’ఐఎన్ ఐసెట్‌లో పలమనేరు విద్యార్థినికి జాతీయస్థాయి 38 ర్యాంకు కై వసం
పీజీ ఐఎంఈర్(చండీఘర్)లో పీజీలో ఉచిత సీటు
పలమనేరు: పట్టణానికి చెందిన డాక్టర్ సుబ్రమణ్యం, సావిత్రి దంపతుల కుమార్తె డాక్టర్ హర్షిత ఇటీవల వెలువడిన ఎయిమ్స్ పీజీ సెట్‌లో 99.93 మార్కులు సాధించి జాతీయస్థాయిలో 38వ ర్యాంకు సాధించింది. దీంతో ఆమెకు ప్రతిష్టాత్మక పీజీ ఐఎంఈఆర్ చంఽడీఘర్‌లో జనరల్ మెడిసిన్ సీటు ఉచితంగా దక్కించుకుంది.
ఆమె కర్నూలు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. జాతీయ స్థాయిలో జరిగిన పీజీ సెట్ రాసి, ఇంతటి ఘనవిజయాన్ని సాధించి పలమనేరుకు పేరు తీసుకొచ్చింది. ఈ విద్యార్థినికి పట్టణవాసులు అభినందనలు తెలిపారు. మరోవైపు తమ కుమార్తె విజయం సాధించడంపై తల్లిదండ్రులు సైతం హర్షం వ్యక్తం చేశారు. కాగా తల్లిదండ్రులు డాక్టర్లు, హర్షిత అక్కాబావలు సైతం డాక్టర్లే కావడంతో ఆ ఇంట్లో అందరూ వైద్యులే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment