ట్రాన్స్‌కో ఉద్యోగుల బదిలీకి చర్యలు | - | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌కో ఉద్యోగుల బదిలీకి చర్యలు

Published Tue, Feb 18 2025 2:05 AM | Last Updated on Tue, Feb 18 2025 2:02 AM

ట్రాన

ట్రాన్స్‌కో ఉద్యోగుల బదిలీకి చర్యలు

చిత్తూరు కార్పొరేషన్‌: ట్రాన్స్‌కో ఉద్యోగుల బదిలీలను ఈనెలాఖరులోపు పూర్తి చేయాలని సీఎండీ సంతోషరావు ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. తిరుపతి, చిత్తూరులోని ఎస్‌ఈ కార్యాలయాల పరిధిలో మొత్తం 55 మంది ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కమిటీలో సీజీఎం ఓఎన్‌ఎం, సీజీఎం రెవెన్యూ, ఆడిట్‌, తిరుపతి, చిత్తూరు ఎస్‌ఈ సభ్యులుగా ఉన్నారు. ఉద్యోగుల బదిలీ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. తిరుపతి నుంచి చిత్తూరుకు బదిలీ చేసిన ఉద్యోగులు రెండు నెలలుగా దాగుడుమూతలు ఆడుతున్న విషయం తెలిసిందే. వీటిపై ఉన్నతాధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పుంగనూరులో దేవాంగపిల్లి

పుంగనూరు : స్థానిక డాన్‌బాస్కో పాఠశాల ఆవరణలో సోమవారం అరుదైన దేవాంగపిల్లి ప్రత్యక్షమైంది. స్కూలు సిబ్బంది సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు చేరుకుని దేవాంగపిల్లిని స్వాధీనం చేసుకున్నారు. ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ కిరణ్‌ కిషోర్‌ మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

22 నుంచి ప్రాజెక్టుల మహాసభ

చిత్తూరు రూరల్‌(కాణిపాకం) : సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో 25శాతం నిధులు కేటాయించాలని కోరుతూ ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు వైఎస్సార్‌ జిల్లా కడపలో ప్రాజెక్టుల మహాసభ నిర్వహించనున్నట్లు ఏపీ రైతు సంఘం ఉపాధ్యక్షుడు రామానాయుడు, నేత జనార్ధన్‌ వెల్లడించారు. సోమవారం చిత్తూరు సమీపంలోని హంద్రీ–నీవా కాలును సీపీఐ నేతలతో కలిసి పరిశీలించారు. అనంతరం మహాసభ కరపత్రాలను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే హంద్రీ–నీవా ప్రాజెక్టుకు రూ.5వేల కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అలాగే గాలేరు–నగరి, ఎస్‌ఎస్‌ కెనాల్‌ ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నిధులు పేర్కొనాలని కోరారు. రాయలసీమను నిర్లక్ష్యం చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ప్రాజెక్టు మహాసభకు పెద్దసంఖ్యలో రైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌.నాగరాజు, వీసీ గోపీనాథ్‌. మణి, దాసరి చంద్ర, విజయ్‌ కుమార్‌, విజయ గౌరి,, రమాదేవి, కుమారి, రఘు, లతా రెడ్డి, కవిత పాల్గొన్నారు.

గ్రామ కంఠం రక్షణకు వినతి

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): మండలంలలోని ఎగువమసాపల్లెలో కూటమి నేత నుంచి గ్రామ కంఠం భూమిని రక్షించాలని గ్రామస్తులు కోరారు. సోమవారం ఈ మేరకు చిత్తూరు రూరల్‌ తహసీల్దార్‌ లోకేశ్వరికి వినతిపత్రం అందించారు. గ్రామ కంఠం భూమిని సదరు నేత ఆక్రమించుకుని గోకులం షెడ్డు నిర్మించారని, దీనిపై ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. నకిలీ పత్రాలు సృష్టించి అధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని వెల్లడించారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా తమను ఏం చేయలేరని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కబ్జాలను తొలగించాలని కోరారు.

సత్వర న్యాయమే లక్ష్యం

చిత్తూరు అర్బన్‌: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి వినతిని క్షేత్రస్థాయిలో విచారించి, బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ మణికంఠ ఆదేశించారు. సోమవారం చిత్తూరులోని ఆర్ముడ్‌ రిజర్వు కార్యాలయంలో నిర్వహించిన పరిష్కార వేదికలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇందులో భూ వివాదాలు, మోసాలు, కుటుంబ తగాదాలు, వేధింపులు, ఆస్తి సమస్యలకు సంబంధించిన 33 ఫిర్యాదులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ట్రాన్స్‌కో ఉద్యోగుల బదిలీకి చర్యలు 
1
1/2

ట్రాన్స్‌కో ఉద్యోగుల బదిలీకి చర్యలు

ట్రాన్స్‌కో ఉద్యోగుల బదిలీకి చర్యలు 
2
2/2

ట్రాన్స్‌కో ఉద్యోగుల బదిలీకి చర్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement