
మహిళా వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఉమ
తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఉమను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె 40 ఏళ్లపాటు బోధన, పరిశోధన రంగాల్లో పనిచేశారు. జాతీయ, అంతర్జాతీయ పబ్లికేషన్‌తో పాటు స్టేట్ బెస్ట్ టీచర్‌గా ప్రశంసలు పొందారు. మహిళా వర్సిటీకి రెక్టార్‌గా, ఇన్‌చార్జి వీసీగా పనిచేసిన ఆమెకు వర్సిటీ పాలనపై అవగాహన ఉంది. ప్రస్తు తం ఇన్‌చార్జ్‌గా వీసీగా కొనసాగుతున్న ఆమె బుధ వారం పూర్తి స్థాయి బాధ్య తలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సాధకారితే లక్ష్యంగా వర్సిటీని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment