ముగిసిన లక్ష కుంకుమార్చన
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో మాఘమాసం నెలలో అత్యంత వైభవంగా నిర్వహించే లక్ష కుంకుమార్చన పూజలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛరణాల మధ్య ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ మూర్తికి ప్రత్యేక పూజలు చేసి దంపతులకు పూజా సామగ్రి అందజేశారు. అమ్మవారి ఉత్సవమూర్తి ఎదుట ప్రత్యేక పూజలు, గణపతి, చండీ హోమం, పూర్ణాహుతి, మహా మంగళహారతి చేశారు. 145 మంది దంపతులు హాజరై కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయంలో రద్దీ నెలకొంది.
లక్ష కుంకుమార్చన పూజలో పెద్దిరెడ్డి సతీమణి
బోయకొండ గంగమ్మ ఆలయంలో మూడు రోజులు గా జరుగుతున్న లక్ష కుంకుమార్చన కార్యక్రమానికి మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి స్వర్ణమ్మ శుక్రవారం హాజరై పూ జలు చేశారు. అనంతరం ఈఓ అమ్మవారి తీర్థ ప్రసాదాలతో పాటు జ్ఞాపికను అందజేసి సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment