యంత్రం.. ‘పచ్చ’తంత్రం
పల్లె ప్రాంతాల్లో పేదలకు పని కల్పించాలి.. వలసలు నివారించాలి.. కూలీల జీవితాలకు భరోసా అందించాలి.. ఇదే లక్ష్యంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభించారు. ఈ మేరకు రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులకు చేయూతనందిస్తున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం బడుగుల నోటి కాడ ముద్దను లాగేసుకుంటున్నారు. జేసీబీలతో ఉపాధి పనులు చేయించేస్తున్నారు. బినామీ కూలీల పేరుతో యథేచ్ఛగా నిధులు బొక్కేస్తున్నారు. అందులో భాగంగా శాంతిపురం మండలం కొలమడుగు పంచాయతీ రెడ్లపల్లి సమీపంలోని గుడిముందరి గుట్ట వద్ద సోమవారం జేసీబీతో ఫారంపాండ్ తవ్వకం చేపట్టారు. గోవిందపల్లె–తుమ్మిశి ప్రధాన రహదారి పక్కన దర్జాగా యంత్రాలతో ఉపాధి పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే నల్లగట్టుచేనులో మరో ఫారంపాండ్‌ను ఇప్పటికే జేసీబీతో తవ్వించేశారు. అధికారులు, సిబ్బందిని మామూళ్ల మత్తులో జోకొట్టి ఇష్టారాజ్యంగా ఉపాధి నిధులను దోచుకుంటున్నారు. – శాంతిపురం
యంత్రం.. ‘పచ్చ’తంత్రం
యంత్రం.. ‘పచ్చ’తంత్రం
Comments
Please login to add a commentAdd a comment