చిత్తూరు కలెక్టరేట్ : ఐసీడీఎస్ శాఖలో ఖాళీ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 19, 20 వ తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పీడీ వెంకటేశ్వరి తెలిపారు. సోమవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. మిషన్ వాత్సల్య పథకం కౌన్సిలర్, అవుట్‌రిచ్ వర్కర్ పోస్టు ఉద్యోగాలను ఈ నెల 19న , మిషన్ శక్తి పథకంలో ఖాళీగా ఉన్న పోస్టులకు 20 న ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు. పోస్టుల వారీగా అర్హత పొందిన అభ్యర్థుల వివరాలను www.chittoor.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసినట్లు వివరించారు. అభ్యర్థులు ఒరిజనల్ గుర్తింపు కార్డు, విద్యార్థత సర్టిఫికెట్‌లు, అనుభవం, కుల ధ్రువీకరణపత్రాలతో కలెక్టరేట్‌లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు.
పరిశోధనలో పరస్పర సహకారం
తిరుపతి సిటీ: పరిశోధనలో ఎస్వీయూ, అమెరికాలోని పార్థు యూనివర్సిటీ పరస్పర సహకారం అందించుకోనున్నట్లు యూఎస్‌ఏ ప్రతినిధి జూలియానా కస్తవన్ తెలిపారు. ఆమె సోమవారం ఎస్వీయూ ఫిజిక్స్ విభాగాన్ని సందర్శించారు. ఆ విభాగం హెడ్ ప్రొఫెసర్ దేవప్రసాద్ రాజు, ఇతర ప్రొఫెసర్లతో ఆమె సమావేశమయ్యారు. గతంలో వర్సిటీతో తమ యూనివర్సిటీ ఎంఓయూ చేసుకుందనీ, ఈ ప్రకారం బోధన, పరిశోధన విషయాల్లో పరస్పరం సహకారం ఉంటుందని తెలిపారు. అనంతరం జూలియానా కస్తవన్‌ను ఫిజిక్స్ అధ్యాపకులు జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు విజయలక్ష్మి, అపర్ణ, రుద్రమదేవి పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment