పార్వతికి కర్ణాటక హైకోర్టు కల్పించిన ఉపశమనాన్ని ఈడీ సుప్రీం కోర్టులో సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయ్‌ ఈడీపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ట్రయల్‌ కోర్టు తీర్పును హైకోర్టు సింగిల్‌ జడ్జి సమర్థించారని మీకు బాగా తెలుసు. అంటే ఈ కేసులో ఇప్పటికే రెండు స్థాయిల్లో న్యాయ నిర్ణయాలు వచ్చాయి. వాటిని తిరగరాయడానికి ఈడీ ప్రయత్నించడం అనవసరం. ఇది రాజకీయ ప్రమేయంలా అనిపిస్తోంది. రాజకీయాలు పోరాటాలు అనేది ప్రజల మధ్య జరగాలి. మీరు(ఈడీ) దానిని ఎందుకు ఉ‍పయోగిస్తున్నారు? ప్రశ్నించారు. EDను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదు.. అది ప్రజాస్వామ్యానికి హానికరం. ఈ వైరస్‌ను దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందనివ్వకండి అని సీజేఐ వ్యాఖ్యానించారు.Let political battles be fought among the electorate.. రాజకీయ పోరాటాలు ప్రజల మధ్య జరగాలి. రాజకీయ పార్టీల మధ్య ఉన్న విభేదాలు, ఆరోపణలు, విమర్శలు కోర్టుల ద్వారా కాదు, ఓటర్ల తీర్పు ద్వారా పరిష్కరించాలి. అలాంటిది ED (Enforcement Directorate) వంటి సంస్థలు రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతున్నాయా?. కోర్టులను రాజకీయ వేదికలుగా ఉపయోగించకండి. ప్రజాస్వామ్యంలో ఓటర్లు మాత్రమే రాజకీయ నాయకుల భవితవ్యాన్ని నిర్ణయించాలి, న్యాయవ్యవస్థ కాదు.దురదృష్టవశాత్తూ.. మహారాష్ట్రలో ఈడీతో నాకు అనుభవం ఉంది. మాతో మీ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసేలా చేసుకోకండి అని చీఫ్‌ జస్టిస్‌ గవాయ్‌ హెచ్చరించారు. ఈ క్రమంలో అదనపు సోలిసిటర​ జనరల్‌ ఎస్వీ రాజు తమ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని ధర్మాసనానికి తెలిపారు. అదే సమయంలో.. భవిష్యత్తులో ఈ పిటిషన్‌ను ఇతర కేసుల్లో ఉదాహరించవద్దంటూ విజ్ఞప్తి చేశారాయన. దీంతో పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు సీజేఐ ప్రకటించారు. మరో కేసులో.. క్లయింట్‌లకు సలహాలు ఇస్తున్నారనే అభియోగాల కింద.. ఈడీ సీనియర్‌ అడ్వొకేట్లకు కొందరు సమన్లు జారీ చేసింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు .. ఇవాళ విచారణ చేపట్టింది. సుప్రీం కోర్టు బార్‌ అసోషియేషన్‌ తోపాటు మరికొన్ని లీగల్‌ బాడీస్‌ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో.. చైనా, టర్కీలలో బార్‌ అసోషియేషన్లు రద్దైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆందోళన వ్యక్తం చేశాయి. అదే సమయంలో మార్గదర్శకాలు జారీ చేయాలని కోరాయి. దీంతో.. న్యాయపరమైన సలహాలు ఇవ్వడం తప్పెలా అవుతుంది? అని ఈడీ తీరును సుప్రీం కోర్టు తప్పుబట్టింది. అయితే గుజరాత్‌లో ఓ హత్య కేసులో నిందితుడికి న్యాయవాది సలహా ఇవ్వడాన్ని ఈడీ ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ వ్యవహారంలో ఈడీని నెగెటివ్‌గా చూపించే ప్రయత్నం జరుగుతోందంటూ సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. అయితే అది వేరే సందర్భమన్న సీజేఐ బెంచ్‌.. న్యాయవాదిని సమన్లు ఇవ్వాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలనే విషఁఆన్ని గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో మార్గదర్శకాల రూపకల్పనకు అమీకస్‌ క్యూరీని నియమిస్తామంటూ వచ్చేవారానికి విచారణ వాయిదా వేసింది.మూడా (MUDA) కేసు నేపథ్యంకర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య B.M. పర్వతికి సంబంధించి మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) ద్వారా భూ కేటాయింపులపై అక్రమతల ఆరోపణలతో ప్రారంభమైంది. సుమారు 3.16 ఎకరాల భూమి పర్వతి పేరుతో ఉంది, ఇది MUDA ద్వారా డెనోటిఫై చేయబడిన తర్వాత రెసిడెన్షియల్ లేఅవుట్గా అభివృద్ధి చేయబడింది. MUDA ఈ భూమిని ఉపయోగించినందుకు పర్వతి 14 ప్లాట్లు (ప్రతి ఒక్కటి ₹2 కోట్ల విలువ) విజయనగర ప్రాంతంలో పొందారు. అయితే.. బీజేపీ, JD(S) వంటి ప్రతిపక్షాలు దీన్ని ₹4,000 కోట్ల స్కాంగా అభివర్ణించాయి. మూడా (MUDA) కేసు కోర్టు విచారణ టైం లైన్కర్ణాటక గవర్నర్ తావార్చంద్ గెహ్లాట్ 2024 ఆగస్టు 17న MUDA కేసులో ED విచారణకు అనుమతి ఇచ్చారు. తద్వారా ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లైంది. ED తన Enforcement Case Information Report (ECIR) నమోదు చేసి, పర్వతి (CM భార్య) సహా ఇతరులపై ప్రీలిమినరీ విచారణ ప్రారంభించింది. ఆగస్టు 19, 2024👉 సీఎం సిద్ధరామయ్య గవర్నర్ ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.👉 ED విచారణకు అనుమతి ఇచ్చిన గవర్నర్ ఆదేశాన్ని రద్దు చేయాలని కోరారు.ఆగస్టు 29, 2024👉 హైకోర్టు ప్రత్యేక కోర్టును MUDA కేసులో తాత్కాలికంగా ఆదేశాలు ఇవ్వకుండా ఉండమని సూచించింది.👉 విచారణ తదుపరి తేదీకి వాయిదా వేసింది. సెప్టెంబర్ 12, 2024👉 హైకోర్టు విచారణ పూర్తిచేసి తీర్పును రిజర్వ్ చేసింది.👉 న్యాయమూర్తి M. నాగప్రసన్న రెండు పక్షాల వాదనలు ఆఖరి రోజులోనే ముగించాలని స్పష్టం చేశారు.సెప్టెంబర్ 24, 2024👉 కర్ణాటక హైకోర్టు సీఎం సిద్ధరామయ్య పిటిషన్‌ను తిరస్కరించింది.👉 గవర్నర్ అనుమతి చట్టబద్ధమైనదే అని తీర్పు ఇచ్చింది.2025 మార్చి 7కర్ణాటక హైకోర్టు సిద్ధరామయ్య సతీమణి B.M. పార్వతికి ఉపశమనంMUDA భూ కేటాయింపు కేసులో, ED జారీ చేసిన సమన్లను హైకోర్టు రద్దు చేసింది. న్యాయమూర్తి M. నాగప్రసన్న ఈ తీర్పును ఇచ్చారు, పార్వతి, మంత్రి బైరతి సురేష్‌ దాఖలు చేసిన పిటిషన్లను విచారించి, ED చర్యలు చట్టపరంగా నిలబడవని తేల్చారు. Money Laundering Act (PMLA) ప్రకారం, “proceeds of crime” అనే అంశం స్పష్టంగా లేకపోతే, ED విచారణ కొనసాగించలేదని కోర్టు అభిప్రాయపడింది. పార్వతి 14 ప్లాట్లు స్వచ్ఛందంగా తిరిగి అప్పగించడంతో, ఆర్థిక లాభం పొందలేదని కోర్టు గుర్తించింది. సమన్లు జారీ చేయడం చట్టబద్ధంగా కాదని తీర్పు ఇచ్చారు.జూలై 21, 2025👉 సుప్రీం కోర్టు ఈ కేసులో ED అప్పీల్‌ను తిరస్కరించింది.👉 “రాజకీయ పోరాటాలు ప్రజల మధ్య జరగాలి, కోర్టుల్లో కాదు” అని CJI BR గవాయ్ వ్యాఖ్యానించారు.

Wife Carries Husband On Her Back For 150 km During Kanwar Yatra Goes Viral8
కలియుగ సుమతీ..150 కిలోమీటర్లు భర్తను వీపుపై మోసుకెళ్లి..!

పౌరాణిక గాథల్లో సుమతీ అనే పతివ్రత కథ గురించి విన్నాం. పరమ కోపిష్టి అయిన భర్త కౌశికుడుని ఓపికతో వ్యవహరించి తన కాపురాన్ని చక్కదిద్దుకుంటుంది. ఆమె కథ దుర్మార్గుణ్ణి ఓపికతో పరివర్తన చెందేలా చేయడం గురించి వివరిస్తుంది. ఇక్కడ ఈ ఇల్లాలి భర్త అంత దుర్మార్గుడు కాదు. కానీ కుష్ఠు రోగంతో బాధపడుతున​ భర్తకు సుమతీ చేసిన సపర్యలను తలపించేలా తన భర్తకు చేస్తుందామె. ఆమెను చూస్తే ఈ కాలంలో ఇలాంటి భార్యలు ఉన్నారా అని ఆశ్చర్యకలుగుతుంది. ఇంత​​కీ ఆ మహాసాధ్వి కథేంటంటే..ఘజియాబాద్‌లోని మోడీనగర్‌లోని బఖర్వా నివాసితులు ఆశా, సచిన్‌ దంపతులు. శ్రావణ మాసంలో ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కన్వర్‌ యాత్రను చేస్తుంటారు. ఇది శ్రావణ మాసంలో (జూలై-ఆగస్టు) జరుగుతుంది. ఈ సమయాన్ని శివుని ఆరాధనకు అత్యంత విశిష్టమైన కాలంగా భావిస్తారు. శివ భక్తుల తీర్థయాత్రనే కన్వర్‌ యాత్ర అంటారు. ఈ యాత్రలో భాగంగా భక్తులు హరిద్వార్, గంగోత్రి, రిషికేష్ వంటి ప్రాంతాల నుంచి గంగాజలాన్ని కావడిలో (కన్వర్) నింపుకుని తమ ప్రాంతాల్లోని శివాలయాలకు కాలినడకన తీసుకెళ్తారు. ఈ గంగాజలంతో శివలింగానికి అభిషేకం చేస్తారు. ఇక్కడ కన్వర్‌ అనేది వెదురు కర్ర, దానికి రెండు వైపులా నీటి కుండలు వేలాడేలా కట్టి భుజాలపై మోస్తారు కాబట్టి దీన్ని కన్వర్‌ యాత్ర అంటారు. ఇక్కడ ఆశా భర్త సచిన్‌ గత 13 ఏళ్లుగా కాలినడకనఈ యాత్ర చేస్తున్నాడు. అయితే గతేడాది వెన్నుకి గాయం కావడంతో పక్షవాతానికి గురయ్యాడు. దాంతో ఈ ఏడాది ఆ యాత్ర చేసే అవకాశం లేకుండాపోయింది. అయితే అతడి భార్య..అతడి నియమానికి ఆటంకం కలగకుండా అతడిని వీపుపై మోసుకుంటూ కన్వర్‌యాత్ర చేయ తలపెట్టింది. కూడా ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. ఆశా ఏకంగా 150 కిలోమీటర్లు భర్తను వీపుపై మోసుకుంటూ కాలినడకన యాత్ర పూర్తిచేసింది. ఆమె అపారమైన భక్తి, భర్తపై ఉన్న అచంచలమైన ప్రేమ చుట్టూ ఉన్న యాత్రికులను కూడా మంత్రముగ్దుల్ని చేశాయి. నిజంగా ఆ మహాతల్లి సాహసం స్ఫూర్తిని కలిగించడమే గాక ఎందరినో కదలిచింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు కూడా స్వర్గంలో ముడివేసిన గొప్ప బంధం అంటే ఈ జంట కాబోలు అంటూ ఆ మహాతల్లి ఆశపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.(చదవండి: 58 ఏళ్ల నాటి తాతగారి బెంజ్‌కారు..! ఇప్పటికీ..)

KSR Comment: CM Chandrababu Build Up Statements9
CBN: హద్దుల్లేని స్వోత్కర్ష ఎంత కాలం?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌లు పెట్టుబడులకు సంబంధించి చేసే ప్రకటనలు గమ్మత్తుగా ఉంటాయి. ఎప్పుడు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతారో.. ఎవరూ ఊహించ లేరు. తాజాగా చంద్రబాబు ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ఏకంగా రూ.పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించిందని అన్నారు. దాంతోపాటే ఎనిమిదిన్నర లక్షల ఉద్యోగావకాశాలు వస్తాయని అని కూడా వక్కాణించారు. రానున్న నాలుగేళ్లలో ఇంకో రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు సాధిస్తామని కూడా చెప్పారు. నిజమైతే సంతోషపడవచ్చు కానీ.. రాష్ట్రంలో పరిస్థితులు అలా లేవు. ఇండోసోల్‌ వ్యవహారమే పైన చెప్పుకున్నదానికి ఒక ఉదాహరణ. ఈ కంపెనీ సౌర విద్యుత్తు పరిశ్రమ కోసం రూ.70 వేల కోట్ల పెట్టుబడులు సిద్ధం చేసుకుంది. ఇప్పటికే వందల కోట్ల రూపాయల వ్యయం కూడా చేసింది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం తీరు పుణ్యమా అని ఇప్పుడు ఆ కంపెనీ భవిష్యత్తు గందరగోళంలో పడిపోయింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ కంపెనీ కూడా సాహసిస్తుందా?. ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ టాటా గ్రూపు సంస్థల ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ నేతృత్వంలోని బృందం తయారు చేసిన టాస్క్‌ఫోర్స్‌ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదిలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చెప్పారు. అయితే ఇది ఆ సమావేశంలో పాల్గొన్న వారికి కూడా ఆశ్చర్యం కలిగించి ఉంటుంది. చంద్రశేఖరన్‌ వంటి బిజీ పారిశ్రామికవేత్త ఒక రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక తయారు చేసేంత తీరిక ఉంటుందా? అన్నది ప్రశ్న. నివేదికకు కాస్త మర్యాద దక్కుతుందని ఆయన పేరు జోడించారేమో తెలియదు! అయినా ఫర్వాలేదు కానీ ఆ నివేదికను పరిశీలించినా, చంద్రబాబు మాటలు చూసినా నేల విడిచి సాము చేసే తీరులోనే ఉన్నట్టు అనిపించక మానదు. 2014-19 మధ్యకాలంలోనూ చంద్రబాబు ఇలాంటి సమావేశాలు బోలెడు పెట్టారు. అదిగో పెట్టుబుడులు.. ఇదిగో అభివృద్ధి అని డాబుసరి కబుర్లు చెప్పేవారు. 2029 నాటికి ఏపీ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రం అవుతుందని, ఆ తర్వాత ప్రపంచంలోనే టాప్-5లో ఉంటుందని ఏవేవో చెప్పేవారు. అంతేకాదు.ఆయా జిల్లాలలో ఏఏ రంగాలను అభివృద్ది చేస్తారో, ఏ ప్రాజెక్టులు వస్తాయో చెబుతూ అసెంబ్లీలో పెద్ద స్పీచ్ ఇచ్చారు కూడా. అప్పట్లో వైసీపీలో ఉండి.. ఇప్పుడు టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి చంద్రబాబు ప్రకటనలు రియల్‌ ఎస్టేట్‌ బ్రోచర్‌తో పోల్చారు కూడా. చివరకు అయ్యింది కూడా అదే. చంద్రబాబు హామీలేవీ అమలు కాలేదు.2024లో అధికారం దక్కిన తరువాత మరోమారు చంద్రబాబు తన పాత స్టైల్‌ను భుజాలకు ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది తాజా ప్రకటన చూస్తే. గత ఏడాది దావోస్‌ పర్యటనకు ముందు కూడా నానా ఆర్భాటమూ జరిగింది. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేస్తాయని టీడీపీ మీడియా ఊదరగొట్టింది. తీరా చూస్తే వచ్చింది హళ్లికి హళ్లి! దీని కవరింగ్‌ కోసం ‘‘ఏపీ గుడ్‌విల్‌ పెంచేందుకు వెళ్లాము తప్ప పెట్టుబడుల కోసం కాదు’’ అన్న బుకాయింపులు! దావోస్‌ పర్యటన వైఫల్యంతో చంద్రబాబు తన రూటు మార్చారు. కొంతకాలం తరువాత రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయి అని ప్రకటించారు. ఆ తరువాత ఈ అంకెలు ఐదు లక్షల కోట్లకు, మరికొన్ని నెలలకు ఎనిమిది లక్షల కోట్లకు చేరుకున్నాయి. మంత్రి లోకేశ్‌ ఈ విషయాన్ని శాసనమండలిలోనూ ప్రకటించారు. లక్షల ఉద్యోగాలు వచ్చేశాయన్న చందంగా జవాబు ఇవ్వడం వివాదాస్పదమైంది కూడా. ఇప్పుడు తాజాగా చంద్రబాబు పాట రూ.పది లక్షల కోట్లకు చేరుకుంది!. పారిశ్రామిక దిగ్గజాలుగా పేరొందిన మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలకే మూడు, నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం కష్టంగా ఉంటే, ఆ స్థాయిలో పారిశ్రామికీకరణ జరగని ఏపీకి ఏడాదిలోనే రూ.పది లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయని సీఎం చెబితే వెరైనా నమ్ముతారా? సీఐఐ సదస్సుల్లో పాల్గొనే పారిశ్రామికవేత్తలకు ఈ విషయాలు తెలియవా? కనీసం వచ్చిన పెట్టుబడులు ఏ ఏ రంగాలకు చెందినవి, ఏ కంపెనీలు పెడుతున్నాయని చెప్పి ఉంటే కొంతైనా నమ్మకం కలిగేదేమో! అదేమీ చేయరు. తోచిన గణాంకాలు చెప్పడం తప్ప వాటికి ఆధారాలు చూపే అలవాటు లేదు. గతంలో జగన్ ప్రభుత్వం అప్పులు చేస్తోందంటూ నోటికి వచ్చిన అంకెను చెబుతుండే వారు. చివరకు ఈ అప్పుల అంకె రూ.14 లక్షల కోట్లకు చేరుకుంది కూడా. కానీ బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి స్వయంగా అప్పులు రూ.ఆరు లక్షల కోట్లేనని ఒప్పుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు వ్యవహార శైలి ఇలా ఉంటుంది!. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్శించాలన్న చిత్తశుద్ధి ఉంటే.. జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండగా రామాయపట్నం వద్ద ఇండోసోల్‌ రూ.40 వేల కోట్లతో ప్రతిపాదించిన సౌరశక్తి పరిశ్రమకు కొత్త చిక్కులు తెచ్చే వారా! ఆ కంపెనీ ఇప్పటికే రూ.1200 కోట్ల వరకూ వ్యయం చేసింది. పంటలు పెద్దగా పండని భూములు ఐదువేల ఎకరాలను ఈ కంపెనీ రూ.500 కోట్లతో సేకరిస్తే... ప్రభుత్వం ఇప్పుడు వాటిని వెనక్కు తీసుకోవాలని ప్రయత్నించడం ఎంతవరకూ సబబు? భూములివ్వమని భీష్మించుకున్న కరెడు ప్రాంతంలో భూ సేకరణకు నోటిఫికేషన్‌ ఇవ్వడం ఆ కంపెనీ భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టేయడమే అవుతుంది. పైగా ఇండోసోల్‌ సేకరించిన భూమిని వస్తుందో, రాదో తెలియని బీపీసీఎల్‌కు ఇస్తారట. దీనికి వేరేచోట భూమి కేటాయిస్తే నష్టమేమిటి? ఈ విషయాలు.. దాని వెనుక మతలబులు పారిశ్రామిక వర్గాలకు తెలియకుండా ఉంటాయా?.. రానున్న పాతికేళ్లలో 2.4 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యమని కూడా చంద్రబాబు ఆ సమావేశంలో ప్రకటించారు. ఇది కూడా గతంలో చంద్రబాబు చెప్పిన ‘విజన్‌-2020’ బాపతు వ్యవహారమే. ఒక్కసారి ఆ డాక్యుమెంట్‌ తరచి చూస్తే బాబుగారి డొల్లతనం ఏమిటో బయటపడుతుంది. పాతికేళ్ల క్రితం కుటుంబానికో ఐటి ఫ్రొఫెషనల్ నినాదంతో పని చేశామని చంద్రబాబు చెప్పడం ఇంకో విడ్డూరం. బెంగళూరు, చెన్నై, పూణె వంటి నగరాలు ఐటీకి పెట్టింది పేరుగా ఉన్న ఆ సమయంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఐటీ రంగం పురోగమించాలన్న లక్ష్యంతో హైటెక్‌ సిటీకి శంకుస్థాపన కూడా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తరువాత సీఎం పీఠమెక్కిన చంద్రబాబు భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. అంతే. కానీ.. హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని తానే మొదలుపెట్టానని, హైటెక్‌ సిటీ మొత్తం తన సృష్టి అని మాట్లాడటం అతిశయోక్తి తప్ప ఇంకోటి కాదు. 2004- 2009 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్‌ రింగ్‌రోడ్డు వంటి అద్భుత మౌలిక సదుపాయాలను కల్పించారు. దీంతో నగరం రూపురేఖలు మరింత మారిపోయాయి. కానీ కాంగ్రెస్ పార్టీ దానిని సరిగా ప్రచారం చేసుకోలేకపోయింది.2004లో ఓటమి పాలైన తర్వాత చంద్రబాబుకు హైదరాబాద్‌తో అధికారికంగా సంబంధం లేనట్లే. కానీ.. రెండు దశాబ్దాల తర్వాత కూడా హైదరాబాద్ తనే అభివృద్ది చేశానని చెప్పుకుంటూటారు ఆయన! విభజన తరువాత 2014లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. ఐటీలో హైదరాబాద్‌ను తానే వృద్ధి చేశానని చెప్పిన మాటలే నిజమైతే 2014- 19 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌కు ఆ స్థాయిలో ఎందుకు ఐటీ పరిశ్రమలను తేలేకపోయారన్నది ప్రశ్న. విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాలను ఎందుకు అభివృద్ది చేయలేకపోయారు? స్వోత్కర్ష చంద్రబాబుకు బాగా వచ్చు. మిగిలిన వారు సెల్ఫ్‌ డబ్బా అని విమర్శించినా పట్టించుకోరు. ఇతర రాష్ట్రాల నుంచో, ఇతర దేశాల నుంచో ఎవరో ఒకరిని తీసుకు వస్తారు. మర్యాద కోసం వారు ఆయనను ఉద్దేశించి ఒక మాట పొగిడితే, దానిని తెలుగుదేశం మీడియాతో హోరెత్తేలా ప్రచారం చేయించుకోగలరు. ఇప్పుడు పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పడం కూడా అలాంటి వ్యూహంలో ఒక భాగమే!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Auto Cabs Charges Increase In Hyderabad10
హైదరాబాద్‌లో ఇష్టారాజ్యంగా ఆటో, క్యాబ్‌ చార్జీల పెంపు!

సాక్షి, హైదరాబాద్: తిరుమలగిరి ఆర్టీసీ కాలనీకి చెందిన శ్రీనివాస్‌ ఆదివారం సాయంత్రం తార్నాక నుంచి ఇంటికి వెళ్లేందుకు క్యాబ్‌ను ఆశ్రయించాడు. సాధారణంగా అయితే క్షణాల్లో బుక్‌ అయిపోయే క్యాబ్‌లకు అనూహ్యంగా డిమాండ్‌ నెలకొంది. చివరకు పావుగంట తర్వాత ఓ అగ్రిగేటర్‌ సంస్థకు చెందిన క్యాబ్‌ బుక్‌ అయింది. ఆన్‌లైన్‌ యాప్‌లో కనిపించిన చార్జీలు చూసి అతడు బెంబేలెత్తాడు. సాధారణంగా తార్నాక నుంచి తిరుమలగిరికి రూ.250 లోపే ఉంటుంది. కానీ ఆదివారం సాయంత్రం ఏకంగా రూ.530 వరకు పెరిగింది. మరో గత్యంతరం లేక ఎక్కువ చార్జీలు చెల్లించేందుకు సిద్ధపడి క్యాబ్‌ ఎక్కేశాడు. ఇది కేవలం శ్రీనివాస్‌కు ఎదురైన సమస్య మాత్రమే కాదు, నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు క్యాబ్‌ అగ్రిగేటర్లకు కాసులు కురిపిస్తున్నాయి. ఆటోలు, క్యాబ్‌ల నిర్వహణలో స్లాక్‌ (రద్దీ లేని), పీక్‌ (రద్దీ ఉన్న) సమయాలుగా ఎలాంటి విభజన లేకపోయినప్పటికీ అడ్డగోలుగా చార్జీలు పెంచి ప్రయాణికుల జేబులు గుల్ల చేయడం గమనార్హం. ఆన్‌లైన్‌లోనే బేరసారాలు.. కొన్ని అగ్రిగేటర్‌ సంస్థలు ఆన్‌లైన్‌లోనే బేరసారాలకు దిగుతున్నాయి. ఉప్పల్‌కు చెందిన ఓ ప్రయాణికుడు సికింద్రాబాద్‌ వరకు వెళ్లేందుకు ఒక ఆటోను బుక్‌ చేసుకున్నాడు. మొదట రూ.150 వరకు చార్జీలు కనిపించాయి. సరేననుకొని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. కానీ.. ఎంపిక చేసుకున్న చార్జీలకు ఆటోడ్రైవర్‌ సుముఖంగా లేడంటూ ఐదు నిమిషాల తర్వాత మొబైల్‌ స్క్రీన్‌పై కనిపించింది. అంతే కాదు. అదనపు చార్జీలు చెల్లిస్తే ఆటో లభించవచ్చని సంకేతం, దాంతో మరో రూ.20 అదనంగా చెల్లించేందుకు సిద్ధమయ్యాడు. అయినా ఆటో రాలేదు. అలా చివరకు రూ.50 ఎక్కువ చెల్లించేందుకు అంగీకరించిన తర్వాత క్షణాల్లో ఆటో వచి్చంది. దీంతో సదరు ప్రయాణికుడు బిత్తరపోయాడు. ఇలా కొన్ని ఆటో, క్యాబ్‌ అగ్రిగేటర్‌ సంస్థలు ఆన్‌లైన్‌లోనే బేరసారాలకు దిగుతున్నాయి. మొదట తక్కువ చార్జీలను ప్రదర్శించి ఆ తర్వాత ప్రయాణికుడి అత్యవసరాన్ని సొమ్ము చేసుకొనేందుకు బేరసారాలకు దిగుతున్నాయి. కొన్ని అగ్రిగేటర్‌ సంస్థలకు చెందిన యాప్‌లలో ఈ ఆప్షన్‌ కొత్తగా కనిపించడం గమనార్హం. మరోవైపు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికులకు మాత్రం పలు సంస్థలకు చెందిన క్యాబ్‌లు పట్టపగలు చుక్కలు చూపిస్తున్నాయి. క్యాబ్‌ బుక్‌ అయిన తర్వాత ఆకస్మికంగా రద్దవుతున్నాయి. ఎంపిక చేసుకున్న క్యాబ్‌ కోసం చాలా సేపటి వరకు పడిగాపులు కాసి చివరకు ప్రయాణికులే తమకు తాముగా రద్దు చేసుకొనేవిధంగా కొందరు డ్రైవర్లు వ్యవహరిస్తున్నారు. మెట్రోల్లో పెరిగిన రద్దీ.. నగరంలోని వివిధ మార్గాల్లో ఆదివారం మెట్రో రైళ్లలోనూ రద్దీ కనిపించింది. బోనాల సందర్భంగా ప్రయాణికులు వివిధ ప్రాంతాల మధ్య ఎక్కువగా రాకపోకలు సాగించారు. దీంతో నాగోల్‌–రాయదుర్గం, ఎల్‌బీనగర్‌–మియాపూర్‌ కారిడార్‌లలో సాయంత్రం పలు మెట్రో స్టేషన్‌లలో సందడి నెలకొంది, సాధారణంగా సెలవు రోజుల్లో రద్దీ తగ్గుముఖం పడుతుంది. కానీ ఆదివారం బోనాల వేడుకలు, వర్షం కారణంగా ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయించారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement