పోస్టాఫీస్‌లో ఉద్యోగాలు
చిత్తూరు కార్పొరేషన్ : తపాలా కొలువుల భర్తీకి ఆ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల భర్తీలో భాగంగా ప్రతిభ ఆధారంగా ఉద్యోగులను ఎంపిక చేయనున్నారు. బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్)లను పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు.
ఖాళీల వివరాలు ఇలా
డివిజన్ పరిధిలో మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనున్నారు. చిత్తూరు హెచ్‌ఓ–3, మిట్టూరు బీఓ, మురకంబట్టు, తుమ్మిందపాళ్యం, వరత్తూరు, వెంగనపల్లె, గుడిపాల, నంగమంగళం, నరహరిపేట, బైరుపల్లి, బసినికొండ, బేలుపల్లి, బురకాయలకోట, చెల్దిగానిపల్లి, చెరుకువారిపల్లి, చౌడేపల్లి ఎస్‌వో–2, దేవళచెరువు, ఈడిగపల్లి, గొల్లపల్లి, గొల్లపల్లి బీఆరేకే, గుడుపల్లె, ఐరాల, కడపనత్తం, కగతి, కనమనపల్లి, కట్టకిందపల్లి, కీరమంద, కోసువారిపల్లి, మదనపల్లి హెచ్‌ఓ–3, మద్దినాయనిపల్లి, మల్లన్ ఆర్‌ఎస్, మందిపెట్కూరు, ముదివేడు, ముసలికుంట, ముస్టూరు, ముత్తుకూరు, నరసింహాపురం, నెలవాయి, బడ్డేపల్లె, పల్లికుప్పం, పట్నం, పెద్దబంగారునత్తం, పెద్దచెల్లారగుంట, పీటీఎం, రిషివ్యాలీ, రాయల్‌పేట, సింహరాజపురం, ఎద్దులవారిపల్లె, ఎర్రేపల్లె బీఓలు ఖాళీగా ఉన్నాయి.
అర్హతలు ఇవీ..
పదో తరగతి ఉత్తీర్ణులై వయస్సు 18–40 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయో పరిమితి ఉంది. దీని కోసం అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఇండియా పోస్ట్ జీడీఎస్ వెబ్‌సైట్‌లో మార్చి 3 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. అధికారులు అన్నింటిని పరిశీలించి తుది జాబితాను ప్రకటించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తపాలాశాఖ సూపరింటెండెంట్ లక్ష్మణ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment