‘పరికరాలు’..
చిత్తూరు అర్బన్ : కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విభిన్న ప్రతిభావంతులకు పరికరాలు మంజూరు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా సదస్సులు నిర్వహించింది. గంగాధరనెల్లూరు, చిత్తూరు, నగరి, పలమనేరు, పూతలపట్టు, కుప్పం ప్రాంతాల్లో క్యాంపులు చేపట్టింది. ఎవరెవరికి ఏయే ఉపకరణాలు కావాలో వినతులు ఇవ్వాలని కోరింది. దీంతో 4,697 మంది ప్రతిభా వంతులు ప్రత్యేక పరికరాల కోసం దరఖాస్తులు అందజేశారు. అయితే, ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఎలాంటి పరికరం అందించలేదు. ఈ క్రమంలో మండల కార్యాలయాల నుంచి కలెక్టరేట్ వరకు పరికరాల కోసం దివ్యాంగులు తిరుగుతూనే ఉన్నారు. ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసి, ఉపకరణాలు పంపితే తప్ప తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి పెద్ద పీటవేసింది. కళ్లు కనిపించని వాళ్లకు ఫోల్డింగ్ స్టిక్స్, కాళ్లు పనిచేయని వాళ్లకు కర్రలు, పూర్తి వైకల్యంతో బాధపడే వాళ్లకు బ్యాటరీ ట్రై సైకిళ్లు, వీల్‌చైర్లు, వినికిడి సమస్యతో ఉన్న వాళ్లకు మిషన్లు, డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్లకు ల్యాప్‌టాప్‌లు, టచ్ ఫోన్లను పంపిణీ చేసింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ నిధులతోపాటు ఉమ్మడి జిల్లాలో ఎంపీలుగా పనిచేసిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, రెడ్డెప్ప ద్వారా ఎంపీ నిధుల నుంచి దాదాపు రూ.12 కోట్లు విడుదల చేయించింది. సుమారు 32 వేల మంది విభిన్న ప్రతిభావంతులకు పరికరాలను అందించింది. కానీ, ప్రస్తుతం జిల్లాలో ప్రత్యేక అవసరాలున్న వారికి కనీసం చేతికర్ర కూడా అందకపోవడం గమనార్హం.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో..
ప్రత్యేక ఉపకరణాల కోసం 8 నెలలుగా నిరీక్షిస్తున్న దివ్యాంగులు
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న దరఖాస్తుదారులు
ప్రభుత్వం నిర్లక్ష్యంతో విభిన్న ప్రతిభావంతుల అవస్థలు
కనీసం మాత్రం పట్టించుకోని అధికారులు
Comments
Please login to add a commentAdd a comment